USA Missile: ట్రంప్ గెలుపునకు ముందు క్షిపణి పరీక్ష.! ఆలస్యంగా వెలుగులోకి వీడియో..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గెలుపునకు ముందు అగ్రరాజ్యం కీలక పరీక్ష చేపట్టింది. వ్యూహాత్మక రక్షణ సంసిద్ధతలో భాగంగా ‘మినిట్‌మ్యాన్-3’ అనే ఈ సూపర్‌సోనిక్ మిసైల్‌ని పరీక్షించింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఐసీబీఎం అయిన ఈ మిసైల్‌ను కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి అమెరికా రక్షణ దళాలు ప్రయోగించాయి.
మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గెలుపునకు ముందు అగ్రరాజ్యం కీలక పరీక్ష చేపట్టింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఐసీబీఎం అయిన ఈ మిసైల్‌ను కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి అమెరికా రక్షణ దళాలు ప్రయోగించాయి. ఎలాంటి వార్ హెడ్ లేకుండా ప్రయోగించిన ఈ క్షిపణి పసిఫిక్ మహాసముద్రం మీదుగా నార్త్ పసిఫిక్‌లోని క్వాజలీన్ అటోల్ దిశగా 4,000 మైళ్లకు పైగా దూరం ప్రయాణించింది. గంటకు 15,000 మైళ్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లింది. భూమి మీద ఏ మూలన ఉన్న లక్ష్యాన్నైనా 30 నిమిషాల్లో చేధించగల సత్తా ఈ క్షిపణికి ఉంది. ఈ పరీక్షను కొన్ని సంవత్సరాల క్రితమే ప్లాన్ చేశామని అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. యూఎస్ అణు బలగాల సంసిద్ధతకు సంబంధించిన రెగ్యులర్ డ్రిల్స్‌లో భాగంగా ఈ పరీక్ష చేపట్టినట్టు వివరించారు. అంతర్జాతీయంగా భద్రతాపరమైన ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యూహాత్మక ఆయుధాల సంసిద్ధతను కొనసాగిస్తునట్లు వివరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.