Tea Day: ఓ స్పెషాలి ‘టీ’ స్టోరీ ఉంది.. తెలుసా మీకు.?
పొద్దున్నే నిద్ర లేవగానే తీయతీయగా ఓ కప్పు వేడి వేడి టీ తాగుతూ దినచర్య ప్రారంభిస్తారు చాలామంది. అది లేకపోతే ఆరోజంతా వెలితిగానే ఉంటుంది చాలామందికి. ప్రతిరోజూ మనకు గుడ్‌మార్నింగ్ చెప్పడమే కాదు, మన ఇంటికి వచ్చే అతిథులను ఆప్యాయంగా ఆహ్వానించేదీ టీనే. ఆఫీసులో ఉదయం నుంచి పని చేసి చేసి అలిసిపోయిన ఉద్యోగులకు సాయం సంధ్యవేళ కాస్త ఉపశమనం కలిగించేదీ టీనే.
పొద్దున్నే నిద్ర లేవగానే తీయతీయగా ఓ కప్పు వేడి వేడి టీ తాగుతూ దినచర్య ప్రారంభిస్తారు చాలామంది. అది లేకపోతే ఆరోజంతా వెలితిగానే ఉంటుంది చాలామందికి. ప్రతిరోజూ మనకు గుడ్‌మార్నింగ్ చెప్పడమే కాదు, మన ఇంటికి వచ్చే అతిథులను ఆప్యాయంగా ఆహ్వానించేదీ టీనే. ఆఫీసులో ఉదయం నుంచి పని చేసి చేసి అలిసిపోయిన ఉద్యోగులకు సాయం సంధ్యవేళ కాస్త ఉపశమనం కలిగించేదీ టీనే. అంతగా మన జీవితాల్లో పెనవేసుకుపోయింది టీ. అందుకే ఈ టీని గౌరవిస్తూ దీనికి ఒక డేని కేటాయించారు. అదేనండి మనం ప్రతి ఏటా జరుపుకుంటామే.. మదర్స్‌డే, ఫాదర్స్‌డే లాగా టీడే అన్నమాట. ఏటా మే 21వ తేదీని ‘ఇంటర్నేషనల్ టీ డే’గా ఐక్యరాజ్య సమితి పాటిస్తోంది. టీ సంస్కృతిపై ప్రపంచమంతా అవగాహన కల్పించేందుకు, ఆ పానీయానికి ఉన్న ఆర్థిక శక్తిని చాటేందుకు టీ డేను జరుపుతోంది. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలపడంతో 2005 నుంచి ఏటా ఇంటర్నేషనల్ టీ డేగా పాటిస్తోంది. ప్రపంచంలో మంచినీరు తర్వాత అత్యంత ప్రజాదారణ ఉన్న పానీయం తేనీరే కావడం విశేషం. ప్రస్తుతం వివిధ దేశాల్లో ఎన్నో రకాల టీ రుచులు తేనీరు ప్రియుల జిహ్వ చాపల్యాన్ని తీరుస్తున్నాయి. మన దేశంలో మసాలా చాయ్, ఇరానీ చాయ్, లెమన్ టీ, అల్లం టీ, గ్రీన్ టీ బాగా ప్రజాదరణ పొందాయి. అలాగే జపాన్ లో మచ్చా, థాయ్ ల్యాండ్ లో చాయ్ యెన్, శ్రీలంకలో సిలోన్ బ్లాక్ టీ, మలేసియాలో తే తారిక్ వంటి టీ రకాలు బాగా ఫేమస్ అయ్యాయి. టీ కేవలం మనసుకు ఆనందమే కాదు.. శరీరానికి ఆరోగ్యం కూడా అందిస్తోంది టీ. రోజూ టీ తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ ను అదుపులో ఉంచుతుంది. గ్రీన్ టీ, బ్లాక్ టీ కేన్సర్ ముప్పును నివారిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??
వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
కోట్లలో ఇండియన్ యూట్యూబర్ సంపాదన.. లగ్జరీ కార్లు, విల్లాలు
కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్‌వాచ్..
కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు..

