IND vs NZ, Highlights, T20 World Cup 2021: న్యూజిలాండ్ ఘన విజయం.. పేలవ ఆటతీరుతో సెమీస్‌ను దూరం చేసుకున్న కోహ్లీసేన
IND vs NZ Highlights in Telugu: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ టీం ముందు 111 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
IND vs NZ, Highlights, T20 World Cup 2021: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ టీం ముందు 111 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
టీ20 ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు నేడు దుబాయ్ మైదానంలో తలపడనున్నాయి. టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే ఈరోజు రెండు జట్లూ మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఇరు జట్లు ఒకే ఒక్క మ్యాచ్ ఆడాయి. భారత్, న్యూజిలాండ్‌లు తమ తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా సెమీఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలు దాదాపు మూసకపోనున్నాయి.
భారత్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), జేమ్స్ నీషమ్, డెవాన్ కాన్వే(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్
LIVE Cricket Score & Updates
-
న్యూజిలాండ్ ఘన విజయం
భారత్ విధించిన అత్యల్ప టార్గెట్‌ను కేవలం 14.3 ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధిచింది. దీంతో కివీస్ టీం సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. టీమిండియా ఆశలు మాత్రం విరిగిపోయాయి.
-
మిచెల్ ఔట్..
మిచెల్ (49 పరుగులు, 35 బంతులు, 4 ఫోర్లు, 3 సిక్సులు) రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
-
10 ఓవర్లకు..
10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం ఒక వికెట్ కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ 46, విలియమ్సన్ 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
6 ఓవర్లకు..
6 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం ఒక వికెట్ కోల్పోయి 44 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ 19, విలియమ్సన్ 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
గుప్తిల్ ఔట్..
మార్టిన్ గుప్తిల్ (20 పరుగులు, 17 బంతులు, 3 ఫోర్లు) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో శార్దుల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
-
3 ఓవర్లకు..
3 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 18 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ 1, మార్టిన్ గుప్తిల్ 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
అత్యల్ప స్కోర్లను విజయవంతంగా డిఫెండ్ చేసిన భారత్ (T20I)
139 vs జిమ్ హరారే 2016 144 vs ఇంగ్ నాగ్‌పూర్ 2017 146 vs బ్యాన్ బెంగళూరు 2016
-
టీ20ల్లో భారత్ అత్యల్ప స్కోర్లు
79 vs NZ నాగ్‌పూర్ 2016 110/7 vs NZ దుబాయ్ 2021 118/8 vs SA నాటింగ్‌హామ్ 2009 130/4 vs SL మీర్పూర్ 2014
-
న్యూజిలాండ్ టార్గెట్ 111
టీ 20 ప్రపంచ కప్ 2021లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టీంల మధ్య జరుగుతోన్న మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ టీం ముందు 111 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
-
ఏడో వికెట్ కోల్పోయిన భారత్
టీమిండియా శార్దుల్ (0) రూపంలో ఏడో వికెట్‌ను కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో గుప్తిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
టీమిండియా హార్దిక్ పాండ్యా (23 పరుగులు, 24 బంతులు, 1ఫోర్) రూపంలో ఆరో వికెట్‌ను కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో గుప్తిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
18వ ఓవర్‌లో 1,0,1,1,1,4
18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. క్రీజులో జడేజా 10, పాండ్యా 23 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
పంత్ ఔట్..
టీమిండియా వరుస వికెట్లు కోల్పోతోంది. రన్‌రేట్ తక్కువలో ఉండటం.. బ్యాటర్లు భారీ షాట్స్‌కు యత్నించి పెవిలియన్ చేరుతున్నారు. ఈ క్రమంలోనే పంత్ ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి మిల్నే బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీనితో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది.
-
15 ఓవర్లకు..
15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. క్రీజులో జడేజా 0, పాండ్యా 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా రన్ రేట్ 4.88గా ఉంది. వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లో కూరకపోయింది.
-
14వ ఓవర్‌కు 5 పరుగులు..
14వ ఓవర్‌లో భారత్ 5 పరుగులు రాబట్టింది. హార్దిక్(10), పంత్(11) మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా 14 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 67 పరుగులు చేసింది.
-
13 ఓవర్ 0,1,1,0,1,1
కివీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. సింగిల్స్ తీస్తూ మరో వికెట్ పడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 13 ఓవర్‌లో 4 పరుగులు సాధించారు. దీనితో భారత్ 13 ఓవర్లకు 62/4 చేసింది.
