Chanakya Niti: ఇలాంటి సందర్భాల్లో మీరు మౌనంగా ఉండాలి.. లేదంటే చిక్కుల్లో పడతారు!
మాట పదునైన ఆయుధం లాంటిది. దానితో స్నేహాన్ని గెలవొచ్చు.. అదే మాటతో గుండెలపై పోటు పోడవచ్చు. రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది నోటి మాట. ఇలాంటి మాటను ఆచి తూచి మాట్లాడాలి. లేదంటే అదే చిక్కులు తెచ్చి పెడుతుందని అంటున్నాడు చాణిక్యుడు..
ప్రతి ఒక్కరూ జీవితంలో ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ మనలో కొంత మందికి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అధిక మంది ప్రశాంతత లేక అల్లాడిపోతుంటారు. మన తోటివారు చాలా మంది నాకు మనశ్శాంతి లేదు అని చెప్పడం తరచూ వింటూనే ఉంటాం. కానీ మనకు కావల్సిన శాంతి ఖచ్చితంగా మరొకరిలో దొరకదు. మన మనస్సును తెలుసుకుంటే మనకు కవాల్సిన మనశ్శాంతి స్వయంచాలకంగా లభిస్తుంది. ఆచార్య చాణక్యుడు మనం కొన్ని ప్రదేశాలలో, నిర్దిష్ట సమయాల్లో మాట్లాడకూడదని, ఓపికగా, మౌనంగా ఉండాలని, అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలమని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
భావోద్వేగాలకు విలువ ఇవ్వని చోట
భావోద్వేగాలకు విలువ ఇవ్వని చోట స్పందించడం సరికాదు. మీరు లాభదాయకంగా వ్యవహరించే ప్రదేశంలో ఉంటే, మౌనంగా ఉండటం ఉత్తమం. మీ మనస్సు బాధ, దుఃఖం దేనికీ విలువైనది కాదు. కాబట్టి మీకు చిరాకుగా అనిపిస్తే, మీకు అలాంటి వ్యక్తులు నచ్చకపోతే.. అక్కడి నుంచి పక్కకు వచ్చేయాలి. లేకుంటే మౌనంగా ఉండడం ద్వారా మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చు.
సంబంధం లేని సమస్యలున్నప్పుడు
కొందరికి సంబంధం లేని సమస్యలపై అధికంగా కలుగ చేసుకోవడం అలవాటు. కానీ ఎవరైనా మీ ముందు సంబంధం లేని విషయం గురించి మాట్లాడుతుంటే, మౌనంగా ఉండటం మంచిది. మాట్లాడకుంటే సమస్యను మీ మీదకు తెచ్చుకోవాల్సి అవసరం ఉండదు. ఇతరుల విషయాల గురించి మాట్లాడటం మీ మానసిక ప్రశాంతతను పాడు చేస్తుంది.
అవమానించే వ్యక్తులకు దూరంగా
కొందరు వ్యక్తులు మీ శ్రేయస్సు లేదా మీ జీవితంలోని ఔన్నత్యాన్ని సహించలేరు. ఇలాంటి సందర్భంలో మీతో మాట్లాడే వ్యక్తుల్లో ఎవరైనా మిమ్మల్ని ఆటపట్టించినా, విమర్శించినా, అలాంటి చోట ఓపిక పట్టి ఉండండి. మిమ్మల్ని అవమానించే వారితో వాగ్వాదానికి దిగకండి. వారి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. దీన్నిబట్టి ఆ వ్యక్తుల వ్యక్తిత్వం వారి మాటలను బట్టి తెలిసిపోతుంది.
మీకు సరైన సమాచారం తెలియకపోతే
మీ ముందు ఏదైనా అంశం చర్చకు వచ్చినట్లయితే, దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలియకపోతే, ఆ సమయంలో మౌనంగా ఉండటం మంచిది. ఇలాంటి సమయాల్లో నోరు మెదపకపోతే మీకు తెలియనిది ఇతరుల ద్వారా తెలిసిపోతుంది. అలాగే మీరు మీ గౌరవాన్ని కోల్పోకుండా కాపాడుకోవచ్చు.