Andhra Pradesh: రెండు చేతులు లేకపోయిన ఆత్మవిశ్వాసం అతని సొంతం.. ఆశ్చర్యపోయిన విదేశీ ప్రతినిధులు..!
అది మంగళగిరిలోని కృత్రిమ అవయవాల అమరిక కేంద్రం.. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కృత్రిమ చేతులు, కాళ్లు అమరుస్తున్నారు. ఈ కేంద్రంలో రోటరీ క్లబ్ తరుఫున విదేశీయులు హాజరయ్యారు. రెండు చేతులు లేని ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. కృత్రిమ కాలుతో వచ్చిన అతన్ని చూసిన జర్మనీ దేశస్తురాలు క్రిస్ గిల్ ఆశ్చర్యపోయారు.

అది మంగళగిరిలోని కృత్రిమ అవయవాల అమరిక కేంద్రం.. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కృత్రిమ చేతులు, కాళ్లు అమరుస్తున్నారు. ఈ కేంద్రంలో రోటరీ క్లబ్ తరుఫున విదేశీయులు హాజరయ్యారు. రెండు చేతులు లేని ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. కృత్రిమ కాలుతో వచ్చిన అతన్ని చూసిన జర్మనీ దేశస్తురాలు క్రిస్ గిల్ ఆశ్చర్యపోయారు. అంతేకాదు అతని జీవితం గురించి తెలుసుకుని మరింతగా షాక్ అయ్యారు.
తెలంగాణా రాష్ట్రం నారాయణపేటకు చెందిన అంజప్ప నాయుడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి రెండు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. అతనికి నరేంద్ర అనే పెద్ద కుమారుడు ఉన్నాడు. అయితే నరేంద్ర పుట్టిన ఐదేళ్లకే తండ్రి అంజప్ప నాయుడు చనిపోయాడు. దీంతో కుటుంబ భారం మొత్తం నరేంద్రపై పడింది. అప్పటి నుండి వ్యవసాయ పనులు చేసుకుంటూనే చదువు కొనసాగించాడు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉండగా జీవితం అనుకోని మలుపు తిరిగింది.
ఒక రోజు వర్షం పుడతుండగా నరేంద్ర పొలానికి వెళ్లాడు. అక్కడున్న గుడిసే పై కప్పును సరి చేస్తున్న క్రమంలోనే విద్యుత్ వైర్లకు చేతులు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్ గురైన నరేంద్రను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసి రెండు చేతులు, ఒక కాలు తీసేశారు. అయితే నరేంద్ర మాత్రం ఎక్కడా తొణగకుండా జీవితాన్ని కొనసాగించడమే కాకుండా కుటుంబానికి ధైర్యం చెబుతూవచ్చాడు. మొదట కృత్రిమ కాలు అమర్చుకున్నాడు. దీంతో జీవితాన్ని ఇతరులపై ఆధారపడకుండా కొనసాగిస్తున్నాడు. అయితే ఆర్ధిక స్తోమత లేకపోవడంతో కృత్రిమ చేతులు అమర్చుకోలేకపోయాడు.
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళకరం పేరుతో కృత్రిమ చేతులు అమరుస్తున్నారన్న సమాచారంతో నరేంద్ర మంగళగిరి వచ్చాడు. కృత్రిమ కాలుతో వచ్చిన నరేంద్ర చూసి విదేశీ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు అతనితో మాట్లాడిన తర్వాత అతని ఆత్మవిశ్వాసం చూసి మరింత ముగ్ధులయ్యారు. వెంటనే అతనికి రెండు కృత్రిమ చేతులు అమర్చడమే కాకుండా కాలుకు సరిపోయే మరో అత్యాధునిక పరకరాన్ని అమర్చారు. అంతేకాకుండా అతనికి అన్ని విధాలుగా అండగా ఉంటామని జర్మనీ దేశీయురాలు క్రిస్ గేల్ చెప్పారు.
చిన్న వయస్సులోనే కష్టాలు అనుభవించి మనోధైర్యం సడలకుండా తన జీవితాన్ని కొనసాగించడమే కాకుండా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న యువకుడ్ని చూసి అందరూ మెచ్చుకున్నారు. అతని ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయిదంటూ పలువురు ప్రశంసించారు.
మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




