ICC T20 World Cup 2021, IND vs AFG, Highlights: 66 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం..!

Venkata Chari

|

Updated on: Nov 03, 2021 | 11:24 PM

IND vs AFG Highlights in Telugu: ఈ టోర్నమెంట్‌లో, భారతదేశం తన మొదటి విజయం కోసం చూస్తుండగా, ఆఫ్ఘనిస్తాన్ 2 మ్యాచ్‌లను గెలుచుకుంది.

ICC T20 World Cup 2021, IND vs AFG, Highlights: 66 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం..!
Ind Vs Afg, Live Score, T20 World Cup 2021

ICC T20 World Cup 2021, Highlights:ఆఫ్ఘనిస్తాన్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 66 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధిచింది. అబుదాబీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు విజృంభించారు. నిర్ణీత 20 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(74), రాహుల్(69) అర్ధ సెంచరీలు సాధించడమే కాకుండా.. మొదటి వికెట్‌కు140 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా(35), రిషబ్ పంత్(27) మెరుపులు మెరిపించడంతో టీమిండియా స్కోర్ సునాయాసంగా 200 దాటింది. ఇక ఆఫ్ఘన్ బౌలర్లలో నైబ్, జనట్ చెరో వికెట్ తీశారు.

భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్(కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్-ఉల్-హక్, హమీద్ హసన్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 03 Nov 2021 11:22 PM (IST)

    66 పరుగులతో టీమిండియా ఘన విజయం

    ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 66 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధిచింది.

  • 03 Nov 2021 11:05 PM (IST)

    ఏడో వికెట్ డౌన్..

    18.3 ఓవర్‌లో రషీద్ 0 పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఆఫ్ఘన్ టీం ఏడో వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.

  • 03 Nov 2021 11:01 PM (IST)

    ఆరో వికెట్ డౌన్..

    18.1 ఓవర్‌లో నబీ 35(32) పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఆఫ్ఘన్ టీం ఆరు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.

  • 03 Nov 2021 10:54 PM (IST)

    17 ఓవర్లకు 109/5

    17 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆఫ్ఘనిస్తాన్ 109 పరుగులు సాధించింది. క్రీజులో నబీ (22), జనత్ (23) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆఫ్ఘన్ విజయానికి 18 బంతుల్లో 102 పరుగులు చేయాల్సి ఉంది.

  • 03 Nov 2021 10:43 PM (IST)

    15 ఓవర్లకు 88/5

    15 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆఫ్ఘనిస్తాన్ 88 పరుగులు సాధించింది. క్రీజులో నబీ (16), జనత్ (10) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆఫ్ఘన్ విజయానికి 30 బంతుల్లో 123 పరుగులు చేయాల్సి ఉంది.

  • 03 Nov 2021 10:31 PM (IST)

    ఐదో వికెట్ డౌన్..

    11.5 ఓవర్‌లో నజీబుల్లాహ్ 11(13) పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో ఆఫ్ఘన్ టీం ఐదు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.

  • 03 Nov 2021 10:17 PM (IST)

    నాలుగో వికెట్ డౌన్..

    9.3 ఓవర్‌లో గుల్బాద్దీన్ 18(20 బంతులు) పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో ఆఫ్ఘన్ టీం నాలుగు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.

  • 03 Nov 2021 10:08 PM (IST)

    మూడో వికెట్ డౌన్..

    6.5 ఓవర్‌లో గుర్బాజ్ 19(10 బంతులు) పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఆఫ్ఘన్ టీం మూడు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది.

  • 03 Nov 2021 10:00 PM (IST)

    5 ఓవర్లకు 38/2

    5 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆఫ్ఘనిస్తాన్ 38 పరుగులు సాధించింది. క్రీజులో నైబ్ (6 పరుగులు, 4 బంతులు, 1 ఫోర్), గుర్బాజ్ 19(7 బంతులు, 1 ఫోర్, 2 సిక్సులు) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 03 Nov 2021 09:49 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘన్..

    ఆఫ్ఘన్ ఓపెనర్లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. హజ్రతుల్లా 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బుమ్రా బౌలింగ్‌లో ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీనితో 13 పరుగుల వద్దే ఆఫ్ఘన్ రెండో వికెట్ కోల్పోయింది.

