Watch: 50 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్‌.. ఏం జరిగిందంటే.?

Watch: 50 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్‌.. ఏం జరిగిందంటే.?

Anil kumar poka

|

Updated on: Nov 10, 2024 | 2:22 PM

ఆ బస్సులో దాదాపు 50 మంది ఎక్కారు. తమ గమ్య స్థానానికి చేరుకునేందుకు అంతా సిద్ధమై కూర్చున్నారు. బస్సు ఓ మాదిరి స్పీడ్‌తో వెళ్తోంది. ఇంతలోనే ఊహించని పరిణామం ఎదురైంది. స్టీరింగ్ తిప్పుతున్న డ్రైవర్‌ ఒక్కసారిగా తన సీటులో కుప్పకూలిపోయాడు. బస్సు అదుపుతప్పుతోంది. ప్రయాణికుల్లో అలజడి.. కేకలు వేస్తున్నారు. వెంటనే అలర్టయ్యాడు కండక్టర్‌.. స్టీరింగ్‌ తన చేతిలోకి తీసుకున్నాడు.

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ డిపో 40లో కిరణ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బస్సు నేలమంగళ నుంచి యశ్వంత్‌పూర్‌కు వస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై డ్రైవింగ్‌ సీట్లోనే కిరణ్ స్పృహతప్పి పడిపోయాడు. బస్సులోని సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. డ్రైవర్ కుప్పకూలడంతో బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్సును రాసుకుంటూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన బస్సులోని కండక్టర్ డ్రైవర్‌ను లేపే ప్రయత్నం చేస్తూనే డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి బస్సును సురక్షితంగా నిలిపివేశాడు. ఆ తర్వాత డ్రైవర్ కిరణ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బస్సును నిలిపివేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్‌ను కర్నాటక ఆర్టీసీ అధికారులు ప్రశంసించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.