AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online RTA Services: ఒక్క క్లిక్‌తో ఫోన్లో డ్రైవింగ్ లైసెన్స్.. కార్యాలయానికి వెళ్లకుండానే17 రకాల ఆర్టీఏ సేవలు..!

వాహనాలకు సంబంధించి ఏ చిన్న పని ఉన్నా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Online RTA Services: ఒక్క క్లిక్‌తో ఫోన్లో డ్రైవింగ్ లైసెన్స్.. కార్యాలయానికి వెళ్లకుండానే17 రకాల ఆర్టీఏ సేవలు..!
Telangana Government Rta Services Available At Online
Balaraju Goud
|

Updated on: May 27, 2021 | 4:14 PM

Share

Online RTA Services: ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉంది. వాహనదారులు రవాణా శాఖ సేవల పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. వాహనాలకు సంబంధించి ఏ చిన్న పని ఉన్నా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటి నుంచే నేరుగా సేవలను పొందవచ్చు. ఇందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందించింది.

లెర్నింగ్ లైసెన్స్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, వెహికల్స్ కొనుగోలు, అమ్మకాలు ఇలా అన్నింటికీ ఆఫీసులకు వెళ్లాల్సి ఉండేంది. అయితే ఇప్పుడు వాహనదారులు మొబైల్ ఫోన్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని తెలంగాణ రవాణా శాఖ కల్పించింది. సంబంధిత డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్లతో పాటు వినియోగదారుల సెల్ఫీ, డిజిటల్ సంతకాన్ని కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీజులను కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆన్‌లైన్‌ విధానంలో సేవలందించాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. 17రకాల సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌ పద్ధతిలో అందించడానికి ‘ఎక్కడైనా – ఎప్పుడైనా (ఎనీవేర్‌ – ఎనీటైమ్‌)’ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. దీనికోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న టీయాప్‌ ఫోలియో అనే మొబైల్‌ యాప్‌ను రవాణా శాఖ వినియోగించుకోనుంది. దీనిని గూగుల్ స్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, అందులో పేర్కొన్న సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రవాణా శాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు తెలిపారు.

ఎలా ఉపయోగించుకోవాలిః

  • ముందుగా మొబైల్ ఫోన్లలో T App folio యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • మొబైల్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకొని ఆర్టీఏ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే 17 రకాల సేవలు కనపడుతాయి.
  • మనకు అవసరమైన రవాణా శాఖ సేవలపైన క్లిక్ చేసి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
  • అంటే పేరు, పుట్టిన తేది, ప్రస్తుత లైసెన్స్‌ నంబరు, వాహనం నంబరు వంటి ప్రాథమిక సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయాలి.
  • పాస్ ఫొటో కోసం ఫోన్‌తో సెల్ఫీ తీసుకొని అప్‌లోడ్‌ చేయాలి.
  • 40 ఏళ్లు పైబడినవారు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే మెడికల్‌ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేయాలి.
  • అన్ని వివరాలతో పాటు యాప్‌లో చూపించిన కొన్ని రకాల డాక్యూమెంట్స్ కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • ఆన్‌లైన్‌లో అఫ్లికేషన్‌ ఫీజును చెల్లించాక ఎస్‌ఎంఎస్‌ రూపంలో ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది.
  • ఆర్టీఏ అధికారుల వెరిఫికేషన్ తర్వాత మెయిల్‌కు పీడీఎఫ్‌ రూపంలో పత్రాలు వస్తాయి.

ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లకుండా ఇళ్ల వద్ద నుంచే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రవాణా శాఖ కమిషనర్ సూచించారు. డూప్లికేట్‌ లైసెన్స్‌, ఇష్యూ ఆఫ్‌ బ్యాడ్జ్‌, స్మార్ట్‌కార్డు, లైసెన్స్‌ హిస్టరీ షీట్‌, డూప్లికేట్‌ లెర్నర్‌ లైసెన్స్‌, డూప్లికేట్‌ పర్మిట్‌, పర్మిట్‌ రెన్యువల్‌, టెంపరరీ పర్మిట్‌ లాంటి పదిహేడు రకాల సేవలు అందుబాటులో ఉన్నట్లు కమిషనర్ తెలిపారు.

Read Also…  Hyderabad Real Boom: కనిపించని కరోనా ప్రభావం.. దూసుకుపోతున్న నిర్మాణ రంగం.. హైదరాబాద్ నగరం చుట్టూ రియల్ బూమ్