Rashmi Gautam: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల యాంకర్.. స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో రష్మీ..

కింగ్ నాగార్జున ప్రస్తుతం  ప్రవీణ్ సత్తార్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ అద్భుతమైన కథను నాగార్జునకు వినిపించి ఒప్పించారు.

Rashmi Gautam: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల యాంకర్.. స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో రష్మీ..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 27, 2021 | 4:01 PM

Nagarjuna:

కింగ్ నాగార్జున ప్రస్తుతం  ప్రవీణ్ సత్తార్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఓ అద్భుతమైన కథను నాగార్జునకు వినిపించి ఒప్పించారు ప్రవీణ్ . యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని నారాయణదాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌మరార్‌ నిర్మిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో నాగ్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ను జూన్‌ తొలివారంలో ప్రారంభించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇటీవలే నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. రా అండ్ రస్టిక్ యాక్షన్ తో NIA ఆఫీసర్ రోల్ లో కొత్తగా కనిపించారు నాగ్ .  ప్రభు సోలొమన్ టేకింగ్  కూడా రిచ్ గా ఉందన్న కాంప్లిమెంట్స్ వచ్చాయి. కానీ సినిమా మాత్రం నిరాశపరిచింది. ఫిమేల్ లీడ్ లో దియా మీర్జా నటిస్తే.. సయామీ ఖేర్, అతుల్ కుల్ కర్ణి కీలకపాత్రల్లో కనిపించారు. ఇక ఇప్పుడు ప్రవీణ్ సత్తార్ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో అందాల యాంకర్ రష్మీ నటిస్తుందని అంటున్నారు. ఇటు బుల్లితెరపైన .. అటు వెండితెరపైన రష్మీకి మంచి క్రేజ్ ఉంది. యూత్ లో ఆమెకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్ ఆమెకి సినిమాల్లో అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది.  గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రష్మీ ‘గుంటూరు టాకీస్’ చేసింది. ఆ పరిచయం కారణంగానే ఆమెకి ఈ సినిమాలో ఛాన్స్ దక్కిందని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

EK Mini Katha Review: కథ బోల్డ్‌గా ఉన్నా సెన్సిబుల్ పాయింట్‌కు కామెడీ పూత ..ఈ ‘ఏక్ మినీ కథ’

Mahesh Babu: మహేశ్ ఫ్యాన్స్‌కు నిరాశే.. సర్కారు వారి పాట ఫస్ట్‌లుక్ ఇప్పట్లో లేనట్లే.. ఎందుకంటే..?

అమెజాన్‌ చేతికి మీడియా కంపెనీ ఎమ్‌జీఎమ్‌.. శతాబ్ద కాలం అనుభవం ఉన్న ఈ స్టూడియో ఇప్పుడు ఈ కంపెనీ సొంతం..