AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: శవాలకి కూడా ప్రశాంతత లేదు.. ఇది వింటే ఒళ్లు గగుర్పాటుకు గురి కావాల్సిందే..!

పాతబస్తీలో మంత్రగాళ్లుగా అనుమానించే పలువురు బాబాలు విదేశాలకు సైతం వెళ్లి మంత్రాలు, తంత్రాలు చేస్తున్నట్టు సమాచారం. .

Hyderabad: శవాలకి కూడా ప్రశాంతత లేదు.. ఇది వింటే ఒళ్లు గగుర్పాటుకు గురి కావాల్సిందే..!
Old City
Noor Mohammed Shaik
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 10, 2024 | 1:02 PM

Share

మనిషి బతికి ఉన్నప్పుడు కాదు.. చచ్చాక కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అనిపిస్తుంది ఈ ఘటన చూస్తే. పైగా టెక్నాలజీ ఇంతగా పెరిగిన ఈ కాలంలో కూడా మంత్రాలు, చేతబడులు అంటూ మనుషులను భయపెట్టే సంస్కృతి ఇంకా పోవట్లేదు. తాజాగా జరిగిన ఓ ఘటన కూడా ఇలాంటిదే. ఇది హైదరాబాద్ నగరం పాతబస్తీ మొఘల్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

హైదరాబాద్‌ పాతబస్తీలోని స్మశానాల్లో మంత్రగాళ్లు చేతబడులు చేస్తున్న ఆనవాళ్లు ఈ మధ్య తరచుగా కనిపిస్తున్నాయి. ఇది తెలిశాక స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. చివరికి అంత్యక్రియల కోసం ఆ స్మశానం వైపు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. తమవారికి చివరి కార్యక్రమాలు చేసుకోవడానికి సమాధుల దగ్గరికి కూడా పోవడానికి సాహసం చేయడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవవచ్చు.

ఇటీవల ఓ బొమ్మకి యువతీ, యువకుల ఫోటోలను అతికించి.. ఆ విగ్రహం చుట్టూ దారం కట్టి సమాధులపై పెట్టి వెళ్లిపోతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. అసలు అలా ఎవరు చేస్తున్నారో.. ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో తెలియక స్థానికులు భయంభయంగా బతుకుతున్నారు. ఆ స్మశానం సమీపంలో నుంచి కూడా వెళ్లడానికి సందేహిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు.

ఇది కాస్తా స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ దృష్టికి చేరడంతో సంఘటన స్థలానికి రాత్రిపూట వెళ్లి ఆ స్మశానంలో పర్యటించారు. ప్రజలను భయపెట్టే ఇలాంటి చర్యలను సమర్థించరాదని, ఇది ఎవరు చేసినా విడిచిపెట్టేది లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకుని ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూడాలని మొఘల్ పుర పోలీసులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా.. గతంలో కూడా పాతబస్తీ స్మశానాల్లో ఓ మహిళా ఎమ్మార్వో ఫోటో ఇదే విధంగా దొరికిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా పాతబస్తీలో మంత్రగాళ్లుగా అనుమానించే పలువురు బాబాలు విదేశాలకు సైతం వెళ్లి మంత్రాలు, తంత్రాలు చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఈ ప్రాంతంలోని కొందరు మంత్రగాళ్లు అయితే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కూడా కడతారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలా వందల కొద్దీ మంత్రగాళ్లు పాతబస్తీ గల్లీల్లో ఉంటూ యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం, పోలీసు అధికారులు ఇలాంటి ఘటనలపై దృష్టి సారించి మంత్రిగాళ్ల పని పట్టేలా చర్యలు తీసుకోవాలని పాతబస్తీ ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..