Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digvijay Singh: కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు, హిందూ, ముస్లిం సంతాన సాఫల్యతపై హాట్ కామెంట్స్

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ మ‌రోసారి వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. 2028 నాటికి హిందువులు, ముస్లింల్లో సంతాన సాఫ‌ల్య రేటు

Digvijay Singh: కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు, హిందూ, ముస్లిం సంతాన సాఫల్యతపై హాట్ కామెంట్స్
D Sing
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 23, 2021 | 2:03 PM

Digvijay Singh: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ మ‌రోసారి వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. 2028 నాటికి హిందువులు, ముస్లింల్లో సంతాన సాఫ‌ల్య రేటు ఒకే విధంగా ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఓ అధ్యయ‌న వివరాల ప్రకారం 1951 నుంచి ముస్లింల్లో సంతానోత్పత్తి రేటు హిందువుల‌తో పోలిస్తే అధికంగా త‌గ్గుతోందని, ప్రస్తుతం ముస్లింల్లో సంతాన సాఫ‌ల్య రేటు 2.7 శాతం కాగా, హిందువుల్లో ఇది 2.3 శాతంగా ఉంద‌ని.. 2028 నాటికి ఇది హిందూ, ముస్లింలలో స‌మానంగా ఉంటుంద‌ని దిగ్విజ‌య్ సింగ్ వ్యాఖ్యానించారు.

ముస్లింల జ‌నాభా పెరుగుతోంద‌ని త్వర‌లో వారి జ‌నాభా హిందువుల‌ను అధిగ‌మిస్తుంద‌ని కొంద‌రు పేర్కొంటున్న నేప‌ధ్యంలో దిగ్విజ‌య్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దిగ్విజ‌య్ సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలోనూ ఈ అంశంపై మాట్లాడారు. ముస్లింల జ‌నాభా పెరుగుద‌ల గురించి త‌ప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని అంటూ ఈ అంశంపై బ‌హిరంగ చ‌ర్చకు రావాల‌ని మోహ‌న్ భ‌గ‌వ‌త్ స‌హా ఆరెస్సెస్ ప్రచార‌క్‌ల‌కు ఆయ‌న స‌వాల్ విసిరారు.

ముస్లింల సంతానోత్పత్తి రేటు త‌గ్గుతున్నద‌ని, హిందువుల కంటే ముస్లింలు ఈ దేశంలో ఎన్నడూ మెజారిటీలు కాబోర‌ని తాను నిరూపిస్తాన‌ని అన్నారు. ధ‌ర‌ల మంట‌తో సామాన్యుడు భార్యా, పిల్లల‌తో బ‌తక‌లేని పరిస్ధితులు ఉండ‌గా, ఓ ముస్లిం న‌లుగురు భార్యలు, వారికి పుట్టిన పిల్లల‌తో ఎలా నెట్టుకొస్తార‌ని ఆయ‌న ప్రశ్నించారు.

Read also:  Andhra Politics: నెత్తి మీద గుడ్డ.. కంటి నిండా కన్నీరు.! పరిషత్ ఫలితాల నేపథ్యంలో వైసీపీ నేతల వింత వేదన

లెమన్ వాటర్లో ఈ ఒక్కటి కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..
లెమన్ వాటర్లో ఈ ఒక్కటి కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..
మ్యాజిక్ డ్రింక్.. రాత్రిపూట తాగితే అమేజింగ్ అంతే..
మ్యాజిక్ డ్రింక్.. రాత్రిపూట తాగితే అమేజింగ్ అంతే..
ప్రకృతి ఒడిలో అందంగా, ఆనందంగా.. సమంత క్యూట్ ఫొటోస్ చూశారా!
ప్రకృతి ఒడిలో అందంగా, ఆనందంగా.. సమంత క్యూట్ ఫొటోస్ చూశారా!
గడ్డం బాబుల స్టైల్.. వారెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుంది! ఎలాగంటే
గడ్డం బాబుల స్టైల్.. వారెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుంది! ఎలాగంటే
పెట్టుబడి మంత్రంతో నోటీసుల కుతంత్రం చిత్తు..!
పెట్టుబడి మంత్రంతో నోటీసుల కుతంత్రం చిత్తు..!
రూ. 200కే బట్టతల మందు.. జెట్‌స్పీడ్‌గా జుట్టు తెప్పిస్తాడట..
రూ. 200కే బట్టతల మందు.. జెట్‌స్పీడ్‌గా జుట్టు తెప్పిస్తాడట..
ఈ చిత్రంలో మెదట చూసిన ఫేస్ మీ వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడిస్తుంది
ఈ చిత్రంలో మెదట చూసిన ఫేస్ మీ వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడిస్తుంది
మీ మైండ్ షార్ప్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!
మీ మైండ్ షార్ప్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!
ఎఫ్‌డీ ఖాతాదారులకు అలెర్ట్.. పెట్టుబడికి మూడు రోజులే గడువు
ఎఫ్‌డీ ఖాతాదారులకు అలెర్ట్.. పెట్టుబడికి మూడు రోజులే గడువు
ప్రైవేటు బ్యాంకులోనూ పీఎం విద్యాలక్ష్మీ లోన్.. ఇలా అప్లై చేయండి
ప్రైవేటు బ్యాంకులోనూ పీఎం విద్యాలక్ష్మీ లోన్.. ఇలా అప్లై చేయండి