Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: ఆఫ్గన్ ఆటగాళ్ల మెడలపై తాలిబన్ కత్తులు.. ‘యూ టర్న్’ తీసుకున్న రషీద్ ఖాన్.. భవిష్యత్తుపై బెంగ..!

తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుపై తమ పట్టును సాధించే క్రమంలో పాకిస్తాన్‌తో మ్యాచుకు ముందు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

T20 World Cup: ఆఫ్గన్ ఆటగాళ్ల మెడలపై తాలిబన్ కత్తులు.. 'యూ టర్న్' తీసుకున్న రషీద్ ఖాన్.. భవిష్యత్తుపై బెంగ..!
Afghanistan Cricket Team
Follow us
Venkata Chari

|

Updated on: Oct 31, 2021 | 5:00 PM

T20 World Cup 2021: సోమవారం స్కాట్లాండ్‌తో తమ మ్యాచ్‌కు ముందు ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లు షార్జా క్రికెట్ స్టేడియంలో జాతీయ గీతం ఆలపించినప్పుడు కన్నీళ్లతో కనిపించిన సంగతి తెలిసిందే. తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుపై తమ పట్టును సాధించే క్రమంలో పాకిస్తాన్‌తో మ్యాచుకు ముందు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని తాలిబన్లు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లపై తమ కఠిన వైఖరిని చూపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి, ఆటగాళ్ల భావోద్వేగాల గురించి అడిగినప్పుడు రషీద్ ఖాన్ గురువారం ఆశ్చర్యకరంగా మాట్లాడి, అందరికి షాక్ ఇచ్చాడు.

గతంలో యుద్ధంతో అతలాకుతలమైన దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో తన వేదనను వ్యక్తం చేసిన రషీద్, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన కీలకమైన సూపర్ 12, గ్రూప్ 2 మ్యాచ్‌కు ముందు సేఫ్ గేమ ఆడాడు. ఆదివారం షార్జాలో దేశ జెండాను ఎగురవేసినప్పుడు, జాతీయ గీతం ఆలపించినప్పుడు ఆటగాళ్ళు కన్నీళ్లతో కనిపించిన తర్వాత తాలిబన్ ప్రభుత్వ అధికారులు జట్టుతో మాట్లాడారని తెలిసింది.

ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తరువాత, దేశంలో జాతీయ గీతాన్ని నిషేధించగా, త్రివర్ణ జాతీయ జెండా స్థానంలో తెలుపు, నలుపు బ్యానర్‌ను ఉంచారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే టోర్నమెంట్‌లో జెండాను ఎగురవేసినప్పుడు లేదా జాతీయ గీతం ఆలపించినప్పుడు భావోద్వేగాలను ప్రదర్శించవద్దని ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లను హెచ్చరించారు. ఇంకా, బుధవారం సాయంత్రం ఆటగాళ్లు సమావేశమై తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వం అడిగిన దానికి కట్టుబడి క్రికెట్ విషయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. టోర్నమెంట్ ద్వారా ఆఫ్ఘన్ ఆటగాళ్లు దౌత్యపరమైన చర్యలను కొనసాగించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

“పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఇంటికి తిరిగి రావడం, ఆశాజనకంగా భవిష్యత్తులో కూడా మరింత మెరుగ్గా చూడాలని మేము ఆశిస్తున్నాం. మేము ఒక జట్టుగా, మంచి క్రికెట్ ఆడటానికి, మంచి ప్రదర్శన ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాం. ఆటగాళ్లుగా ఇది మా చేతుల్లో ఉంది. మొత్తం పోటీలో మెరుగైన ప్రదర్శన చేయడానికి మేం ప్రయత్నిస్తాం ” అని ఆఫ్ఘనిస్తాన్ మాజీ టీ20ఐ కెప్టెన్ రషీద్ అన్నారు. ఈ ప్రపంచకప్‌లో అతని భావోద్వేగాల గురించి అడిగినప్పుడు ఇలా సమాధానం తెలిపాడు.

