AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Tips: ఏసీ వేసినా కరెంటు బిల్లు సగంలోపే వస్తుంది.. జస్ట్ ఇలా చేస్తే చాలు.. వేసవి మొత్తం హాయి..

కొన్ని చిట్కాలు పాటిస్తే కరెంటు బిల్లు సగం తగ్గించుకోవచ్చు. మీరు ఈ చిట్కాలను పాటిస్తే.. మీరు గజిబిజితో ఏసీని నడపాల్సిన అవసరం లేదు. అలా అని మీరు వేడిలో ఉండాల్సిన అవసరం లేదు.

AC Tips: ఏసీ వేసినా కరెంటు బిల్లు సగంలోపే వస్తుంది.. జస్ట్ ఇలా చేస్తే చాలు.. వేసవి మొత్తం హాయి..
Install AC
Sanjay Kasula
|

Updated on: Feb 24, 2023 | 8:47 AM

Share

ఎండలు దంచికొడుతున్నాయి. జనం తమ ఇళ్లలో కూలర్లు, ఏసీలు బయటకు తీశారు. ఈ సీజన్‌లో కరెంటు బిల్లు మోత మొగుతుంది. కరెంటు బిల్లును ఎలా తగ్గుంచుకోవాలని మనలో చాలా మంది ఆలోచిస్తుంటారు. వేసవిలో ఏసీ, కూలర్ నడపడవ కుంటే ఇంట్లో ఉండటం చాలా కష్టంగా మారుతుంది. దీంతో రూ.వేలల్లో బిల్లు వస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే కరెంటు బిల్లు సగం తగ్గించుకోవచ్చు. మీరు ఈ చిట్కాలను పాటిస్తే.. మీరు కూడా ఈ పవర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. టెన్షన్ పడుతూ ఏసీని నడపాల్సిన అవసరం అస్సలు ఉండదు. అలా అని వేడిలో ఉండాల్సిన అవసరం కూడా ఉండదు.

అయితే, మీరు ఏసీ కొంటున్నప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో రాబోయే వేసవి కాలం మీకు చల్ల చల్లని ఆనందాన్నిఅందిస్తుంది. ఇందుకు మీరు ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఏం చేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మూడు నెలల హ్యాపీగా గడపొచ్చు. ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

5 స్టార్ రేటింగ్

5 స్టార్ రేటెడ్ ఏసీలు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి. మీరు విద్యుత్ బిల్లును ఆదా చేయాలనుకుంటే, 5 స్టార్ రేటింగ్‌తో ఏసీని కొనుగోలు చేయండి. ఎల్‌ఈడీ లైట్లు వాడినా విద్యుత్ వినియోగం తక్కువ.

ఫ్రిజ్‌లో వంటలను ఎక్కువగా పెట్టకండి..

మైక్రోవేవ్ వంటి వాటిని ఫ్రిజ్‌లో అస్సలు ఉంచవద్దు. దీనివల్ల విద్యుత్తు వినియోగం ఎక్కువ. ఫ్రిజ్‌ను ప్రత్యక్ష సూర్యకాంతి నుంచి దూరంగా ఉంచండి. ఫ్రిజ్ చుట్టూ గాలి తగిలేలా ఏర్పాటు చేసుకోండి. వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో అస్సలు ఉంచవద్దు. ముందుగా చల్లారనివ్వాలి. ఆ తర్వాతే ఫిజులో పెట్టండి.

సోలార్ ఇన్స్టాల్ చేసుకోండి

నెలలో 30 రోజులు సూర్యరశ్మి ఉంటుంది. మీరు మీ ఇంటి పైకప్పుపై సౌలార్ పలకాలను అమర్చవచ్చు. ఇది ఒక సారి పెట్టుబడి పెడితే చాలా.. కానీ ఇది మీ విద్యుత్ బిల్లును తగ్గించగలదు. మీ ఇంటికి ఎంత అవసరం అవుతుందో లెక్క చేసుకుని ఈ సోలార్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

సీలింగ్, టేబుల్ ఫ్యాన్లను ఎక్కువగా ఉపయోగించుకోండి

వేసవిలో ఏసీల కంటే సీలింగ్, టేబుల్ ఫ్యాన్లను ఎక్కువగా వాడండి. గంటకు 30 పైసలు, ఏసీ గంటకు రూ.10 చొప్పున నడుస్తుంది. మీరు ఎయిర్ కండిషన్‌ తప్పనిసి అయితేనే ఉపయోగించండి. దానిని 25 డిగ్రీల వద్ద సేవ్ చేసి, దాన్ని అమలు చేయండి. దీంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. అలాగే ఏసీ నడుస్తున్న గది తలుపులు మూసేయండి.

ఈ విధంగా మీరు విద్యుత్తును కూడా ఆదా చేయవచ్చు

CFL బల్బు, ట్యూబ్ లైట్ కంటే ఐదు రెట్లు విద్యుత్ ఆదా చేస్తుంది. కాబట్టి ట్యూబ్ లైట్‌కు బదులుగా CFL ఉపయోగించండి. మీకు గదిలో లైట్ అవసరం లేకపోతే, దాన్ని ఆపివేయండి. ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, మోషన్ సెన్సార్, డిమ్మర్ వంటి వాటిని ఉపయోగించండి.

Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం