Watch: ఉత్తరాఖండ్ వరదల్లో 28 మంది కేరళ టూరిస్టులు గల్లంతు.. ఆ భయానక దృశ్యాలు చూస్తే…
ఇక మంగళవారం మధ్యాహ్నం గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలీలో భారీగా వదలు సంభవించాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. బుధవారం మరో మృతదేహాన్ని వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. ఇక పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ఇప్పటివరకు 150 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.

ఉత్తరాఖండ్‌ల్ సంభవించిన క్లౌడ్‌బర్ట్స్‌తో భారీ వరదలు జలప్రళయాన్ని సృష్టించాయి. ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 28 మంది కేరళ టూరిస్టుల ఆచూకీ గల్లంతైంది. వీరిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడినవారు కాగా, మిగిలిన 8 మంది కేరళకు చెందిన వారిగా తెలిసింది. ఈ బృందంలోని బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి ఉదయం బయల్దేరుతున్నట్టు చెప్పారని, అనంతరం వారి ఫోన్లు పని చేయడం లేదని, వాటిలో ఛార్జింగ్ లేదో. లేక సిగ్నల్ లేదో తెలియక భయంతో పోలీసులకు సమాచారం అందించామని చెప్పారు. వారు వెళ్తున్న మార్గంలోనే కొండచరియలు విరిగిపడ్డాయని తెలిసింది. గల్లంతైన వారి కోసం ఆర్మీ సిబ్బంది గాలిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి...
A terrifying display of nature’s wrath chilling footage captures the exact moment a flash flood strikes Uttarkashi. People attempt to flee but are swept away within seconds.#Uttarkashi #uttarkashicloudburst pic.twitter.com/r8yFJDssyv
— Deadly Kalesh (@Deadlykalesh) August 5, 2025
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రక్షణ, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆర్మీ, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు, బురద కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది.
వీడియో ఇక్కడ చూడండి..
ఇక మంగళవారం మధ్యాహ్నం గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలీలో భారీగా వదలు సంభవించాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. బుధవారం మరో మృతదేహాన్ని వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. ఇక పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ఇప్పటివరకు 150 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




