AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రిసెఫ్షన్‌లో ఇదేక్కడి రచ్చ రా సామీ.. ఒక్కసారిగా దడుసుకుని చచ్చారుగా.. వధూవరుల రియాక్షన్ చూస్తే..

Wedding Viral Video: ఇలాంటి వింతలు, వినోదాలు మనదేశంలో జరిగే పెళ్లిళ్లలోనే సాధ్యమంటూ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పెళ్లిని వినూత్నంగా మార్చాలనే ఉత్సాహంలో చేసే ఇలాంటి ప్రమాదకరమైన పనులు కొన్నిసార్లు హాస్యాస్పదంగా మారుతుంటాయి.

Video: రిసెఫ్షన్‌లో ఇదేక్కడి రచ్చ రా సామీ.. ఒక్కసారిగా దడుసుకుని చచ్చారుగా.. వధూవరుల రియాక్షన్ చూస్తే..
Wedding Viral Video
Venkata Chari
|

Updated on: Jun 05, 2026 | 8:24 AM

Share

Wedding Viral Video: భారతీయ వివాహాల్లో డ్యాన్సులు, అల్లరి, నవ్వులు సర్వసాధారణం. కానీ, తాజాగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఒక వైరల్ వీడియో చూస్తే మాత్రం మీ కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. పెళ్లి పీటలపై కూర్చున్న నూతన వధూవరుల ముందే ఇద్దరు యువకులు చేసిన భయంకరమైన విన్యాసాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

పెళ్లి వేదికపై ఊహించని వింత విన్యాసాలు..

సాధారణంగా పెళ్లిళ్లలో బంధుమిత్రులు హుషారైన పాటలకు డ్యాన్స్ చేయడం మనం చూస్తుంటాం. కానీ ఈ వైరల్ వీడియోలో జరిగిన వింత వ్యవహారం పెళ్లికి వచ్చిన వారినే కాకుండా, నెటిజన్లను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. నూతన వధూవరులు పెళ్లి వేదికపై ప్రశాంతంగా కూర్చుని ఉండగా, ఇద్దరు యువకులు అకస్మాత్తుగా స్టేజ్ పైకి దూసుకువచ్చారు. ఏమాత్రం సంకోచించకుండా ఒకరి తలని మరొకరు పట్టుకుని గాల్లో వేగంగా తిప్పడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Video: అర్ధరాత్రి 1 గంట.. నిర్మానుష్య రోడ్డుపై ఓ వ్యక్తి.. కట్‌చేస్తే.. ఆ తర్వాత సీన్ చూస్తే..!

అంతటితో ఆగకుండా, ఒక యువకుడు మరొకరి శరీరంపైకి ఎక్కి నిలబడి బాలెన్స్ చేస్తూ స్టేజ్ మొత్తం తిరగడం మొదలుపెట్టాడు. ఈ ప్రమాదకరమైన విన్యాసాలు చూస్తుంటే అక్కడ పెళ్లి జరుగుతోందా లేక ఏదైనా టాలెంట్ షో లేదా సర్కస్ ప్రదర్శన నడుస్తోందా అన్న అనుమానం కలగక మానదు. అక్కడున్న పెళ్లి బంధువులు కూడా ఈ ఊహించని సంఘటనను చూసి షాక్ తింటూ, తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేయడం ప్రారంభించారు.

వధూవరుల రియాక్షన్ చూసి నవ్వు ఆపుకోలేరు..!

ఈ మొత్తం వీడియోలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, వధూవరుల ప్రవర్తన. తమ కళ్ల ముందే అంత పెద్ద ప్రమాదకరమైన స్టంట్స్ జరుగుతున్నా, ఆ కొత్త జంట ముఖాల్లో ఎలాంటి భావాలూ పలకలేదు. వారు భయపడలేదు, కనీసం ఆశ్చర్యపోలేదు, నవ్వనూ లేదు. ఏదో శిల్పాల్లా అలా నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు.

ఇది కూడా చదవండి: Video: అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా.. ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే..!

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బహుశా ఆ వధూవరులకు ఈ ప్రదర్శన గురించి ముందే సమాచారం ఉండి ఉంటుందని కొందరు భావిస్తుంటే, మరికొందరు మాత్రం పెళ్లి వేడుకలు, ఫొటో షూట్లతో అలసిపోయి, చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకునే ఓపిక కూడా వారికి లేనట్లు ఉందని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

నెటిజన్ల క్రేజీ కామెంట్లు.. నవ్వుల పువ్వులు!

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారినప్పటి నుంచి నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

ఒక యూజర్ స్పందిస్తూ.. “బహుశా వీరు ప్రీ వెడ్డింగ్ షూట్ బడ్జెట్ మిగిల్చి, ఈ స్టంట్ మాస్టర్లను పిలిపించుకున్నట్లు ఉన్నారు” అని ఎద్దేవా చేశారు.

మరో నెటిజన్.. “ఇది పెళ్లా లేక ఇండియాస్ గాట్ టాలెంట్ షోనా?” అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Video: రిసెఫ్షన్‌లో ఇదేక్కడి రచ్చ రా సామీ.. ఒక్కసారిగా దడుసుకుని చచ్చారుగా.. వధూవరుల రియాక్షన్ చూస్తే..

ఇంకొకరైతే.. “ధనవంతులు పెళ్లిళ్లకు పెద్ద పెద్ద సెలబ్రిటీలను పిలుస్తారు, కానీ ఇక్కడ పెళ్లికి వచ్చిన అతిథులే పెద్ద సెలబ్రిటీల్లా షో ఇచ్చేశారు” అని రాసుకొచ్చారు.

“పెళ్లికూతురు ముఖం చూస్తుంటే ఆమెకు ఇందులో అస్సలు ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది, ఒకవేళ నా పెళ్లిలో ఎవరైనా ఇలాంటి పనులు చేసి ఉంటే నేను స్టేజ్ దిగి వెళ్ళిపోయేవాడిని” అని మరికొందరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us