AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EK Mini Katha Review: కథ బోల్డ్‌గా ఉన్నా సెన్సిబుల్ పాయింట్‌కు కామెడీ పూత ..ఈ ‘ఏక్ మినీ కథ’

ప్రస్తుతం  పరిస్థితుల్లో సినిమాల షూటింగ్ లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పూర్తయిన సినిమాలు విడుదల కోసం ఎదురుచూస్తున్నాయి.

EK Mini Katha Review:  కథ బోల్డ్‌గా ఉన్నా సెన్సిబుల్ పాయింట్‌కు కామెడీ పూత ..ఈ 'ఏక్  మినీ కథ'
Ek Mini Katha
Rajeev Rayala
|

Updated on: May 27, 2021 | 2:57 PM

Share

నటీనటులు: సంతోష్ శోభన్-కావ్య థాపర్- బ్రహ్మాజీ -శ్రద్ధా దాస్ సంగీతం: ప్రవీణ్ లక్కరాజు నిర్మాణం: యువి కాన్సెప్ట్స్ రచన: మేర్లపాక గాంధీ దర్శకత్వం: కార్తీక్ రాపోలు

ప్రస్తుతం  పరిస్థితుల్లో సినిమాల షూటింగ్ లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పూర్తయిన సినిమాలు విడుదల కోసం ఎదురుచూస్తున్నాయి. కాగా  మాత్రం ఓటీటీని నమ్ముకుంటున్నాయి. సినిమా పైన ఉన్న నమ్మకంతో  ఓటీటీలో ప్రేక్షకులు ఆదరిస్తారని రిలీజ్ చేసుకుంటున్నారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే ఏక్ మినీ కథ. సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ చిత్రం ఈరోజు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించాడు. ఇంట్రస్టింగ్ పాయింట్ తో ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పడు చూద్దాం.

కథ:

సంతోష్ (సంతోష్ శోభన్) చిన్నప్పటి నుంచి తన పురుషాంగం చిన్నగా ఉంటుందనే భావనతో ఉంటాడు. సైజ్ చిన్నదిగా ఉండడం వల్ల వివాహ జీవితంలో సమస్యలు వస్తాయని భావించి పరిష్కారం కోసం పలు రకాలుగా ప్రయత్నిస్తాడు. తన ఆలోచనలన్నీ ఎప్పుడూ దాని చుట్టూనే తిరుగుతుంటాయి. దాని వల్ల అనేక సమస్యలు కొని తెచ్చుకుంటుంటాడు. ఈ క్రమంలోనే అతడికి అమృత(కావ్య థాపర్)తో పెళ్లి అవుతుంది. కానీ సైజ్ కారణంగా శోభనాన్ని మాత్రం వాయిదా వేస్తుంటాడు.  ఈ స్థితిలో అతడి సంసార జీవితం ఎలా సాగింది.. అతడి సమస్య పరిష్కారం అయిందా  అనేది సినిమా చూసి తెలుసుకోకవాల్సిందే..

కథనం-విశ్లేషణ:

కథ బోల్డ్‌గా ఉన్నా సెన్సిబుల్ పాయింట్‌కు కామెడీ పూత పూసి ఆకట్టుకునేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా అభాసుపాలయ్యే ఈ కథాంశాన్ని ఉన్నంతలో పద్ధతిగా చెప్పే ప్రయత్నం చేయడం.. ఇదో బూతు సినిమా అనిపించకుండా ఆలోచింపజేసేలా తీర్చిదిద్దడం ‘ఏక్ మిని కథ’లో అభినందించదగ్గ విషయాలు.  ఇక సెకండాఫ్ మొత్తం శోభనాన్ని వాయిదా వేయడంపైనే తిరుగుతుంది. హీరోయిన్ శ్రద్ధాదాస్ తర్వాత కథ ఊపందుకుంటుందని భావించినా నిరాశే కలుగుతుంది. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ‘ఏక్ మిని కథ’లో జరిగింది. స్కూల్లో చదివే రోజుల నుంచే తన అంగం చిన్నదనే భావనతో ఆత్మన్యూనతకు లోనయ్యే కుర్రాడి కథను వల్గారిటీ లేకుండా చాలా సరదాగానే చర్చించారీ చిత్రంలో. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల్లో తన ‘ఫన్’ పవర్ చూపించిన దర్శకుడు మేర్లపాక గాంధీ రచయితగా మరోసారి తన బలాన్ని చూపించాడు. ‘పేపర్ బాయ్’తో ఆకట్టుకున్న హీరో సంతోష్ శోభన్ ఈ సినిమాలో తన పురుషాంగం చిన్నదనే భావన ఉన్న యువకుడి పాత్రలో చక్కగా నటించాడు. తన అమాయకత్వపు పనులతో నవ్వించాడు. సినిమా భారం మొత్తాన్ని తన మీద వేసుకుని కథని నడిపించాడు. హీరోయిన్‌ కావ్య థాపర్‌ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో బాగా చేసింది. కుమారుడిని అపార్థం చేసుకునే తండ్రిగా బ్రహ్మాజీ మెప్పించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగే తీర్చిదిద్దే ప్రయత్నం జరిగినప్పటికీ.. కాన్సెప్ట్ దృష్ట్యా కుటుంబమంతా కలిసి ఈ సినిమా చూడ్డం కొంచెం కష్టమే.  కమెడియన్ సుదర్శన్ కు కెరీర్లోనే బెస్ట్ రోల్ పడింది. హీరో తర్వాత అత్యధిక స్క్రీన్ టైం అతడికే ఉంది. ఈ అవకాశాన్ని అతను పూర్తిగా ఉపయోగించుకున్నాడు. ప్రతి సన్నివేశంలోనూ నవ్వించాడు. వ్యభిచారం చేస్తూ దొరికిపోయి ప్లంబర్ గా మారే సన్నివేశంలో అతడి నటన కడుపు చెక్కలు చేస్తుంది. బ్రహ్మాజీకి సైతం మంచి పాత్ర పడింది.  పోసాని కాసేపే కనిపించినా తనదైన ముద్ర వేశాడు.

చివరగా : ఏక్ మినీ కథ .. కడుపుబ్బా నవ్వించిన కథ

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nani Tuck Jagadish: నాని ‘టక్ జగదీష్’ సినిమా రిలీజ్ పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

భార్య ప్రియాంక‌ ఆత్మ‌హ‌త్య కేసులో దివంగ‌త న‌టుడి కుమారుడు అరెస్టు.. అసలు సంగతి ఇదే..

Sonu Sood: యాంకర్‌ వింధ్యా విశాఖను ప్రశంసించిన సోనూసూద్.. ఎందుకో తెలుసా..?