AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapur District: అనంతలో కీచకుడు.. ఏఎన్‌ఎమ్‌లను వేధిస్తున్న ఫార్మా అసిస్టెంట్‌.. తట్టుకోలేక తాటతీశారు

అతివలు అన్నింటా అభివృద్ధి చెందుతూ ఆకాశాన్ని అందుకుంటున్న ఈ రోజుల్లోనూ సమాజంలో స్త్రీకి ఉన్న భద్రత ప్రశ్నగానే మిగిలిపోతోంది...

Anantapur District: అనంతలో కీచకుడు..  ఏఎన్‌ఎమ్‌లను వేధిస్తున్న ఫార్మా అసిస్టెంట్‌.. తట్టుకోలేక తాటతీశారు
Women Harassment
Ram Naramaneni
|

Updated on: Aug 15, 2021 | 12:56 PM

Share

అతివలు అన్నింటా అభివృద్ధి చెందుతూ ఆకాశాన్ని అందుకుంటున్న ఈ రోజుల్లోనూ సమాజంలో స్త్రీకి ఉన్న భద్రత ప్రశ్నగానే మిగిలిపోతోంది. మహిళల రక్షణ కోసం ఎన్ని కొత్త చట్టాలు రూపొందించి అమలు చేస్తోన్నా.. రోజూ ఎంతోమంది వేధింపులకు, దాడులకు గురవుతున్నారు. రోగులకు వైద్యం అందించాల్సిన చోట కీచక అవతారమెత్తాడు ఒక కామాంధుడు. ఎన్నో ప్రయాసాలకోర్చి విధులు నిర్వహిస్తున్న ఏఎంన్ఎంల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాకుతూ వేధిస్తున్న ఆ కామాంధునికి దేహశుద్ధి జరిగింది. అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంతియాజ్ అనే ఫార్మా అసిస్టెంట్‌ ప్రతి రోజు తమ వద్దకు వచ్చే ఏఎన్‌ఎమ్‌లను వేధింపులకు గురిచేస్తున్నాడు. తాము గ్రామ సచివాలయాల్లో పని చేస్తామని.. మందుల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లినప్పుడు ఇంతియాజ్‌ వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు ఇంతియాజ్‌ వేధింపులు ఎక్కువకావడంతో మహిళలు వారి బంధువులకు తెలిపారు. అక్కడికి చేరుకున్న బంధువులు ఇంతియాజ్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అపగించారు. తమను గత రెండేళ్లుగా ఇంతియజ్‌ వేధిస్తున్నాడని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో మహిళా ఉద్యోగినులు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలపై వేధింపుల ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. మానసికంగా, శారరీకంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ పలువురు మహిళలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు.

Also Read:  ఇంటి చూరుపై పాముల సయ్యాట.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. జనాలు గద్దించినా

బస్సులో విండ్ సీట్‌లో కూర్చుని చెయ్యి బయట పెట్టి ప్రయాణిస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త