Financial Management: ఆర్ధిక ప్రణాళికలు.. ఆరు తప్పులు.. ఇవి మీరు తెలుసుకుంటే డబ్బు విషయంలో తప్పు చేయరు!
Financial Management: ఆర్ధికంగా మంచి స్థితి ఉన్న వ్యక్తులకు ఉండే ఆత్మస్థైర్యం వేరుగా ఉంటుంది. సాధారణంగా డబ్బు సంపాదించడం.. దానిని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం.. అవసరాల కోసం ఆదా చేసుకోవడం.
Financial Management: ఆర్ధికంగా మంచి స్థితి ఉన్న వ్యక్తులకు ఉండే ఆత్మస్థైర్యం వేరుగా ఉంటుంది. సాధారణంగా డబ్బు సంపాదించడం.. దానిని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం.. అవసరాల కోసం ఆదా చేసుకోవడం.. ఆదా చేసుకున్న సొమ్ము నుంచి కూడా మరింత రాబడి వచ్చేలా చూసుకోవడం ఇవన్నీ పెద్ద పజిల్ లా ఉంటుంది. సాధారణంగా కొంత డబ్బు చేతిలో ఉంటే ఏమి చేయాలి అనేదానిపై స్పష్టమైన అవగాహన ఉన్నవాళ్ళు చాలా తక్కువమందే అని చెప్పొచ్చు. పైగా కొంత మంది ఆ డబ్బును ఏం చేయాలనే అంశంలో ఎవరెవరి సలహాలో తీసుకుని.. రకరకాల పుస్తకాలు చదివీ ఏదీ అర్ధంకాక.. అయోమయంలో ఎక్కడో ఒక చోట ఆ డబ్బు ఇన్వెస్ట్ చేసేసి ఆనక అది పూర్తిగా కరిగిపోయాకా బాధపడటం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అసలు ఆర్ధిక ప్రణాళిక.. డబ్బును ఎలా మనకోసం ఉపయోగించుకోవాలి అనేది తెలుసుకోవడం అంత సులువు కాదు. ఆర్ధిక ప్రణాళిక అంటే మన దీర్ఘకాలిక జీవిత లక్ష్యాల కోసం మన ఆర్ధిక వ్యవహారాలను సక్రమంగా నిర్వహించుకోవడం.
ఇంకా బాగా అర్ధం అయ్యేలా చెప్పాలంటే.. ఒక ఇల్లు కొనుక్కోవాలి అనేది మీ లక్ష్యం అయితే.. దానికి మీకు ఎంత డబ్బు అవసరం అవుతుంది? ఇప్పుడు మీకు ఉన్న ఆదాయంతో అది కొనుక్కోవాలంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి? ఎంత అదా చేస్తే ఇల్లు కొనుక్కునే స్థాయికి మీరు డబ్బు సంకూర్చుకోగలరు? ఇటువంటి అంశాలను లెక్కలు వేసి.. మీ సంపాదన.. అవసరాలను కచ్చితమైన ప్రణాళిక ద్వారా మేనేజ్ చేస్తేనే మీరు అనుకున్న సమయానికి ఇల్లు కొనుక్కోవడం అనే లక్ష్యాన్ని చేరుకో గలుగుతారు. నిపుణులు డబ్బు ఆదా చేసుకోవడం..ఆ ఆదా నుంచి కూడా కొంత సొమ్మును సంపాదించడం వంటి అంశాలలో ఎలా వ్యవహరించాలి అనేదానిపై కొన్ని విషయాలను చాలా సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. వారిలో ఓ ఆరు ముఖ్యమైన సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రణాళిక..
డబ్బును సంపాదించడం ఎంత కష్టమో.. దానిని ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయడం లేదా ఆదా చేయడం అంత కష్టం. అయితే, ఇక్కడ ప్రణాళిక అంటే.. పునాది లేకుండా బిల్డింగ్ బ్లాక్స్ ఉపయోగించి పిల్లలు ఇల్లు కట్టినట్టు ఉండకూడదు అంటారు నిపుణులు. సాధారణంగా నా డబ్బు ఎలా దాచుకోవాలో.. ఖర్చు చేయాలో నేను బాగా మేనేజ్ చేయగలను అనే అపోహ అందరికీ ఉంటుంది. కానీ, దానికి కూడా నిపుణుల సలహా అవసరం. నిపుణుల సలహా లేకుండా ప్రణాళిక చేయడం పునాది లేకుండా బిల్డింగ్ బ్లాక్స్ తో ఆడుకోవడం లాంటిది. అందువల్ల కచ్చితంగా డబ్బు ఖర్చు లేదా ఆదా విషయంలో నిపుణుల సలహా..సూచనలు.. మార్గదర్శకత్వం తప్పనిసరి అని తెలుసుకోవాలి.
