AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..

కలలు రావడం సర్వసాధారణం. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. అయితే కలలో మనకు కనిపించే వస్తువులు మన భవిష్యత్తును అంచనా వేస్తుందని పండితులు చెబుతుంటారు. మరి కలలో బంగారం కనిపిస్తే దేనికో సంకేతమో ఎప్పుడైనా ఆలోచించారా.? బంగారం అనగానే అన్నీ పాజిటివ్‌ వైబ్స్‌ వినిపిస్తాయి. బంగారం అంటేనే సంపదకు...

Gold: కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
Gold in dream
Narender Vaitla
|

Updated on: Mar 28, 2024 | 5:34 PM

Share

కలలు రావడం సర్వసాధారణం. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. అయితే కలలో మనకు కనిపించే వస్తువులు మన భవిష్యత్తును అంచనా వేస్తుందని పండితులు చెబుతుంటారు. మరి కలలో బంగారం కనిపిస్తే దేనికో సంకేతమో ఎప్పుడైనా ఆలోచించారా.? బంగారం అనగానే అన్నీ పాజిటివ్‌ వైబ్స్‌ వినిపిస్తాయి. బంగారం అంటేనే సంపదకు చిహ్నంగా భావిస్తారు. మరి అలాంటి బంగారం కలలో కనిపిస్తే ఎలాంటి వాటికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

* బంగారం సంపదకు చిహ్నమైనప్పటికీ మీకు ఒకవేళ కలలో బంగారు అభరణాలు కనిపిస్తే మీరు భవిష్యత్తులో చాలా డబ్బు ఖర్చు చేయబోతున్నారని అర్థం. ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన సమయమని అర్థం చేసుకోవాలి.

* ఒకవేళ నేలపై పడిన బంగారాన్ని తీసుకుంటున్నట్లు కల వస్తే కూడా అశుభమని పండితులు చెబుతున్నారు. ఇలాంటి కల వస్తే కొన్ని రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి కలలు వేస్తే ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

* ఇక మీ నగలు పోగొట్టుకున్నట్లు కలలు వచ్చినా మంచిది కాదని పండితులు చెబుతున్నారు. డబ్బు నష్టం వెంటాడుతుందని దీని అర్థం.

* ఒకవేళ మీ నగలను ఎవరైనా దొంగలించినట్లు కల వస్తే అది కూడా మంచిది కాదు. ఇలాంటి కల వస్తే మీరు వ్యాపారంలో ఊహించని నష్టం ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అర్థం. ముఖ్యంగా వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని అర్థం.

* అయితే కలలో ఒకవేళ మీరు బంగారు అభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు కనిపిస్తే మాత్రం శుభ సూచికమని పండితులు చెబుతున్నారు. మీరు ఆర్థికంగా ఎదిగేందుకు సూచనగా చెబుతున్నారు. అలాగే బంగారు అభరణాలు బహుమతిగా తీసుకుంటున్నల్లు కల వస్తే ఆర్థికంగా కలిసి వస్తుందని అర్థం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం కొందరు పండితులు తెలిపిన విషయాలు, శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం
శాంసన్ vs శ్రేయస్.. సెలెక్టర్లు, గంభీర్, ఫ్యాన్స్.. ఎవరి ఓటు ఎటు?
శాంసన్ vs శ్రేయస్.. సెలెక్టర్లు, గంభీర్, ఫ్యాన్స్.. ఎవరి ఓటు ఎటు?
పెళ్లైన 10ఏళ్లకు విడాకులు.. కట్ చేస్తే 7ఏళ్ల చిన్నవాడితో
పెళ్లైన 10ఏళ్లకు విడాకులు.. కట్ చేస్తే 7ఏళ్ల చిన్నవాడితో
రిసెఫ్షన్‌లో ఇదేం రచ్చ రా సామీ.. ఒక్కసారిగా దడుసుకుని చచ్చారుగా
రిసెఫ్షన్‌లో ఇదేం రచ్చ రా సామీ.. ఒక్కసారిగా దడుసుకుని చచ్చారుగా
భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి
భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి
పచ్చి కొబ్బరి చట్నీ.. అటు అన్నంలోకి ఇటు టిఫిన్స్ లోకి అదుర్స్
పచ్చి కొబ్బరి చట్నీ.. అటు అన్నంలోకి ఇటు టిఫిన్స్ లోకి అదుర్స్
ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా?ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!
ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా?ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!
అందుకే సావిత్రి చనిపోయినా చూడటానికి వెళ్లలేదు..
అందుకే సావిత్రి చనిపోయినా చూడటానికి వెళ్లలేదు..
అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా
అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా
శనగపిండి, ఉల్లిపాయతో ఇలా వండి తింటే చపాతీ, పూరిల్లోకి పర్ఫెక్ట్
శనగపిండి, ఉల్లిపాయతో ఇలా వండి తింటే చపాతీ, పూరిల్లోకి పర్ఫెక్ట్