  • 03 Nov 2021 09:48 PM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్..

    ఆఫ్ఘనిస్తాన్ మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షాహజాద్.. షమీ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనితో 13 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ మొదటి వికెట్ కోల్పోయింది.

  • 03 Nov 2021 09:37 PM (IST)

    ఆచితూచి ఆరంభించిన ఆఫ్ఘన్..

    ఆఫ్ఘన్ ఓపెనర్లు ఫస్ట్ ఓవర్ ఆచితూచి ఆడారు. షమీ వేసిన ఈ ఓవర్‌లో 5 పరుగులు రాబట్టారు. హజ్రతుల్లా ఒక చక్కటి ఫోర్ బాదాడు. దీనితో ఆఫ్ఘనిస్తాన్ మొదటి ఓవర్ ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది.

  • 03 Nov 2021 09:23 PM (IST)

    దుమ్మురేపిన టీమిండియా..

    అబుదాబీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా దుమ్ముదులిపేసింది. నిర్ణీత 20 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. చివర్లో పాండ్యా(35), పంత్(27) మెరుపులు మెరిపించడంతో టీమిండియా స్కోర్ 200 దాటింది.

  • 03 Nov 2021 09:02 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

    టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. గుల్బదిన్ నైబ్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ వైపు భారీ షాట్ ఆడబోయి రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 69 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు. దీనితో టీమిండియా 147 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇక 17 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్లకు 160 పరుగులు చేసింది.

  • 03 Nov 2021 08:56 PM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియా తోలి వికెట్ కోల్పోయింది. కరీం జనత్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీనితో రోహిత్ శర్మ 74 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు. ఇక 15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 1 వికెట్ నష్టానికి 142 పరుగులు చేసింది.

  • 03 Nov 2021 08:53 PM (IST)

    14 ఓవర్లకు టీమిండియా 135/0

    టీమిండియా ఓపెనర్లు రాహుల్(60), రోహిత్ శర్మ(74) భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ ఆఫ్ఘన్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీలు పూర్తీ చేసుకున్నారు. ఈ ఓవర్‌లో రోహిత్ రెండు సిక్సర్లు బాదాడు.

  • 03 Nov 2021 08:51 PM (IST)

    12 ఓవర్లకు టీమిండియా 107/0

    టీమిండియా నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు రాహుల్(48), రోహిత్ శర్మ(58) ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డు ముందుకు కదిలిస్తున్నారు. ఈ ఓవర్‌లో 16 పరుగులు రాబట్టిన ఈ ఇద్దరూ.. ఓ ఫోర్, ఓ సిక్స్ కొట్టారు.

  • 03 Nov 2021 08:49 PM (IST)

    తొలి వికెట్ డౌన్..

    14.4 ఓవర్‌లో రోహిత్ శర్మ 74(47 బంతులు, 8 ఫోర్లు, 3 సిక్స్) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

  • 03 Nov 2021 08:44 PM (IST)

    టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు

    5 బాబర్ – రిజ్వాన్ 4 రోహిత్ – ధావన్ 4 గప్టిల్ – విలియమ్సన్ 4 రోహిత్ – రాహుల్ T20I లలో 12 సెంచరీ భాగస్వామ్యాలతో జతకట్టాడు. బాబర్ ఆజం కూడా 12 సెంచరీలలో తన భాగస్వామ్యాన్ని అందించాడు.

  • 03 Nov 2021 08:22 PM (IST)

    10 ఓవర్లకు 85/0

    10 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 85 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 44(32 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ 40(29 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 03 Nov 2021 08:12 PM (IST)

    8 ఓవర్లకు 65/0

    8 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 65 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 38(28 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ 26(21 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 03 Nov 2021 08:07 PM (IST)

    సూపర్ 12లో అత్యధిక పవర్‌ప్లే స్కోర్లు

    66/0 Eng vs Aus దుబాయ్ 63/0 Aus vs SL దుబాయ్ 55/1 Afg vs Sco షార్జా 54/1 SL vs BAN షార్జా 53/0 Ind vs Afg అబుదాబి 53/1 SL v Aus దుబాయ్

  • 03 Nov 2021 08:05 PM (IST)

    పవర్ ప్లేలో బెస్ట్ స్కోర్: 53/0

    టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు టీమిండియా ఆడిన మ్యాచుల్లో పవర్ ప్లేలో బెస్ట్ స్కోర్‌ను సాధిచింది. 53/0తో ఓపెనర్లిద్దరూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం అందించారు.

