సిటీ యువతకి షాకింగ్‌ న్యూస్‌..! ఆ శక్తి పూర్తిగా తగ్గిపోతుందట.. కారణం ఇదే..?

Air Pollution: వాయుకాలుష్యం కారణంగా ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. కానీ ఇప్పుడు అది స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపుతోంది. యూనివర్శిటీ ఆఫ్

సిటీ యువతకి షాకింగ్‌ న్యూస్‌..! ఆ శక్తి  పూర్తిగా తగ్గిపోతుందట.. కారణం ఇదే..?
City Youth
Follow us

|

Updated on: Oct 31, 2021 | 5:27 PM

Air Pollution: వాయుకాలుష్యం కారణంగా ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. కానీ ఇప్పుడు అది స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపుతోంది. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (UMSOM) పరిశోధకులు చేసిన అధ్యయన ఫలితాలను ‘ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పెర్స్పెక్టివ్స్’ జర్నల్‌లో ప్రచురించారు. ఒత్తిడితో కూడిన పరిస్థితులలో మెదడుకి పునరుత్పత్తి అవయవాలతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఇది సంతానోత్పత్తి, స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేస్తుంది.

కలుషితమైన గాలి సంతానోత్పత్తిని ఎలా తగ్గిస్తుందో కొత్త అధ్యయనం వివరిస్తుంది. వీరు ఎలుకలపై చేసిన పరిశోధనలో కొత్త విషయాలను కనుగొన్నారు. వాయు కాలుష్యం వల్ల మెదడులో మంట, వాపు ఏర్పడుతున్నాయని పరోక్షంగా ఈ ఎఫెక్ట్ పునరుత్పత్తిపై పడుతుందని తెలిపారు. ప్రపంచంలో 92 శాతం మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన కనీస భద్రతా ప్రమాణాలు లేని ప్రాంతాల్లో నివసిస్తున్నారన్నారు. కార్ల కాలుష్యం, ఫ్యాక్టరీ ఉద్గారాలు, అడవి మంటలు, కట్టెల పొయ్యిల ద్వారా ఏర్పడుతున్న ఉద్గారాలు ఈ అనారోగ్య సమస్యలకు కారణమని వీరి పరిశోధనలో తేలింది.

ఇదిలా ఉంటే.. రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంతో అనేక జీవరాశులు నశించిపోతున్నాయి. ఇప్పడు ఇది మావనజాతి మనుగడకే పెను ముప్పుగా మారుతోంది. మహమ్మారిలా మారుతున్న ఈ వాయు కాలుష్యం గర్భ విచ్ఛిత్తికి కారణమవుతోంది. కడుపులో ఊపిరి పోసుకుంటున్న పసిగుడ్డుల ఉసురు తీస్తోంది. అనేక మంది తల్లులకు కడుపుకోత మిగుల్చుతోంది. భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో 29శాతం అబార్షన్లకు కారణం వాయు కాలుష్యమేనని చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది.

Health: ఇమ్యూనిటీ తగ్గిందంటే కరోనా అటాక్..! అందుకే ఎల్లప్పుడు ఈ 4 సుగంధ ద్రవ్యాలు..

Health: మీ వయసు 30 దాటిందా..! అయితే కచ్చితంగా ఈ 5 ఆహారాలు అవసరం..

IND vs NZ, Live Score, T20 World Cup 2021: న్యూజిలాండ్‌పై 18 ఏళ్ల చరిత్రను తిరగరాసేనా?