- Telugu News Photo Gallery Viral photos Viral photos winning photos of nature ttl photographer of the year award 2021
Viral Photos: నేచర్ ఫోటోగ్రఫీ అవార్డు 2021 గెలుచుకున్న అపురూప చిత్రాలు.. జంతువులు, ప్రకృతి రమణీయ దృశ్యాలు మీకోసం..
నేచర్ టిటిఎల్ అనే వెబ్‌సైట్ ప్రతి సంవత్సరం ఫోటోగ్రఫీ పోటీని నిర్వహిస్తుంది. ఈ పోటీలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 8వేల ఔత్సాహికులు పాల్గొన్నారు. గెలిచిన వ్యక్తికి రూ.1.55లక్షల బహుమతి.
Updated on: Jun 04, 2021 | 7:51 PM

ఈ సంవత్సరం విజేత కెనడియన్ ఫోటోగ్రాఫర్ థామస్ విజయన్. థామస్ విజయన్ తీసిన ‘ది వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్‌సైడ్ డౌన్’. ఒక చెట్టుకు అతుక్కున్న ఒరాంగూటన్ చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రంలో, ఒరంగుటాన్ చెట్టు పైకి ఎక్కుతోంది. అదే సమయంలో క్రింద ఉన్న స్పష్టమైన నీటిలో ఆకాశం కనిపిస్తుంది.

13 ఏళ్ల హోమాస్ ఈస్టర్బ్రూక్ యంగ్ నేచర్ టిటిఎల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును అందుకున్నాడు. అతను ఆకాశంలో ఎరుగుతున్న పక్షుల గుంపుతో కూడిన చిత్రాన్ని తన కెమెరాలో బంధించాడు.

ఈ పోటీలో వివిధ సహజమైన 8 విభిన్న వర్గాలు ఉన్నాయి. ఇందులో రెండవ స్థానంలో ఉన్న జోహన్ వాండ్రాగ్ అనే మొసలి చిత్రం. బంగారు వర్ణంతో కూడిన ఈ మొసలి వేటాడుతున్న చిత్రాన్ని తీశారు.

అర్బన్ వైల్డ్‌లైఫ్ విభాగంలో మన దేశానికి చెందిన కల్లోల్ ముఖర్జీ గెలుపొందారు. ఓ చిరు వ్యాపారి దుకాణంలో రెండు పావురాల ప్రేమ కలాపాలను ఫోటోగ్రాఫర్ బంధించాడు.

రాత్రి సమయంలో నిర్మాష్యమైన ఆకాశాన్ని కెమెరాలో బంధించినందుకు ది నైట్ స్కై విభాగంలో ఇవాన్ పెడ్రెట్టికి మొదటి స్థానం లభించింది.





