  • 03 Nov 2021 07:56 PM (IST)

    ఐదో ఓవర్లకు 52/0

    5 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 52 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 34(19 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ 17(12 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 03 Nov 2021 07:50 PM (IST)

    నాలుగో ఓవర్‌లో 1,1,0,1,1,1

    హమీద్ హక్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్, రాహుల్ ఇద్దరూ సింగిల్స్‌తో బ్యాటింగ్‌ను రోటేట్ చేసుకున్నారు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 5 పరుగులు వచ్చాయి.

  • 03 Nov 2021 07:46 PM (IST)

    మూడో ఓవర్‌లో 0,1,1,0,4,1

    నవీన్ హుల్ హక్ వేసిన మూడో ఓవర్‌లో రోహిత్ ఒక బౌండరీ మిడ్ మీదుగా సాధించాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 7 పరుగులు వచ్చాయి.

  • 03 Nov 2021 07:40 PM (IST)

    రెండో ఓవర్‌లో 1,4,0,0,6, 4

    షరాఫుద్దీన్ వేసిన రెండో ఓవర్‌లో రోహిత్ ఒక బౌండరీ, కేఎల్ రాహుల్ మిడాప్‌ మీదుగా ఒక సిక్స్, బౌండరీ సాధించారు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 16 పరుగులు వచ్చాయి.

  • 03 Nov 2021 07:36 PM (IST)

    తొలి ఓవర్‌లో 0,1,1,0,1,4

    తొలి ఓవర్‌లో రోహిత్ శర్మ తొలి బౌండరీ సాధించడంతో మొత్తం 7 పరుగులు వచ్చాయి.

  • 03 Nov 2021 07:15 PM (IST)

    IND vs AFG Live: అబుదాబి పిచ్

    అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలోని పిచ్‌లో గడ్డి చిన్నగా ఉంది. నిన్న ఇదే మైదానంలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో పేసర్లు ఆదుకున్నారు. మరి ఈ రోజు ఏం జరగనుందో..!

  • 03 Nov 2021 07:12 PM (IST)

    IND vs AFG: టీమిండియాలో రెండు మార్పులు

    భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

    ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్(కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్-ఉల్-హక్, హమీద్ హసన్

  • 03 Nov 2021 07:10 PM (IST)

    ముచ్చటగా మూడోసారి టాస్ ఓడిన కోహ్లీ

    విరాట్ కోహ్లీకి టాస్‌కి పెద్ద విరోధిలా మారింది. టీ20 ప్రపంచకప్‌2021లో ముచ్చటగా మూడోసారి టాస్ ఓడిపోయాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ టీం టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేయనుంది. కోహ్లీసేన మొదట బ్యాటింగ్ చేయనుంది.

  • 03 Nov 2021 06:57 PM (IST)

    IND vs AFG Live: టీమ్ ఇండియాకు గబ్బర్ సందేశం

    టీమ్ ఇండియాకు ఈరోజు ప్రతి అభిమాని మద్దతు ఎంతో అవసరం. అభిమానులే కాదు, ప్రపంచకప్‌లో భాగం కాని టీమిండియా ఆటగాళ్లు కూడా తమ మద్దతును తెలియజేస్తున్నారు. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ట్వీట్ ద్వారా విరాట్ కోహ్లి జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు.

  • 03 Nov 2021 06:54 PM (IST)

    IND vs AFG Live: అబుదాబిలో అదృష్టం మారుతుందా?

    టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌పై ఆశలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో టీమ్‌ఇండియా నేడు అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఈరోజు మ్యాచ్ అబుదాబిలో జరుగుతోంది. ఈ టోర్నీ గ్రూప్ దశలో భారత జట్టు తొలిసారి, చివరిసారి ఇదే మైదానంలో ఆడనుంది. జట్టు ఆడిన 5 మ్యాచ్‌లలో 4 దుబాయ్‌లో జరిగాయి. ఇప్పటికే దుబాయ్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు పోరులో తన అదృష్టం మారుతుందా? లేదో చూడాలి?

Published On - Nov 03,2021 6:52 PM

Follow us