Cotton Farmers: పత్తి రైతులకు గుడ్ న్యూస్‌..! క్వింటాల్‌ ధర ఎంత పలుకుతుందో తెలుసా..?

Cotton Farmers: పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు పత్తిని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. దీపావళి

Cotton Farmers: పత్తి రైతులకు గుడ్ న్యూస్‌..! క్వింటాల్‌ ధర ఎంత పలుకుతుందో తెలుసా..?
Cotton
Follow us

|

Updated on: Nov 03, 2021 | 7:27 PM

Cotton Farmers: పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు పత్తిని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా పెరుగుతున్న రేట్లను చేసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న కొద్ది రోజుల్లో పత్తి ధర క్వింటాలుకు రూ.10 వేలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తక్కువ ఉత్పత్తి, ఎక్కువ డిమాండ్ కారణంగా వ్యాపారులు పత్తిని అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ పత్తి వ్యాపారులు పత్తి క్వింటాల్‌కు రూ.8300 నుంచి 8500 వరకు కొంటున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్‌ పత్తికి డిమాండ్‌ పెరగడంతో వ్యాపారులు సోషల్ మీడియాలోనే రైతులతో భేరసారాలు నడిపిస్తున్నారు. పత్తిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు సోషల్‌ మీడియాను ఆశ్రయించడం కొత్త ట్రెండ్‌ అని పరిశీలకులు అంటున్నారు. ఇది శుభారంభమని రైతులకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి మంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ ఈసారి ఆశించిన స్థాయిలో ఉత్పత్తి జరగలేదు. ప్రయివేటు పత్తి వ్యాపారులు పత్తిని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. దీంతో రైతులు లబ్ధి పొందుతున్నారు. దిగుబడి తక్కువగా ఉండడంతో రైతులకు మంచి ధరను అందిస్తున్నారు.

మహారాష్ట్ర వంటి రాష్ట్రంలో రైతులకు క్వింటాల్‌కు రూ.9000 వరకు ధర లభిస్తోంది. పత్తి ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.6250. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. వర్షం కారణంగా పంట దెబ్బతినడంతో పాటు దిగుబడిపై కూడా ప్రభావం పడిందని రైతులు బాధపడ్డారు. కానీ ఇప్పుడు మంచి ధర రావడంతో ఆనందపడుతున్నారు. మరోవైపు ధరలు పెరుగుతాయన్న వార్తలతో రైతులు పత్తిని నిల్వ చేస్తున్నారు. రానున్న కొద్ది రోజుల్లో ధర.10,000 లేదా అంతకంటే ఎక్కువ పెరగవచ్చని అంచనా.

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం.. డబ్బులకోసం బాలికలను 70 ఏళ్ల వృద్ధులకిచ్చి వివాహం..

Diwali 2021: దీపావళికి ఈ 8 ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలి..! అదృష్టం మీ వెంటే ఉంటుంది..

Taapsee: ఆ స్టార్ హీరో నాతో నటించడానికి ఇష్టపడలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ..