Bharat Mata Temple: మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న భరత మాత ఆలయం గురించి మీకు తెలుసా..?
ఎక్కడైనా దేవుళ్ల కోసం గుడి కడతారు. విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. కానీ ఆ గ్రామస్తులు మాత్రం ఎక్కడా...
ఎక్కడైనా దేవుళ్ల కోసం గుడి కడతారు. విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. కానీ ఆ గ్రామస్తులు మాత్రం ఎక్కడా లేని విధంగా భరతమాతకు ఆలయం నిర్మించారు. దేవతగా కొలుస్తూ ఏటా ఉత్సవాలు నిర్వహిస్తూ దేశభక్తిని చాటుకుంటున్నారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నది ఏ దుర్గామాత ఆలయమో లేదా మహాలక్ష్మి గుడి అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే ఇది ఎక్కడా కనిపించని భరతమాత ఆలయం. శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కపాసుకుద్ది గ్రామంలో భరతమాతకు ఆలయం నిర్మించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ గ్రామంలోనే భరతమాతకు ఆలయం నిర్మించారు. ప్రతి గురువారం భరతమాతకు పూజలు చేస్తారు. ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన తమ పూర్వీకున్ని భరతమాత కాపాడిందని ఇక్కడి మత్స్యకారులు విశ్వసిస్తారు. అందుకే ఊరిలో గుడికట్టి పూజలతో భరతమాతను గుండెల్లో నింపుకున్నారు.
కపాసుకుద్ది గ్రామ ప్రజలు ఏటా పంద్రాగస్టున, జనవరి 26న ఈ ఆలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. గ్రామ మహిళలు దేవతకు కుంకుమ, పసుపు, పండ్లు, వివిధ రకాల స్వీట్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పటికీ భారత మాత తమను ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుందని గ్రామస్థులు నమ్ముతారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, భరతమాత గుడిని గ్రామస్తులంతా చందాలు వేసుకొని నిర్మించారు.
అసలు గుడి ఎందుకు కట్టారు…
దాదాపు ఆరు దశాబ్దాల క్రితం ఆ ప్రాంతంలో కలరా వ్యాప్తి చెందిందట. ఆ సమయంలో గ్రామ మాతగా ఉన్న గుల్లా చక్రపాణి కలలో భారత మాత కనిపించిందని, నివాసితులు అంటువ్యాధుల నుంచి రక్షించడానికి తాను కపాసకుద్దికి వచ్చానని చెప్పిందట. ఆ తర్వాత వ్యాధి కనుమరుగయ్యిందని.. అదే సమయంలో గ్రామ శివారులో ఒక చెట్టు కింద ఉన్న భారత మాత విగ్రహాన్ని నివాసితులు కనుగొన్నారని అక్కడి పెద్దలు చెబుతున్నారు. ఆ తర్వాత అక్కడ పూజలు చెయ్యడం.. గుడి కట్టడం జరిగాయి.
Also Read: అనంతలో కీచకుడు.. ఏఎన్‌ఎమ్‌లను వేధిస్తున్న ఫార్మా అసిస్టెంట్.. తట్టుకోలేక తాటతీశారు
ఇంటి చూరుపై పాముల సయ్యాట.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. జనాలు గద్దించినా