ఆర్థిక ప్రణాళిక అంటే..
చాలా మంది ఆర్ధిక ప్రణాళిక అంటే ఆదా చేయడం లేదా పెట్టుబడి పెట్టడం అనే అనుకుంటారు. కానీ, ఇది పూర్తిగా తప్పు అంటున్నారు నిపుణులు. మీరెంత ఆదా చేసినా.. ఆరోగ్యం దెబ్బ తింటే ఏమీ చేయలేరు. ఎప్పుడైనా భవిష్యత్ నష్టాలను అంచనా వేయడం చాలా కష్టతరం. అయితే, అనుకోని ఇబ్బంది వచ్చినపుడు మూలధనం దెబ్బతినకుండా ఆ కష్టం నుంచి బయటపడటం కోసం సరైన కవర్ కలిగి ఉండటం ఆర్ధిక ప్రణాళిక కోసం సరైన పునాది అంటారు నిపుణులు. సహేతుకమైన ఖర్చుతో ఇటువంటి నష్టాలకు వ్యతిరేకంగా బీమా ఓ ప్రత్యామ్నాయ ఆర్థిక బ్యాకప్. మీ పొదుపులు లేదా పెట్టుబడులు సరైన బీమా వలె మీ కొచ్చే అనుకోని అంతరాన్ని సమర్థవంతంగా పరిష్కరించలేవు. ఇది స్పష్టంగా అర్ధం కాకపొతే అది మీ ఆర్థిక వ్యవహారాలను అస్థిరపరుస్తుంది.
డబ్బు లెక్కలు వేయడం..
ఎంత వచ్చింది.. ఎంత పోయింది.. ఎంత మిగిలింది.. దేనికి ఎంత ఖర్చు చేశాం ఇటువంటి పనులు మనవల్ల కాదు. అది మనకు అవసరం లేదు. అది అకౌంటెంట్ల కోసం అనే అపోహ కూడా మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఎంత వస్తుంది, ఎంత బయటకు వెళుతుంది, ఎప్పుడు? అది ఎందుకు లోపలికి వస్తుంది, ఎందుకు బయటకు వెళ్తుంది? ఇది అవసరమా, అది తప్పించగలదా? ఇది వర్తమానానికి సరిపోతుందా, లేదా భవిష్యత్తును కూడా చూసుకుంటుందా? రోజువారీ ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడం నగదు ప్రవాహాలపై నియంత్రణకు సూచిక కాదు. మీద డబ్బును మీరే ఖర్చు పెట్టండి.. మీరే దాచుకోండి. కానీ, ఆ లెక్కలన్నీ కూడా మీరే స్వయంగా చూసుకోండి. అది వందల్లో అయినా, లక్షల్లో అయినా సరే. సహాయం కోసం ఎవరినైనా ఆశ్రయించినా తుది లెక్కలు మాత్రం మీరు స్వయంగా చూసుకోవడమే మీ ఆర్ధిక ప్రణాలికను సరైన పునాదుల మీద నిలబెడుతుంది అనేది గుర్తుంచుకోవాలి అంటారు నిపుణులు.
డబ్బు ఎక్కడ పెడితే ఏమవుతుందో నాకు తెలుసు..
