AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడవాళ్ల చేతికి గాజులు అందం మాత్రమే కాదు..! జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా?

అంతేకాదు శుక్ర స్థానం బలోపేతం చేయడానికి....విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి గాజులు సహాయపడతాయి అని నమ్మకం. గాజులు ధరించేవారికి చుట్టూ సానుకూల శక్తి ఏర్పడుతుంది. వీటి శబ్దం, ఆకృతి, రంగులు పరిసరాల్లోని నెగెటివ్ ఎనర్జీని తగ్గించి, శుభ ఫలితాలను ప్రేరేపిస్తాయి. అంతేకాదు గాజులు ధరించడం వల్ల ఇంట్లో శాంతి, సామరస్య వాతావరణం నెలకొంటుంది.

ఆడవాళ్ల చేతికి గాజులు అందం మాత్రమే కాదు..! జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా?
Women Wearing Bangles
Jyothi Gadda
|

Updated on: Aug 10, 2025 | 4:26 PM

Share

స్త్రీలు గాజులు ధరించడం వల్ల అన్ని ఉపయోగాలా?.. జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందో తెలిస్తే షాక్‌ అవుతారు..గాజులు అలంకార వస్తువు మాత్రమే కాదు ఇవి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో ఒకరైన శుక్రుడితో ముడిపడి ఉన్నాయి. శుక్రుడు అందానికి కారకుడు. ఏ స్త్రీ జాతకంలో నైనా శుక్ర స్థానం బలహీనంగా ఉంటే గాజులు ధరించడం వలన ఆ దోషం నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు..​​గాజుల ధరించడం వల్ల ఆధ్యాత్మిక శారీరక ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

గాజులను రోజూ ధరించడం వల్ల ఎన్నో ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ప్రయోజనాలు ఉంటాయని జ్యోతిశాస్త్ర పండితులు చెబుతున్నారు. అంతేకాదు శుక్ర స్థానం బలోపేతం చేయడానికి….విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి గాజులు సహాయపడతాయి అని నమ్మకం. గాజులు ధరించేవారికి చుట్టూ సానుకూల శక్తి ఏర్పడుతుంది. వీటి శబ్దం, ఆకృతి, రంగులు పరిసరాల్లోని నెగెటివ్ ఎనర్జీని తగ్గించి, శుభ ఫలితాలను ప్రేరేపిస్తాయి. అంతేకాదు గాజులు ధరించడం వల్ల ఇంట్లో శాంతి, సామరస్య వాతావరణం నెలకొంటుంది.

గాజులు రక్త ప్రసరణ మెరుగుపడేందుకు సహాయపడుతుంది. అలాగే రక్తపోటు నియంత్రణలోనూ ఉంచుతుంది. ఇది శరీరంలో శక్తి ప్రవాహాన్ని స్థిరంగా ఉంచడానికి సహకరిస్తుంది. 7వ నెల తరువాత గర్భిణీ స్త్రీలు గాజులు ధరించడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గాజుల శబ్దం శిశువు మెదడు అభివృద్ధికి దోహదపడుతుంది. శబ్దాలు గుర్తించే శక్తిని శిశువు అభివృద్ధి చేసుకుంటుంది. ఇది కేవలం శిశువుకే కాదు, తల్లికి కూడా మానసిక ఉల్లాసాన్ని, ఒత్తిడి తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

గాజులు ధరించకపోతే అది వివాహిత మహిళకు అశుభంగా పరిగణించబడుతుంది. గాజులు భర్త ఆయురారోగ్యానికి, కుటుంబ సమృద్ధికి సూచికలుగా భావించబడతాయి. మహిళ గాజులు ధరించడం వల్ల దంపతుల మధ్య ప్రేమ, అనుబంధం మరింత బలపడుతుంది అని పండితులు చెప్తున్నారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..