T20 World Cup 2021: టీమిండియా సెమీఫైనల్ ఆశలు గల్లంతు..! ఎందుకో తెలుసుకోండి..
T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్16 పరుగుల తేడాతో
T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్16 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ని ఓడించింది. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ విజయం టీమిండియా సెమీఫైనల్ ఆశలను గల్లంతు చేసింది. ఎందుకంటే గ్రూప్ 2 ప్రకారం.. ఈ రోజు న్యూజిలాండ్‌ని స్కాట్లాండ్ ఓడించడం చాలా ముఖ్యం. ఇది జరగలేదు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అయితే స్కాట్లాండ్ ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
స్టార్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్టిల్ (93 పరుగులు) హాఫ్ సెంచరీతో పాటు గ్లెన్ ఫిలిప్స్ (33)తో కలిసి నాల్గో వికెట్ భాగస్వామ్యంతో న్యూజిలాండ్ స్కాట్లాండ్‌ను మట్టికరిపించింది. ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో స్కాట్లాండ్ న్యూజిలాండకి గట్టి పోటీని ఇచ్చింది. ఇందులో మైఖేల్ లిస్క్ 20 బంతుల్లో అజేయంగా 42 పరుగులు చేశాడు. కానీ న్యూజిలాండ్ అనుభవజ్ఞులైన బౌలర్ల ముందు ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్లు చతికిలపడ్డారు.
నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేశారు. లిస్క్ తన ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఇష్ సోధి 42 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. టిమ్ సౌథీ 24 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. ఈ రోజు అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. 5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 50 పరుగులతో ఆట కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్ తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.