India vs New Zealand: 1987 అక్టోబర్ 31 నాటి మ్యాచ్‌ను రిపీట్ చేస్తారా.. ఐసీసీ సెంటిమెంట్‌కు బలైపోతారా.. కోహ్లీ సేన ఏం చేయనుందో?

టీ20 ప్రపంచ కప్ 2021లో అనేక రికార్డులు బద్దలవుతున్నాయి. ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ను ఓడించి, వరుస విజయాలకు ఇంగ్లండ్‌ బ్రేక్‌ వేసింది. భారత్‌పై పాకిస్థాన్ తన స్కోరును 12-1తో చేసింది.

India vs New Zealand: 1987 అక్టోబర్ 31 నాటి మ్యాచ్‌ను రిపీట్ చేస్తారా.. ఐసీసీ సెంటిమెంట్‌కు బలైపోతారా.. కోహ్లీ సేన ఏం చేయనుందో?
T20 World Cup 2021, Ind Vs Nz
Follow us

|

Updated on: Oct 31, 2021 | 3:55 PM

T20 World Cup 2021, IND vs NZ: టీ20 ప్రపంచ కప్ 2021లో అనేక రికార్డులు బద్దలవుతున్నాయి. ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ను ఓడించి, వరుస విజయాలకు ఇంగ్లండ్‌ బ్రేక్‌ వేసింది. భారత్‌పై పాకిస్థాన్ తన స్కోరును 12-1తో చేసింది. ఇక గత 18 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌ను ఓడించలేకపోయిన టీమిండియా వంతు వచ్చింది. ఈ సమయంలో, రెండు జట్లు వేర్వేరు ఫార్మాట్లలో 5 సార్లు తలపడ్డాయి. ప్రతిసారీ భారత జట్టు ఓడిపోయింది. ఈసారి అవకాశం అనుకూలంగా ఉంది. ఎందుకంటే తేదీ అక్టోబర్ 31 కాబట్టి. న్యూజిలాండ్‌ను ఓడించడానికి ఈ రోజు సరైన సమయం. ఈరోజు న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీ తప్పక గెలవడానికి ఓ కారణం కూడా ఉంది. అయితే ఇది విరాట్ కోహ్లి జన్మించకముందు జరిగిన ఓ మ్యాచ్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఆ టైంలో కూడా భారత్ తప్పక గెలవాల్సిన గేమ్, అలాగే రన్ రేట్ కూడా కీలకం అయిన పరిస్థితి. ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది.

1987 అక్టోబర్ 31 అంటే నేటికి సరిగ్గా 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ మ్యాచ్ సంగతి ఇప్పుడు చూద్దాం. విరాట్ కోహ్లీ అప్పుడు పుట్టలేదు. అతను 1988వ సంవత్సరంలో జన్మించాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 50 ఓవర్లలో భారత్ ముందు 222 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ సెమీ-ఫైనల్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సి ఉంది. దీంతో భారత జట్టు కేవలం 17.5 ఓవర్లకే ఈ స్కోరును చేజ్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున శ్రీకాంత్ 58 బంతుల్లో 75 పరుగులు చేయగా, సునీల్ గవాస్కర్ 88 బంతుల్లో 103 పరుగులు చేశాడు, ఇది వన్డేల్లో అతనికి మొదటి సెంచరీ.

మళ్లీ అక్టోబర్ 31న అవకాశం వచ్చింది.. 31 అక్టోబర్ 1987న జరిగిన ఆ ఎన్‌కౌంటర్ తర్వాత, 2007 టీ20 వరల్డ్ కప్‌లో భారత్-న్యూజిలాండ్ తలపడ్డాయి. భారత్ ఓడిపోయింది. అప్పుడు ప్రారంభమైన ఈ ఓటమి ప్రక్రియ నేటికీ కొనసాగుతోంది. అయితే ఈసారి దాన్ని బద్దలు కొట్టాల్సిందే. ఎందుకంటే తేదీ కూడా 31 అక్టోబర్ కాబట్టి. భారత్ ముందు పరిస్థితి కూడా డూ ఆర్ డైలానే మారింది కాబట్టి, ఈ మ్యాచులో కచ్చితంగా గెలవాల్సిందే. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోతే సెమీఫైనల్ ఆశలకు పెద్ద దెబ్బ తగులుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయం తప్పనిసరని, అందుకే 34 ఏళ్ల క్రితం ఆడినట్లు ఆడితే, ఇటు రన్ రేట్, అటు మ్యాచ్ కూడా గెలిచే అవకాశం ఉంది.

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి 5 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ వరుసగా విజయం సాధించింది. 2016 నుంచి ఇప్పటి వరకు 11 టీ20ల్లో భారత్ 8 గెలిచింది. ఈ గణాంకాలను చూస్తుంటే, టీమ్ ఇండియా 31 అక్టోబర్ రోజుని ప్రత్యేకంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

Also Read: T20 World Cup 2021, IND vs NZ: డ్యాన్స్ ఇరగదీసిన ఇషాన్, శార్దుల్.. ఫిదావుతోన్న ఫ్యాన్స్.. వైరలవుతోన్న వీడియో

T20 World Cup 2021: AUS vs ENG మ్యాచ్ తరువాత పాయింట్ల పట్టికలో మార్పులు.. గ్రూపు2లో సత్తా చాటిన పాక్.. బోణీ కొట్టని భారత్

IND vs NZ T20 World Cup 2021 Match Prediction: చావో రేవో తేల్చుకోనున్న భారత్, కివీస్.. రికార్డులెలా ఉన్నాయంటే?