Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Owls: గుడ్లగూబలు రైతులకు స్నేహితులు..! ఈ విషయం తెలిస్తే నిజమే అంటారు..

Owls: రైతులకు ఈ ఏడాది చాలా సవాలుగా మారింది. రుతుపవనాల అనంతరం కురిసిన అకాల వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల

Owls: గుడ్లగూబలు రైతులకు స్నేహితులు..! ఈ విషయం తెలిస్తే నిజమే అంటారు..
Owls
Follow us
uppula Raju

|

Updated on: Nov 03, 2021 | 8:32 PM

Owls: రైతులకు ఈ ఏడాది చాలా సవాలుగా మారింది. రుతుపవనాల అనంతరం కురిసిన అకాల వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాల కారణంగా పొలాల్లో వేసిన పంటలు నాశనమై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంట నష్టపోవడంతో రైతుల ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఇదిలా ఉంటే.. మరోవైపు రైతులు ఎరువుల సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో దుకాణదారులు ఎరువులను బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తూ భారీగా లాభాలు గడిస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో ఎరువుల వ్యాపారులు అన్నదాతలను నిండా ముంచేస్తున్నారు.

పంటలను నాశనం చేస్తున్న ఎలుకలు మన దేశంలో రైతులకు అకాల వర్షాలు, ఎరువుల కొరత ఒక్కటే పెద్ద సమస్య కాదు. ఇవే కాకుండా అనేక ఇతర కారణాల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎలుకలు కూడా పంటలను నాశనం చేస్తున్నాయి. తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఎంత కాపాడినా వృథానే అవుతుంది. ఇటువంటి సమయంలో గుడ్లగూబలే రైతులకు నేస్తాలుగా మిగిలాయి.

గుడ్లగూబలు పంటలకు రక్షణ మన సమాజంలో అందరు అసహ్యించుకునే పక్షి గుడ్లగూబ రైతులకు నేస్తంగా మారింది. తనదైన శైలిలో పొలాల్లోని ఎలుకలు, ఇతర జీవులను తింటూ పంటలను కాపాడుతుంది. రైతులకు నిజమైన నేస్తంగా సాయం చేస్తుంది. రాత్రంతా మేల్కొని ఉండే గుడ్లగూబ పొలాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేసే ఎలుకలను తింటుంది. చుట్టుపక్కల గుడ్లగూబలు నివసించే పొలాల్లో ఎలుకలు ఆ పొలాల్లోకి చొరబడలేవు. వాటికి భయపడి ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోతాయి. గుడ్లగూబ పంటలను దెబ్బతీసే అనేక రకాల కీటకాలను కూడా ఆహారంగా చేసుకుని తింటాయి. చాలా మంది రైతులు తమ పంటలను ఎలుకల నుంచి రక్షించుకోవడానికి గుడ్లగూబలను పెంచుకుంటారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

T20 World Cup 2021: టీమిండియా సెమీఫైనల్ ఆశలు గల్లంతు..! ఎందుకో తెలుసుకోండి..

Cotton Farmers: పత్తి రైతులకు గుడ్ న్యూస్‌..! క్వింటాల్‌ ధర ఎంత పలుకుతుందో తెలుసా..?

Gold Tree: అక్కడి చెట్లకు ‘బంగారం’ కారుతుంది తెలుసా..? జిగురుతో వ్యాపారస్థుల క్యాష్.. ఎక్కడంటే..?