“వారు ఆనందాన్ని పొందగలిగేలా ప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఒక జట్టుగా మేం మా ప్రణాళికలను కలిగి ఉన్నాం. సమయం గడిచేకొద్దీ విషయాలు మెరుగుపడతాయని నేను ఆశిస్తున్నాను” అన్నారాయన. మహిళల క్రికెట్‌కు అధికారికంగా అనుమతి లభించనందున ఆ జట్టు భవిష్యత్తు గురించి కూడా లెగ్ స్పిన్నర్‌ మాట్లాడాడు. “భవిష్యత్తులో ఏం జరుగుతుందో మేము ఆలోచించం. గతంలో ఏమి జరిగిందో మేము ఆలోచించం” అని పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ముందు విలేకరుల సమావేశంలో రషీద్ అన్నాడు. ఆగస్ట్‌లో తాలిబన్ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించినప్పుడు ఇదే ఆటగాడు కలహాలతో దెబ్బతిన్న దేశాన్ని రక్తపాతం నుంచి రక్షించమని ప్రపంచ నాయకులను వేడుకోవడం ఆశ్చర్యంగా ఉంది.

ఆగస్ట్ 10న, రషీద్ ఇలా ట్వీట్ చేశాడు.. “ప్రియమైన ప్రపంచ నాయకులారా! నా దేశం గందరగోళంలో ఉంది. పిల్లలు, మహిళలతో సహా వేలాది మంది అమాయకులు ప్రతిరోజూ బలిదానం చేస్తున్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. వేల కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. మమ్మల్ని ఇలాంటి గందరగోళంలో వదిలిపెట్టవద్దు. ఆఫ్ఘన్‌లను చంపడం, ఆఫ్ఘనిస్తాన్‌ను నాశనం చేయడం ఆపండి. మాకు శాంతి కావాలి” అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

కాబూల్‌లోని కొత్త ప్రభుత్వం మహిళలను క్రీడలు ఆడేందుకు అనుమతించకపోతే పురుషుల జట్టుతో హోబర్ట్‌లో జరిగే ఏకైక టెస్టును రద్దు చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే బెదిరించింది. తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళల క్రికెట్‌ను అధికారికంగా నిషేధించలేదని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఎసిబి) చైర్మన్ అజీజుల్లా ఫజ్లీ స్పష్టం చేయగా, టీ20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చించనుంది.

‘పూర్తి సభ్యుల’ హోదాను పొందడానికి దేశాలు తప్పనిసరిగా క్రియాశీల మహిళా బృందాన్ని కలిగి ఉండాలి. “నిజాయితీగా చెప్పాలంటే, ప్రస్తుతానికి మా మనసులో ఏమీ లేదు. ప్రపంచకప్ కోసం మేం ఇక్కడ ఉన్నాం” అని ప్రపంచ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్థాన్ భవిష్యత్తు గురించి రషీద్ ఖాన్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు టీం ఎంపికపై ఏసీబీ తనను సంప్రదించలేదని ఆరోపిస్తూ రషీద్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. “దేశానికి కెప్టెన్‌గా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా జట్టు ఎంపికలో భాగమయ్యే హక్కు నాకు ఉందంటూ తన ఆవేదనను ట్విట్టర్లో వెల్లడించాడు.

‘సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టుపై నా సమ్మతిని పొందలేదు. ఆఫ్ఘనిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తక్షణమే వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను. అఫ్గానిస్థాన్‌ తరఫున ఆడటం నాకు ఎప్పుడూ గర్వకారణమే’ అని సెప్టెంబర్‌ 9న రషీద్‌ ట్వీట్‌ చేశాడు.

ఆఫ్ఘనిస్తాన్ టీం పాకిస్తాన్‌ను ఎదుర్కొంది. దాని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ యుద్ధంలో దెబ్బతిన్న దేశాన్ని తాలిబన్ స్వాధీనం చేసుకోవడాన్ని సమర్థించారు. ఇది “బానిసత్వం సంకెళ్ళను” విచ్ఛిన్నం చేసింది. పాకిస్థాన్ ప్రస్తుతం గ్రూప్ 2లో మూడు విజయాలతో అగ్రస్థానంలో ఉండగా, స్కాట్‌లాండ్‌పై విజయం సాధించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ టీం పాకిస్తాన్ టీంపై ఓడిపోయి రెండో స్థానంలో నిలిచింది.

– సుభయన్ చక్రవర్తి

Also Read: India vs New Zealand: 1987 అక్టోబర్ 31 నాటి మ్యాచ్‌ను రిపీట్ చేస్తారా.. ఐసీసీ సెంటిమెంట్‌కు బలైపోతారా.. కోహ్లీ సేన ఏం చేయనుందో?

IND vs NZ, Live Score, T20 World Cup 2021: భారత్-న్యూజిలాండ్‌ల మధ్య డూ ఆర్ డై మ్యాచ్.. కీలకంగా మారిన టాస్