Fruit Vendor Kindness: దానం చేయాలంటే కోటీశ్వ‌రులే అయ్యిండాలా.? అవ‌స‌రం లేదంటున్నాడీ చెన్నై చిరు వ్యాపారి..

Fruit Vendor Kindness: ప‌క్క‌ వారికి సాయం చేస్తే పుణ్యం వ‌స్తుంద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అయితే మ‌న‌లో చాలా మంది నా ప‌రిస్థితే బాగాలేదు నేను వేరేవారికి ఎలా స‌హాయం చేయ‌గ‌ల‌ను అంటూ...

Fruit Vendor Kindness: దానం చేయాలంటే కోటీశ్వ‌రులే అయ్యిండాలా.? అవ‌స‌రం లేదంటున్నాడీ చెన్నై చిరు వ్యాపారి..
Fruit Vendor
Follow us
Narender Vaitla

|

Updated on: May 27, 2021 | 4:46 PM

Fruit Vendor Kindness: ప‌క్క‌ వారికి సాయం చేస్తే పుణ్యం వ‌స్తుంద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అయితే మ‌న‌లో చాలా మంది నా ప‌రిస్థితే బాగాలేదు నేను వేరేవారికి ఎలా స‌హాయం చేయ‌గ‌ల‌ను అంటూ నిట్టూరుస్తుంటారు. బాగా డ‌బ్బులు సంపాదించిన వారే దానం చేస్తార‌ని అంద‌రూ భావిస్తుంటారు. కానీ మంచి మ‌న‌సు ఉండాలే కానీ డ‌బ్బుతో సంబంధం లేకుండా ఇత‌రుల‌కుసాయం చేయొచ్చ‌ని నిరూపిస్తున్నాడు చెన్నైకి చెందిన ఓ చిరు వ్యాపారి. క‌రోనా మ‌హ‌మ్మారి దేశ వ్యాప్తంగా ఎంతో మందికి ఉపాధి లేకుండా చేసింది. లాక్‌డౌన్ కార‌ణంగా ప‌నుల్లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇక రోడ్ల‌పై భిక్షాట‌న చేసుకుని బ‌తికే వారి ధీన స్థితి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలాంటివి చూసే చ‌లించి పోయాడు చెన్నైలోని తూతుక్కుడికి చెందిన ముతుపండి అనే పండ్ల వ్యాపారి. త‌న‌కు తోచిన దాంట్లో ఎదుటి వ్య‌క్తి ఆక‌లి తీర్చాల‌నుకున్న ముతుపండి.. ప్ర‌తి రోజూ తాను దుకాణం మూసేవేసి వెళ్లే స‌మ‌యంలో షాప్ ముందు కొన్ని అర‌టి పండ్ల‌ గెల‌ల‌ను ఉంచి వెళుతున్నాడు. ఆక‌లితో ఉన్న వారు ఎవ‌రైనా వాటిని తినొచ్చు అనే ఉద్దేశంతో ఆయన అక్కడ అర‌టి గెల‌ల‌ను ఉంచాడు. ఇక అక్క‌డే ఓ ప‌ల‌క‌పై… మీరూ ఆక‌లితో ఉంటే ఈ అర‌టి పండ్ల‌ను ఉచితంగా తీసుకోండి. కానీ వృథా మాత్రం చేయ‌కండి అంటూ రాశాడు. దీంతో ఈ విష‌యం తెలుసుకున్న స్థానికులు ముతుపండిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. త‌న‌కున్న దాంట్లో న‌లుగురి ఆక‌లి తీరుస్తోన్న ముతుపండి ఆలోచ‌న నిజంగానే గ్రేట్ క‌దూ..!

Also Read: Rashmika Mandanna: అవకాశం వస్తే ఆ స్టార్ హీరోతో డేటింగ్ కు వెళ్లాలని ఉందన్న రష్మిక మందన..

Online RTA Services: ఒక్క క్లిక్‌తో ఫోన్లో డ్రైవింగ్ లైసెన్స్.. కార్యాలయానికి వెళ్లకుండానే17 రకాల ఆర్టీఏ సేవలు..!

Rashmi Gautam: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల యాంకర్.. స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో రష్మీ..