-
12 ఓవర్ 6 పరుగులు..
శాంట్నార్ వేసిన 12 ఓవర్‌లో టీమిండియా 6 పరుగులు చేసింది. పంత్ రెండు సింగిల్స్, హార్దిక్ పాండ్యా రెండు పరుగులు, రెండు సింగిల్స్ తీశాడు. దీనితో 12 ఓవర్ ముగిసేసరికి భారత్ 58-4 పరుగులు చేసింది.
-
11 ఓవర్ 4 పరుగులు, ఒక వికెట్..
సోది వేసిన 11 ఓవర్‌లో టీమిండియా 4 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. మొదటి బంతికి భారీ షాట్ ఆడబోయి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత పంత్ రెండు పరుగులు, హార్దిక్ రెండు సింగిల్స్ తీశాడు. దీనితో టీమిండియా 11 ఓవర్లకు 52-4 పరుగులు చేసింది.
-
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
టీమిండియా కోహ్లీ (9 పరుగులు) రూపంలో నాలుగో వికెట్‌ను కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే క్రమంలో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
-
10 ఓవర్లకు..
10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ 9, పంత్ 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా రన్ రేట్ 4.8గా ఉంది.
-
మూడో వికెట్ కోల్పోయిన భారత్
టీమిండియా రోహిత్ శర్మ (14 పరుగులు, 14 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) రూపంలో మూడో వికెట్‌ను కోల్పోయింది.
-
రెండో వికెట్ కోల్పోయిన భారత్
టీమిండియా కేఎల్ రాహుల్ (18 పరుగులు, 16 బంతులు, 3 ఫోర్లు) రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. సౌథీ వేసిన బాల్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 35 పరుగులకు భారత్ రెండు వికెట్లు కోల్పోయింది.
-
5 ఓవర్లకు..
5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ 12, కేఎల్ రాహుల్ 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
తొలి వికెట్ కోల్పోయిన భారత్
టీమిండియా ఇషాన్ కిషన్ (4)రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన బాల్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
IND vs NZ Live: భారత జట్టులో రెండు మార్పులు.. న్యూజిలాండ్ టీంలో ఒక మార్పు
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కివీ జట్టు వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నేని చేర్చుకుంది. కేవలం ఒక మార్పు మాత్రమే చేసింది.
అదే సమయంలో, వరుసగా రెండో మ్యాచ్‌లో భారత కెప్టెన్ కోహ్లి టాస్ ఓడిపోయాడు. ఈసారి కూడా అతను మొదట బౌలింగ్ చేయాలనుకున్నాడు. భారత జట్టులో రెండు మార్పులు చేశారు. సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌లను తొలగించగా, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్‌లు జట్టులోకి వచ్చారు.
? Toss Update ?
New Zealand have elected to bowl against #TeamIndia. #T20WorldCup #INDvNZ
Follow the match ▶️ https://t.co/ZXELFVZhDp pic.twitter.com/dwazUEalMR
— BCCI (@BCCI) October 31, 2021
-
IND vs NZ Live: ప్లేయింగ్ XI
భారత్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), జేమ్స్ నీషమ్, డెవాన్ కాన్వే(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్
-
టాస్ గెలిచిన న్యూజిలాండ్
కీలక మ్యాచులో న్యూజిలాండ్ టీం టాస్ గెలిచింది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.
-
IND vs NZ Live: నేటి మ్యాచ్ పిచ్..
దుబయ్ స్టేడియంలో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఉపయోగించే పిచ్‌కు సంబంధించిన మొదటి ఫొటో బయటకు వచ్చింది. బీసీసీఐ పోస్ట్ చేసిన ఈ ఫోటోను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో గడ్డి కనిపిస్తుంది. అంటే, తొలి ఇన్నింగ్స్‌లో పేసర్లకు సహకారం అందుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది పరిస్థితి అలాగే ఉంటుందా? అనేది కాసేపట్లో తేలిపోనుంది.
Hello from Dubai for #TeamIndia‘s #T20WorldCup clash against New Zealand ?
? A look at the pitch for the #INDvNZ contest ? pic.twitter.com/9jHSR7xsqA
— BCCI (@BCCI) October 31, 2021
-
IND vs NZ Live: కోహ్లి నుంచి భారీ ఇన్నింగ్స్
కోట్లాది మంది క్రికెట్ అభిమానుల్లాగే, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కూడా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి పెద్ద ఇన్నింగ్స్ చూడాలని భావిస్తున్నాడు. కెప్టెన్‌గా కోహ్లీ చివరి టీ20 టోర్నీని ఎలాగైనా గెలవాలని కోరుకుంటున్నట్లు అజహర్ తెలిపాడు.
