Watch: గాల్లో విమానం ఉండగా డోర్ ఓపెన్.? ఎయిర్‌లైన్స్ లో షాకింగ్ ఘటన..
విమానం గమ్యస్థానం దిశగా దూసుకెళ్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించి తోటి ప్రయాణీకులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ షాకింగ్ ఘటన బ్రెజిల్ నుంచి పనామా వెళ్తున్న కోపా ఎయిర్‌లైన్స్ విమానంలో తాజాగా జరిగిందంటూ న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది.
విమానం షెడ్యూల్ ప్రకారం ప్రయాణిస్తుండగా.. ల్యాండింగ్‌కు 30 నిమిషాల ముందు నిందిత వ్యక్తి విమానం వెనుక భాగానికి వెళ్లాడు. తన ఫుడ్ ట్రేలో వచ్చిన ప్లాస్టిక్ కత్తిని చూపించి ఫ్లైట్ సిబ్బందిలో ఒకర్ని బందీగా మార్చుకునే ప్రయత్నం చేశాడు. ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో కొందరు ప్యాసింజర్లు తక్షణమే స్పందించి అతడిని అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యక్తిని చితకబాదారు. దాదాపు స్పృహ కోల్పోయేలా కొట్టారు.
ఆ సమయంలో న్యూయార్క్ పోస్ట్ ఫోటో జర్నలిస్ట్ క్రిస్టియానో కార్వాలో విమానంలోనే ఉన్నారు. ల్యాండింగ్‌కు 30 నిమిషాల ముందు సదరు వ్యక్తి తలుపు తెరవడానికి ప్రయత్నించాడని క్రిస్టియానో చెప్పారు. ఫ్లైట్ సహాయక సిబ్బందిలో ఒకరు కేకలు వేయడం ప్రారంభించారనీ అతన్ని బందీగా మార్చుకోవడానికి నిందితుడు ప్రయత్నించాడనీ అన్నారు. కానీ అతడు చాలా బలంగా ఉండడంతో అది సాధ్యపడలేదట. హెచ్చరిస్తుండగానే నిందితుడు విమానంలో వెనుక భాగానికి వెళ్లాడనీ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడం మొదలుపెట్టాడని వివరించారు. ఇక తోటి ప్రయాణీకుల్లో కొందరు అతడిని దాదాపు స్పృహ కోల్పోయేవరకు కొట్టారని జర్నలిస్ట్ క్రిస్టియానో తెలిపారు.
విమానం పనామాలో ల్యాండ్ అయిన తర్వాత జాతీయ భద్రతా సిబ్బంది ఫ్లైట్‌లోకి ప్రవేశించి నిందితుడిని తీసుకెళ్లారని, అతడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారని కోపా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. సదరు వ్యక్తి ని విమానం డోర్ తెరవకుండా అడ్డుకున్న సిబ్బంది, ప్రయాణీకులను ఎయిర్‌లైన్స్ ప్రశంసించింది. అవసరమైన ప్రోటోకాల్‌ను పాటించి నిందితుడిని అరెస్ట్ చేయించినట్లు కోపా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.