AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryapet: పనివాడితో అత్తను హత్య చేయించిన కోడలు.. ఎందుకో తెలిస్తే షాక్

 రూపాయి.. రూపాయి.. నువ్వు ఏం చేస్తావంటే, సత్య హరిశ్చంద్రుడితో అబద్ధం చెప్పిస్తాను, అన్నదమ్ములను విడగొతాను, మానవ సంబంధాలను..

Suryapet: పనివాడితో అత్తను హత్య చేయించిన కోడలు.. ఎందుకో తెలిస్తే షాక్
Mother In Law's Murder
Ram Naramaneni
|

Updated on: Aug 15, 2021 | 1:54 PM

Share

రూపాయి.. రూపాయి.. నువ్వు ఏం చేస్తావంటే, సత్య హరిశ్చంద్రుడితో అబద్ధం చెప్పిస్తాను, అన్నదమ్ములను విడగొతాను, మానవ సంబంధాలను మంటగాలుపుతాను అందట. కానీ తాజాగా జరిగిన ఘటన అంతకు మించి అని చెప్పాలి. ఆస్తి కోసం సొంత అత్తనే కిరాతకంగా కడతేర్చిందో కోడలు. ఎక్కడ ఆస్తి తమకు దక్కకుండా చేస్తుందోనని అక్కసు పెంచుకుని పక్కా ప్లాన్ ప్రకారం పనివాడితో కలిసి హత్య చేయించింది. తెలంగాణలోని సూర్యాపేట మండలం కుసుమవారిగూడెం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

భర్త ఏడాదిన్నర క్రితం చనిపోవడంతో అప్పటి నుండి ఒంటరిగా జీవిస్తుంది కుసుమ లలితమ్మ అనే వృద్ధురాలు. ఆమెకు ఇద్దరు కూతుర్లు, ఒ కొడుకు ఉన్నారు. కూతుర్ల పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడు సూర్యాపేట పట్టణంలో కిరాణం వ్యాపారం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఉన్న పొలంలో ఇద్దరు కూతుళ్ళకు చెరో ఎకరం ఇవ్వగా ఇంకా మూడున్నర ఎకరాలు ఉంది. భర్త చనిపోయాక మిగిలిన పొలం తమ పేరు మీద పట్టా చేయాలంటూ కొద్దిరోజులుగా కోడలు విజయలక్మి అత్త లలితమ్మతో గొడవ చేస్తుంది. మామ చనిపోయాక ఉన్న డబ్బులు ఆడపడుచులకు ఇచ్చావని, పొలం కూడా వాళ్ళకే ఇస్తావంటూ నిందించేది. ఎన్నిసార్లు పొలం తమ పేరుమీద పట్టా చేయాలని అడిగినా అత్త వినకపోవడంతో, అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది కోడలు విజయలక్మి. అన్నుకున్నదే తడవుగా అత్త దగ్గర పొలం పని చేస్తున్న సైదులుని సంప్రదించి హతమార్చేలా ఒప్పించింది. దీంతో ఒంటరిగా నిద్రిస్తున్న లలితమ్మను కత్తితో సైదులు హతమార్చాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు, మృతురాలి దగ్గర పనిచేసే సైదులు ప్రవర్తన మీద అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. నిందితులు విజయలక్మి, సైదులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:ఏనుగులు బాబోయ్.. ఏనుగులు.. సిక్కోలు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి

 మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న భరత మాత ఆలయం గురించి మీకు తెలుసా..?