-
IND vs NZ Live: దుబయ్ స్టేడియానికి బయలుదేరిన ఆటగాళ్లు
దుబయ్ స్టేడియానికి ఇరుజట్ల ఆటగాళ్లు బయలుదేరారు. కీలక మ్యాచులో న్యూజిలాండ్ టీంతో పోటీపడేందుకు భారత ఆటగాళ్లు స్టేడియానికి బయలుదేరారు.
We. Are. Ready! #TeamIndia #T20WorldCup #INDvNZ pic.twitter.com/23T2wZwTWa
— BCCI (@BCCI) October 31, 2021
-
IND vs NZ Live: 2003 నుంచి ఓటమి..
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌ల చరిత్ర కివీ జట్టుకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా 2003 నుంచి ఇది రిపీట్ అవుతూనే ఉంది. 2003లో దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను సూపర్-6లో న్యూజిలాండ్ ఓడించింది.
అప్పటి నుంచి భారత్ ప్రతీ ఓడీఐ ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, ఇటీవల ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఓడిపోయింది. గత 18 ఏళ్లలో ఐసీసీ టోర్నీల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు 5 సార్లు తలపడగా, ప్రతిసారి టీమ్ ఇండియాకు నిరాశే ఎదురైంది.
-
IND vs NZ Live: చరిత్రలో ఈ రోజు..
భారత్-న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో ఈరోజు చాలా చారిత్రాత్మకమైన రోజు. ప్రపంచ క్రికెట్‌కు కూడా ఇది చారిత్రాత్మకమైన రోజు. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ పరంగా దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ప్రపంచకప్‌లో 34 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రపంచ రికార్డు నమోదైంది.
31 అక్టోబర్ 1987న, ప్రపంచ కప్ చరిత్రలో మొదటి హ్యాట్రిక్ భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో నమోదైంది. భారత మాజీ పేసర్ ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ చేతన్ శర్మ, న్యూజిలాండ్‌కు చెందిన లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లను వరుసగా బౌల్డ్ చేసి హ్యాట్రిక్ సాధించాడు.
#OnThisDay in 1987, Chetan Sharma etched his name in the record books after registering the first-ever World Cup-hat-trick versus New Zealand in Nagpur. ? ? pic.twitter.com/BRyOSNT764
— BCCI (@BCCI) October 31, 2021
-
పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉన్నాడు: కోహ్లీ
కెప్టెన్ విరాట్ కోహ్లీని విలేకరుల సమావేశంలో హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ గురించి కూడా ప్రశ్నించగా, అతను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని చెప్పాడు. అతని బౌలింగ్ గురించి ప్రశ్నించగా, విరాట్ ‘మ్యాచ్ పరిస్థితిని చూసిన తర్వాత మేము నిర్ణయిస్తాం, బౌలింగ్‌లో ఆరో ఎంపిక ఎవరు? ఈ పాత్రలో హార్దిక్ పాండ్యా లేదా నేను నేనే కావచ్చేమో అని అన్నాడు. మ్యాచ్‌లో హార్దిక్ ఆడటంపై విరాట్ స్పష్టంగా ఏమీ చెప్పలేదు.
-
భారత్ ప్లేయింగ్ XI మార్పు
ఈ మ్యాచ్‌లో భారత్ తమ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. ఈ రోజు న్యూజిలాండ్‌తో పాండ్యా ఆడగలడని విరాట్ కోహ్లీ విలేకరుల సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే భువనేశ్వర్ ఈ మ్యాచులో ఆడే అవకాశాలు కనిపించడంలేదు.
-
పాకిస్థాన్ చేతిలో భారత్-న్యూజిలాండ్ ఓటమి
భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడాయి. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడ్డాయి. భారత్‌పై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో, న్యూజిలాండ్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
-
భారత్, న్యూజిలాండ్ జట్లకు విజయం కీలకం
టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, భారత్ జట్లు నేడు ముఖాముఖిగా తలపడుతున్నాయి. టోర్నీలో రెండు జట్లూ ముందుకు వెళ్లేందుకు నేటి మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్‌లా మారింది.
Published On - Oct 31,2021 4:00 PM