Viral: కుక్కపై కోపంతో కాల్పులు జరిపింది.. గురితప్పి కొడుకు శరీరంలోకి దూసుకెళ్లిన బుల్లెట్..!
అమెరికాలోని టెక్సాస్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక తల్లి తన ఐదేళ్ల కొడుకును యాక్సిడెంటల్‌గా కాల్చేసిన ఘటన టెక్సాస్ నగరంలో...
అమెరికాలోని టెక్సాస్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక తల్లి తన ఐదేళ్ల కొడుకును యాక్సిడెంటల్‌గా కాల్చేసిన ఘటన టెక్సాస్ నగరంలో చోటు చేసుకుంది. వీధి కుక్కను కాల్చాలనుకున్న ఆ యువతి…గురి తప్పటంతో బుల్లెట్లు ఆమె కొడుకు శరీరంలోకి దూసుకెళ్లాయి. 24 ఏళ్ల ఏంజెలియా మియా వర్గాస్ తన కొడుకు, మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి వీధిలో సైక్లింగ్ చేస్తుండగా, బ్రూనో అని పిలువబడే పక్కింటి కుక్క కూడా వీధిలో తిరుగుతోంది. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, క్షణాల్లో జరగాల్సింది జరిగిపోయింది. అకస్మాత్తుగా కాల్పుల శబ్దం విన్నామని ఇరుగుపొరుగు వారు చెప్పారు.
డిటెక్టివ్ జె. హస్లీ అనే మహిళ.. ఏంజెలియా,.. బ్రూనోపై మూడుసార్లు కాల్పులు జరిపినట్లు తెలిపింది. ఇక అనుకోకుండా ఓ బుల్లెట్ ఆమె కొడుకును తాకిందని వివరించింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని.. అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని హస్లీ పేర్కొంది. ఇక కాల్పుల సమయంలో బ్రూనో కాలికి కూడా స్వల్పంగా గాయమైనట్లు తెలిసింది.
Also Read:
ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..
దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?