పెట్టుబడుల విషయంలో నా రిస్క్ ప్రొఫైల్ నాకు తెలుసు. ఇది మూడు లేదా నాలుగు ప్రశ్నలను ఎవరిని అడిగినా తెల్సిపోతుంది. అనే పెద్ద భ్రమ ఎక్కువ మందిలో ఉంటుంది. కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు గట్టిగా ప్రశ్నించుకోండి.. నా రిస్క్ ప్రొఫైల్ నాకు నిజంగా తెలుసా? పెట్టుబడి ఉత్పత్తి లేదా ప్రణాళికలో పాల్గొనమని ప్రాంప్ట్ చేసినప్పుడు నేను ఎంత సౌకర్యవంతంగా ఉంటాను? పెట్టుబడి పెట్టడానికి అలాంటి ఆఫర్‌ల పట్ల నా ఆర్థిక, ప్రవర్తనా సంసిద్ధతను కొలిచే యార్డ్ స్టిక్ నా దగ్గర ఉందా? నేను పుస్తకాల్లో చదవడం ద్వారా నిజంగా అంతా అర్ధం చేసుకోగలనా? ఈ ప్రశ్నలన్నిటికీ మీకు సరైన సమాధానం దొరికితే మీకు నిజంగానే మీ రిస్క్ ప్రొఫైల్ గురించి తెలిసినట్టే. కానీ, వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం మీకు దొరకకపోయినా మీరు రిస్క్ తీసుకున్తున్నట్టే అంటారు నిపుణులు. నిజానికి మీరు తట్టుకోవాలనుకునేది (రిస్క్ టాలరెన్స్) మీరు తీసుకోగల (రిస్క్ కెపాసిటీ) కి భిన్నంగా ఉంటుంది! మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండూ కాలంతో పాటు చాలా వేగంగా మారుతూ ఉంటాయి! మీ స్వంత జీవిత ప్రయాణం రెండింటిలో మార్పులు చేస్తూనే ఉంటుంది. అందువల్ల నిపుణుల సలహా తోనే రిస్క్ ఫ్యాక్టర్ గురించి అంచనా వేయగలరు అనే విషయాన్ని తెలుసుకోండి.
మంచి రాబడి కావాలి.. పన్నులు ఆదా చేయాలి..
ఎక్కువ శాతం తమకు మంచి రాబడి సంపాదించడం కావాలి అదేవిధంగా పన్నులు ఆదా చేయడం కావాలి అని కోరుకుంటారు. కానీ, ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా, మీకు ఏదైనా జరిగితే ఈ డబ్బు ఎలా ఉపయోగించబడుతుందో? మీరు చక్కని ప్రణాళిక చేయకపోతే మంచి రాబడి, పన్నులను ఆదా చేయడం ఎలా జరుగుతుంది. మీ చట్టబద్ధమైన వారసుఅల్ భవిష్యత్ ఏమిటి అనేది కూడా మీ ఆలోచనలో ఉండాలి అంటారు ఆర్ధిక నిపుణులు అందుకే, మీరు ఆర్ధిక ప్రణాళిక చేసుకునే టప్పుడు రాబడి.. పన్నుల ఆదాతో పాటు.. చట్ట బద్ధత గురించి కూడా ఆలోచించి పెట్టుకోవాలి. అది కూడా మీ ప్రణాళికలో ఒక భాగం కావాలి అని వారు సూచిస్తున్నారు.
ఆర్ధిక వ్యవహారాల్లో నిపుణుల సలహా మనలను మోసం చేయవచ్చు..
ఇది చాలా తప్పుడు ఊహ. మనకు తెలియని దానిని ఇంకొకరి దగ్గర నుంచి తెలుసుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. మీకు సలహా ఇవ్వడం ద్వారా వారు మిమ్మల్ని మోసం చేస్తారని అనుకోవడం కూడా భ్రమే. అందరూ ఒకేలా ఉండరు. మీకు ఉన్న ఆప్షన్స్ లో మంచిది ఏది అని ఎలా సెలెక్ట్ చేసుకుంటారో నిపుణుల విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ మీ అత్యంత విశ్వసనీయ స్నేహితుడి సిఫార్సు. వారు ఒకదాన్ని కనుగొనలేకపోతే, వారి అత్యంత విశ్వసనీయ స్నేహితుడి నుండి ఒక పరిష్కారం దొరకొచ్చు. విశ్వసనీయ స్నేహితుల పొడవైన గొలుసు వెంట మీరు మీకు కావాల్సిన దానిని కచ్చితంగా తెలుసుకోగలుగుతారు అని నిపుణులు చెబుతున్నారు.