Srikakulam district: ఏనుగులు బాబోయ్.. ఏనుగులు.. సిక్కోలు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి

శ్రీకాకుళం జిల్లాను ఏనుగులు వణికిస్తున్నాయి. ఏనుగుల గుంపులు పంట చేలను నాశనం చేయడంతో పాటు, అప్పుడప్పుడూ...

Srikakulam district: ఏనుగులు బాబోయ్.. ఏనుగులు.. సిక్కోలు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి
Elephants Hulchal
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 15, 2021 | 1:30 PM

శ్రీకాకుళం జిల్లాను ఏనుగులు వణికిస్తున్నాయి. ఏనుగుల గుంపులు పంట చేలను నాశనం చేయడంతో పాటు, అప్పుడప్పుడూ మనుషులపై కూడా దాడి చేసి చంపేస్తున్నాయి. ఇన్నాళ్లు ఒడిశా సరిహద్దులో ఉన్న ఏనుగులు ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లావైపు మళ్లాయి. దీంతో రైతులు, మన్యం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ప్రాంతం ఇప్పుడిప్పుడే పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏనుగుల గుంపు ప్రత్యక్షం కావడంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఆ ఏనుగుల గుంపును చూసి పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగుల గుంపును దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒడిశాలోని లకేరీ అభయారణ్యం నుంచి ఎనిమిది ఏనుగుల గుంపు 2017లో విజయనగరం వచ్చింది. వాటిలో రెండు చనిపోగా, ఆరు ఏనుగులు తిరుగుతున్నాయి. వాటిల్లో శ్రీకాకుళం జిల్లా సీతంపేట ప్రాంతంలో నాలుగు ఏనుగుల గుంపు తిరుగుతోంది. విజయనగరం జిల్లాలో ఏనుగులు ఎక్కువగా సంచరిస్తున్న కురుపాం, పార్వతీపురం, కొమరాడ, జియమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లోని 40 గ్రామాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. ఏనుగుల వల్ల ఉద్యాన పంటలైన అరటి, బొప్పాయి, జామ తోటలతో పాటు వరి, చెరకు, కూరగాయలు పండించే రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏనుగుల వల్ల ఒక్క విజయనగరం జిల్లాలోనే వేల ఎకరాల్లో పంట ధ్వంసమైంది. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగింది. విజయనగరం జిల్లాలో ఏనుగుల కారణంగా నష్టపోయిన రైతులకు అధికారులు పరిహారం అందించారు. ఈ రెండు జిల్లాల్లో గత ఐదేళ్లలో ఏనుగుల దాడిలో 10 మంది దాకా చనిపోయారు.

Also Read:మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న భరత మాత ఆలయం గురించి మీకు తెలుసా..?

అనంతలో కీచకుడు.. ఏఎన్‌ఎమ్‌లను వేధిస్తున్న ఫార్మా అసిస్టెంట్‌.. తట్టుకోలేక తాటతీశారు