AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madras High Court: కారుణ్య నియామకంలో హైకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు.. మరణించిన వ్యక్తి ఉద్యోగానికి పోటీపడ్డ కోడలు, కూతురు..!

ఓ ప్రభుత్వ ఉద్యోగి అకాల మరణంతో.. కారుణ్య నియామకం కింద వచ్చే జాబ్‌కు కూతురు, కోడలు కుమ్ములాడుకున్నారు. పంచాయితీ ఎటూ తేలకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.

Madras High Court: కారుణ్య నియామకంలో హైకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు.. మరణించిన వ్యక్తి ఉద్యోగానికి పోటీపడ్డ కోడలు, కూతురు..!
Madras High Court
Balaraju Goud
|

Updated on: Jun 04, 2021 | 6:31 PM

Share

Madras High Court Judgment: ఓ ప్రభుత్వ ఉద్యోగి అకాల మరణంతో.. కారుణ్య నియామకం కింద వచ్చే జాబ్‌కు కూతురు, కోడలు కుమ్ములాడుకున్నారు. పంచాయితీ ఎటూ తేలకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న మద్రాసు హైకోర్టు ఎట్టకేలకు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది .

తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందగా ఉద్యోగం తనకే ఇవ్వాలంటూ ఆయన కూతురు, కోడలు పోటీపడ్డారు. ఆ ఉద్యోగం పొందే అర్హత తమకంటే తమకే ఉందంటూ వాదించుకున్నారు. చివరికి మద్రాసు హైకోర్టు మెట్లేక్కారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కొత్త రకం సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించింది. ఆ ఇద్దరి మధ్య ఓ ఒప్పందాన్ని కుదిర్చింది ధర్మాసనం.

విలేజ్ అస్టిస్టెంట్​గా విధులు నిర్వర్తిస్తున్న అరుముగం అనే వ్యక్తి.. 2019లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుమారుడు కూడా గతంలోనే చనిపోయాడు. కూతురు గోమతి భర్త సైతం మృతి చెందగా.. పిల్లలతో సహా ఆమె అరుముగం కుటుంబంతో కలిసి ఉంటోంది. అరుముగం కుమారుడు చనిపోవడంతో.. కోడలు సంగీత జీవనం కూడా కష్టమైపోయింది. దీంతో మామగారి ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని అధికారులను కోరింది. ఇదే సమయంలో తనూ భర్తను కోల్పోయానని కుటుంబ పోషణ భారంగా మారిందని అరుముగం కూతురు కూడా ఈ ఉద్యోగం తనకే కావాలని కోరింది.

దీంతో అరుముగం ఉద్యోగం కోసం కూతురు, కోడలు పోటీ పడ్డారు. ఒకే కుటుంబంలో వివాదం తలెత్తడంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. ఎవరికీ సర్దిచెప్పలేకపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో గోమతి, సంగీత వేర్వేరుగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ ఎక్ వైద్యనాథన్ విచారించారు. ఈ విషయంలో ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, ఓ ఒప్పందానికి రావాలని సూచించారు. న్యాయమూర్తి సూచనకు ఇద్దరూ అంగీకరించారు.

ఈ నేపథ్యంలో సంగీతతో ఒప్పందం కుదుర్చుకుంది గోమతి. ఉద్యోగం తనకు ఇస్తే.. ప్రతీనెల వేతనంలో 30 శాతం సంగీతకు ఇస్తానని చెప్పింది. అలాగే, ఆమె పిల్లల చదువు కోసం సంవత్సరానికి రూ.20వేలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇద్దరి మధ్య ఆ ఒప్పందాన్ని న్యాయమూర్తి ఆమోదించారు. దీంతో రెండు పిటిషన్లను కొట్టేశారు జస్టిస్ వైద్యనాథన్. ప్రతీనెలా గోమతి వేతనంలో 30 శాతం కట్​ చేసి సంగీత బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయాలని ఆదేశించారు.

అలాగే, గోమతికి ఉద్యోగం అప్పగించే ప్రక్రియలో సాంకేతిక అంశాలు అడ్డుపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు న్యాయమూర్తి సూచించారు. మృతి చెందిన అరుముగం​ భార్య కూడా గోమతి వద్దనే ఉంది. అదే విధంగా ఉద్యోగం కోసం నామినేట్ చేయాలని సూచనలు చేశారు. మూడు నెలల్లో గోమతిని విధుల్లోకి తీసుకోవాలని ధర్మసనం తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక రెండేళ్లుగా నడుస్తున్న ఈ వివాదం సామరస్యపూర్వకంగా ముగియడంతో అధికారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.

Read Also… MEIL Oxygen Plant: కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు “మేఘా” సాయం.. పెద్దాపురంలో ఆక్సిజన్ ప్లాంట్‌ పునరుద్ధరణ

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..