మీ ఏజ్‌ను బట్టి మీరు ఎన్ని కిలోమీటర్లు వాకింగ్ చేయాలో తెలుసా..?
Krishna
05 June 2026
18 నుండి 64 ఏళ్ల వయస్సు గల పెద్దలు ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. దీనిని రోజువారీగా లెక్కిస్తే.. సాధారణ వేగంతో ప్రతిరోజూ సుమారు 3 నుండి 5 కిలోమీటర్లు నడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఎంత నడవాలి
65 ఏళ్ల కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వృద్ధులకు కూడా వారానికి 150 నిమిషాల శారీరక శ్రమ అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే వీరు తమ శారీరక సామర్థ్యం, మోకాళ్ల నొప్పులను బట్టి వైద్యుల సలహాతో తగినంత దూరం మాత్రమే నడవాలి.
వృద్ధులు
చిన్నపిల్లలు, టీనేజర్ల శారీరక ఎదుగుదల కోసం ప్రతిరోజూ కనీసం 60 నిమిషాల పాటు ఏదో ఒక శారీరక శ్రమ లేదా వాకింగ్ చేయాలని ఆరోగ్య సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి.
పిల్లలు - టీనేజర్లు
హెల్త్‌లైన్ ప్రకారం.. ప్రతిరోజూ నడవడం వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు సులభంగా బర్న్ అవుతాయి. అయితే ఎంత వేగంగా బరువు తగ్గుతారనేది.. నడిచే వేగం, దూరం, వారి ప్రస్తుత బరువుపై ఆధారపడి ఉంటుంది.
బరువు తగ్గుతారు
నడక వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు బీపీ అదుపులో ఉంటుంది. రోజువారీ నడక సమయాన్ని లేదా దూరాన్ని పెంచుకుంటూ పోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అంతకంతకూ తగ్గుతుంది.
గుండె జబ్బులు
అధ్యయనం ప్రకారం.. భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. రోజంతా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్న వాక్ చేయడం షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది.
షుగర్ లెవెల్స్
నడక అనేది మోకాళ్లు, కీళ్లను కాపాడటానికి సహాయపడుతుంది. ఇది కీళ్లకు ఆసరా ఇచ్చే కండరాలను బలోపేతం చేస్తుంది. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారికి కూడా రోజూ నడవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కీళ్ల నొప్పులు
2018 అధ్యయనం ప్రకారం.. క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాక్ చేసే వారిలో ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. ఇది జలుబు, ఫ్లూ, ఇతర సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రోగనిరోధక శక్తిని వృద్ధి చేస్తుంది.