Vastu Tips: తరచూ ఆరోగ్య సమస్యలా..? అయితే మీ ఇంటి వాస్తులో ఈ లోపాలు ఉన్నాయేమో చూసుకోండి..
ఇంటి వాస్తు ఇంట్లో ఉండే వారిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే వారి ఆరోగ్యంపై వాస్తు ప్రభావం ఉంటుందని నమ్మే వారు మనలో చాలా మంది ఉంటారు. అందుకే వాస్తు నిబంధనల ఆధారంగా ఇళ్లు నిర్మించుకుంటారు. అందుకే...
ఇంటి వాస్తు ఇంట్లో ఉండే వారిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే వారి ఆరోగ్యంపై వాస్తు ప్రభావం ఉంటుందని నమ్మే వారు మనలో చాలా మంది ఉంటారు. అందుకే వాస్తు నిబంధనల ఆధారంగా ఇళ్లు నిర్మించుకుంటారు. అందుకే వాస్తు దోషాలను సవరించుకోవాలని వాస్తు నిపుణులు చెబుతుంటారు. వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఎదరుయ్యే ఆరోగ్య సమస్యలను చెక్ పెట్టవచ్చని చెబుతుంటారు. ఇంతకీ ఇంట్లో ఉండే వారు తరచూగా అనారోగ్య సమస్యల బారిన పడుతుంటే ఓసారి ఇంట్లో ఈ వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి..
* ఈశాణ్యం మూలన మెట్లు లేదా మరుగుదొడ్డిని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకూడదు. ఇలాంటి వాస్తు దోషం ఉన్న ఇంట్లో ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఎదురవుతుంటాయి. అలాగే పిల్లల ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది. వాస్తు దోషాలను నివారించారంలే ఈశాన్యం మూలన ప్రతీరోజూ దీపం వెలిగించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది.
* నైరుతీ వీధిపోటుతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంటిని కొనుగోలు చేసే ముందు వీధిపోటు లేకుండా చూసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ వీధిపోటు ఉంటే పరిహారం కోసం అక్కడ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం లేదా, ఆ మూలన పెద్ద చెట్టును పెంచాలని చెబుతున్నారు.
* మెట్ల కింద మరుగుదొడ్డి, వంటగది ఉండకూదు. ఇలా ఉండే వారి ఇంటి సభ్యులు నాడీ, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఇంట్లో తులసిని పూజించడం వల్ల పరిహారం పొందొచ్చు.
* ఇక బెడ్ రూమ్ ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో ఉండకూదు. దీనివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. బెడ్ రూమ్ నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలి. అలాగే.. నిత్యం దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి, ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించే వారికి విపరీతమైన అనారోగ్య సమస్యలు వస్తాయని, మానసిక ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన వివరాలు వాస్తు నిపుణులు అభిప్రాయాలు, సూచనల మేరకు అందించినవి మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించగలరు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..