AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూ మామ్స్ మీకోసమే ఇది.. వర్క్ టెన్షన్ తగ్గించుకోవాలంటే జస్ట్ ఇలా చేయండి చాలు..! అంతా సెట్ అయిపోద్ది..!

ప్రెగ్నెన్సీ తర్వాత ఉద్యోగ జీవితంలోకి తిరిగి అడుగుపెట్టడం అనేది న్యూ మామ్స్ కి ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బేబీని ఇంట్లో వదిలి బయటకు వెళ్లడం అనేది ఎమోషన్స్‌తో నిండిన అనుభవం. ఈ సమయంలో భయం, గిల్ట్, స్ట్రెస్ వంటి ఫీలింగ్స్ చాలా కామన్. అయితే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఈ జర్నీని చాలా ఈజీగా, సంతోషంగా మేనేజ్ చేయవచ్చు.

న్యూ మామ్స్ మీకోసమే ఇది.. వర్క్ టెన్షన్ తగ్గించుకోవాలంటే జస్ట్ ఇలా చేయండి చాలు..! అంతా సెట్ అయిపోద్ది..!
Post Pregnancy Stress Relief
Prashanthi V
|

Updated on: Aug 10, 2025 | 4:54 PM

Share

ప్రెగ్నెన్సీ తర్వాత న్యూ మామ్స్ గా మారడం నిజంగా ఒక ఎమోషనల్ జర్నీ. కొందరు ఈ ఫేజ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.. కానీ చాలా మంది తల్లులు మళ్లీ వర్క్‌ కి వెళ్లాలంటే చాలా స్ట్రెస్ ఫీలవుతారు. మొదటి సారిగా బిడ్డను ఇంట్లో వదిలి బయటకు వెళ్లడం అనేది వారిలో చాలా భయాన్ని పెంచుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు హెల్ప్ చేసే కొన్ని సూపర్బ్ టిప్స్ ను నేను తీసుకొచ్చాను. ఇవి మీకు హెల్ప్ చేస్తాయి.

సపోర్ట్ సిస్టమ్

చాలా మంది తల్లులు జాబ్‌కి తిరిగి వెళ్లేటప్పుడు తమ బేబీని వదిలిపెట్టడం వల్ల చాలా బాధపడతారు. పాప ఏం చేస్తుందో..? తనకేమైనా కావాలా..? ఎవరైనా చూసుకుంటున్నారా..? ఇలాంటి థాట్స్ వారి మైండ్‌ లో తిరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఫీలింగ్స్ తగ్గించుకోవాలంటే నమ్మదగిన వ్యక్తి లేదా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం. వారు బేబీని బాగా చూసుకుంటారనే నమ్మకంతో మీరు మీ వర్క్‌పై కాన్సంట్రేట్ చేయగలరు. అవసరమైతే ఇంట్లో సీసీటీవీ ఏర్పాటు చేసుకుంటే.. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బేబీని చూడొచ్చు.

వర్క్ ఫ్రమ్ హోమ్

మీ ఆఫీస్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉందేమో తెలుసుకోండి. ఒకవేళ అది అందుబాటులో ఉంటే తల్లిగా మీ బాధ్యతలను ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అది కుదరకపోతే మీరు ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ టైమింగ్స్ కోసం మేనేజర్‌ ని అడగవచ్చు.

ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారి సలహాలు

మీకు ఇదే మొదటి ప్రెగ్నెన్సీ అయితే బిడ్డకు పాలు పట్టడం, బట్టలు మార్చడం, నిద్రపుచ్చడం లాంటి విషయాల్లో సలహాలు ఇచ్చేవాళ్లు అవసరం. మీ తల్లి, అత్తగారు లేదా ఆఫీస్‌లో ఉన్న ఫ్రెండ్స్ నుంచి బెస్ట్ సలహాలు వస్తాయి. వాళ్లు తమ బేబీని ఎలా చూసుకున్నారో తెలుసుకుంటే మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది.

అనవసరమైన భయం

పిల్లల గురించి తల్లులు ఆందోళన చెందడం కామన్. కానీ ప్రతి బేబీ డిఫరెంట్, ప్రతి సిట్యుయేషన్ డిఫరెంట్. మిమ్మల్ని మీరు ఇతర తల్లులతో పోల్చుకోవడం బెస్ట్ కాదు. మీరు మీ బేబీని ఎంతగా లవ్ చేస్తున్నారో, కేర్ తీసుకుంటున్నారో తెలిసి ఉంటే.. మీలో ధైర్యం పెరుగుతుంది.

మీకోసం కొంత టైమ్

తల్లిగా బాధ్యత, ఉద్యోగినిగా పని.. అన్నీ ఒకేసారి చేయాలంటే చాలా అలసిపోతారు. అందుకే అప్పుడప్పుడు మీకోసం స్పెషల్ టైమ్ కేటాయించుకోండి. ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్‌కి వెళ్లండి, సలూన్‌కి వెళ్లి మీ ఫేవరేట్ స్టైల్ చేయించుకోండి. ఈ టైంలో బేబీని నమ్మదగిన వారితో వదిలిపెట్టండి. మీరు హ్యాపీగా ఉంటేనే బేబీకి కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది.

ఫ్యూచర్ డెసిషన్

ఇంట్లోనే ఉండి బేబీని చూసుకోవాలా లేదా జాబ్‌కి వెళ్లాలా అనే డెసిషన్ పూర్తిగా మీదే. కానీ మీ ఫైనాన్షియల్ కండిషన్‌ని బట్టి నిర్ణయం తీసుకోండి. అవసరమైతే జాబ్‌లో కంటిన్యూ అవ్వండి.. కానీ పైన చెప్పిన టిప్స్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మదర్‌హుడ్‌ని ఒక బ్యూటిఫుల్ జర్నీగా ఫీలవ్వండి.