Trump Daughter: ట్రంప్ మా నాన్న.. పాక్ యువతి వాదన.! వీడియో మళ్లీ వైరల్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ఓ ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది. ఒక పాకిస్తానీ యువతి తాను ట్రంప్ కుమార్తెనంటూ మీడియాకు తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. తన కూతురిని బాగా చూసుకోలేకపోతున్నానని ట్రంప్ తన తల్లితో ఎప్పుడూ అంటుంటారని ఆమె పేర్కొంది.
వీడియోలో యువతి తాను పంజాబీ ముస్లింనని చెబుతూ, తానే డొనాల్డ్ ట్రంప్ నిజమైన కుమార్తెనని పేర్కొంది. అయితే ఈ వీడియో ప్రామాణికతతో పాటు ఆ యువతి మానసిక స్థితి గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం వెలుగులోకి రాలేదు. మీడియాతో మాట్లాడిన ఆ యువతి విదేశీయులు ఇక్కడికి వచ్చినప్పుడు తనను చూసి ఆశ్చర్యపోతుంటారని తెలిపింది.
తన కూతురిని బాగా చూసుకోలేకపోతున్నానని ట్రంప్ తన తల్లితో ఎప్పుడూ అంటుంటారని ఆమె పేర్కొంది. ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ తనను నిర్లక్ష్యం చేయడం వల్లే తన తల్లి తనను పాకిస్తాన్ పంపిందని చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఏడాది కాలం తర్వాత 2018లో పాకిస్తాన్ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్ సియాసత్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ కన్న కూతురినంటూ యువతి చేస్తున్న ప్రచారం అని కాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ‘ఎక్స్’లో రీపోస్ట్ అయి వైరల్‌గా మారింది. వీడియోకు ఇప్పటివరకు 75 వేలకు పైగా వ్యూస్ దక్కాయి. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను ఓడించి, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.