AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Fingers: అరచేతుల చర్మం పగిలిపోతుందా? ఈ సమస్యకు పరిష్కారం ఇదిగో..

Dry Fingers Remedies: చాలా మంది అరచేతులపై చర్మం పొలుసులు పొలుసులుగా విడిపోతుంటుంది. చలి కాలంలో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపేందుకు కొన్ని హోమ్ రెమిడీస్ సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. చాలా మంది అరచేతి వేళ్లు, అరచేతులపై చర్మం పొట్టు పొట్టుగా లేస్తుంటుంది.

Dry Fingers: అరచేతుల చర్మం పగిలిపోతుందా? ఈ సమస్యకు పరిష్కారం ఇదిగో..
Dry Fingers
Shiva Prajapati
| Edited By: |

Updated on: Sep 26, 2023 | 10:15 PM

Share

Dry Fingers Remedies: చాలా మంది అరచేతులపై చర్మం పొలుసులు పొలుసులుగా విడిపోతుంటుంది. చలి కాలంలో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపేందుకు కొన్ని హోమ్ రెమిడీస్ సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. చాలా మంది అరచేతి వేళ్లు, అరచేతులపై చర్మం పొట్టు పొట్టుగా లేస్తుంటుంది. శీతాకాలంలో మాత్రమే కాకుండా నీటిలో ఎక్కువసేపు పనిచేయడం వల్ల కూడా వస్తుంది. కొన్నిసార్లు చర్మానికి అంటుకున్న ఇన్ఫెక్షన్ వల్ల చర్మం కూడా నలిగిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రజలు పార్లర్స్‌కి వెళ్లి భారీగా డబ్బు ఖర్చ పెడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడే చిట్కాలు తెలుసుకుందాం..

నీరు తాగాలి: మీ వేళ్లు పొడిగా ఉండటానికి కారణం.. శరీరంలో నీరు లేకపోవడం కావొచ్చు. కాబట్టి వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి.

నెయ్యి రాయండి: పొడి వేళ్లకు నెయ్యి రాయవచ్చు. ఈ సమస్యకు నెయ్యి కూడా మంచి ఎంపిక. నెయ్యి రాసుకోవడం వల్ల వేళ్లు పొడిబారడం తగ్గుతుంది. నెయ్యిలోని గుణాలు మీ వేళ్లపై చర్మం పొట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆలివ్ ఆయిల్, తేనె: ఆలివ్ ఆయిల్ సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. మీ వేళ్లు పొడిగా ఉంటే, ప్రతిరోజూ ఆలివ్ నూనెతో మసాజ్ చేయడం అలవాటు చేసుకోండి. ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల చర్మం పొడిబారడం తగ్గుతుంది. దీంతో మీ వేళ్లకు పుష్కలంగా పోషకాలు అందుతాయి. కావాలనుకుంటే, ఆలివ్ నూనెను తేనెతో కలిపి చర్మానికి అప్లై చేయవచ్చు.

అలోవెరా జెల్ అప్లై చేసి గ్లోవ్స్ ధరించడం: కొందరు నిరంతరం నీటిలో పని చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు తమ చేతులకు ఎల్లప్పుడూ గ్లోవ్స్ ధరించడం అలవాటు చేసుకోవాలి. నిరంతరం నీటిలో పని చేయడం వల్ల వేళ్లు ఎండిపోతాయి. చేతి తొడుగులు ధరిస్తే, పొడిబారే సమస్యను నివారించవచ్చు. ఇది ఉత్తమ ఆప్షన్. అయితే, దీనికంటే ముందుగా అలోవెరా జెల్ అప్లై చేసి, ఆపై గ్లౌజులు ధరించడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.

వెన్న: వేళ్లపై పొడిబారడాన్ని తగ్గించడానికి వెన్నను కూడా ఉపయోగించవచ్చు. కరిగించిన వెన్నని ఉపయోగించవచ్చు. రాత్రి పడుకునే ముందు ఈ వెన్నతో మర్దన చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..