Petticoat Cancer: మహిళలు లంగా నాడాను బిగించి కట్టడం వల్ల పెట్టీకోట్ క్యాన్సర్..!
క్యాన్సర్.. ఇప్పటి వరకూ సరైన మందేలేని వ్యాధి. ఇది రకరకాల రూపాలలో ప్రాణాలను హరించివేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇంకా పలు రకాల క్యాన్సర్స్ బారినపడుతున్నారు ప్రజలు. తాజాగా మరో రకమైన క్యాన్సర్ గురించి వెలుగులోకి వచ్చింది. కాన్సర్‌కి కాదేదీ అనర్హం అన్నట్టుగా మహిళలు ధరించే లంగా నాడా కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఓ అద్యయనం వెల్లడించింది.
లంగాను గట్టిగా బిగించి కట్టుకోవడం వల్ల క్యాన్సర్ బారినపడిన ఇద్దరు మహిళలకు తాము చికిత్స చేసినట్టు భారతీయ వైద్యుల బృందం ఒకటి తెలిపింది. లంగాను గట్టిగా బిగించి కట్టడం వల్ల అది చర్మానికి ఒరుసుకుపోయి పుండ్లు ఏర్పడి చర్మ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. గతంలో దీనిని ‘చీర క్యాన్సర్’గా వ్యవహరించే వారని, కానీ, లంగా నాడా బిగించి కట్టడం వల్ల ఈ క్యాన్సర్ వస్తోంది కాబట్టి ఇప్పుడు దీనిని ‘పెట్టీకోట్ క్యాన్సర్’గా పిలవాలని పేర్కొన్నారు. తమ వద్దకు వచ్చిన రెండు కేసుల్లో ఒక మహిళ వయసు 70 సంవత్సరాలని, మరో మహిళ వయసు 60 ఏళ్లని వైద్యులు తెలిపారు. 70 ఏళ్ల మహిళకు 18 నెలల నుంచి నడుము కుడిపక్క అయిన గాయం మానడం లేదని, 60 ఏళ్ల మహిళ కూడా రెండేళ్లుగా ఇదే రకమైన గాయంతో బాధపడుతున్నట్టు చెప్పారు. ఈ గాయాలను మార్జొలిన్ వ్రణంగా వర్గీకరించారు. దీని బారిన పడకుండా ఉండేందుకు వదులుగా ఉండే లో దుస్తులు ధరించడం మంచిదని, తద్వరా ఈ క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని వైద్య బృందం తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.