Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ T20 World Cup 2021 Match Prediction: చావో రేవో తేల్చుకోనున్న భారత్, కివీస్.. రికార్డులెలా ఉన్నాయంటే?

Today Match Prediction of IND vs NZ: ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య 16 మ్యాచులు జరిగాయి. ఇందులో టీమిండియా 8, న్యూజిలాండ్ టీం 8 మ్యాచులో విజయాలు సాధించాయి. కాగా, టీ20 ప్రపంచకప్‌లో మాత్రం..

IND vs NZ T20 World Cup 2021 Match Prediction: చావో రేవో తేల్చుకోనున్న భారత్, కివీస్.. రికార్డులెలా ఉన్నాయంటే?
T20 World Cup 2021, Ind Vs Nz (3)
Follow us
Venkata Chari

|

Updated on: Oct 31, 2021 | 7:58 AM

IND vs NZ T20 World Cup 2021 Match Prediction: టీ20 ప్రపంచకప్ 2021 లో 28 వ మ్యాచ్‌లో భాగంగా సూపర్ సండే(అక్టోబర్ 31, ఆదివారం)‌ నాడు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టీంలు తలపడనున్నాయి. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్‌ని ఇరు జట్లకు వర్చువల్ నాకౌట్‌గా పరిగణిస్తున్నారు. ఈ గేమ్‌లో ఎవరు గెలిస్తే వారు మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన తొలి ఎన్‌కౌంటర్‌లో భారత్‌ చిత్తుగా ఓడిపోయింది. భారత్ ఆశించిన ప్రారంభాన్ని పొందడంలో విఫలమైంది. దీంతో కివీస్‌తో జరిగే పోరులో ప్లేయింగ్ XIలో మార్పులు ఉండొచ్చు.

మరోవైపు న్యూజిలాండ్ టీం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్‌ సేనవైపే మ్యాచ్ నిలిచింది. అయితే షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీల మధ్య ఆరో వికెట్ భాగస్వామ్యం కివీస్‌ నుంచి మ్యాచ్‌ను దూరం చేసింది. ఈ మ్యాచ్‌లో కివీస్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై 100 శాతం విజయాల రికార్డు న్యూజిలాండ్ సొంతం.

ప్రస్తుతం గ్రూప్‌ 2లో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. మరోవైపు, బ్లాక్ క్యాప్స్ కూడా విజయం సాధించలేదు. షార్జా క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఎప్పుడు: భారత్ vs న్యూజిలాండ్ (India vs New Zealand), సూపర్ 12 గ్రూప్ 2, అక్టోబర్ 31, రాత్రి 07:30 గంటలకు

ఎక్కడ: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం

లైవ్: స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

పిచ్: శుక్రవారం రాత్రి దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ టీం దాదాపు గెలిచినట్లే చేసింది. దీంతో ‘ఫస్ట్ బౌల్, మ్యాచ్ గెలవండి’ అనే ధోరణికి వ్యతిరేకం అని ఆఫ్గాన్ టీం రుజువు చేసింది. అయినా సరే టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకే మొగ్గు చూపుతుంది.

T20I హెడ్ టు హెడ్: ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య 16 మ్యాచులు జరిగాయి. ఇందులో టీమిండియా 8, న్యూజిలాండ్ టీం 8 మ్యాచులో విజయాలు సాధించాయి. కాగా, టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో గతంలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్ టీం విజయం సాధించడం గమనార్హం. 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్‌తో ఆడిన ఎనిమిది టీ20ల్లో భారత్ విజయం సాధించింది.

మీకు తెలుసా: – సోథీ టీ20ల్లో భారత్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (12 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు). సోథీ 2021లో కూడా అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. కేవలం ఎనిమిది టీ20ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.

– రోహిత్ శర్మ టీ20ల్లో 2019 నుంచి పరుగులు చేయడం చాలా తగ్గింది. (22 మ్యాచ్‌లలో 29.85సగటు) అయితే ఈ ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఓపెనర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 13 ఇన్నింగ్స్‌లలో 338 పరుగులు, నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు. అలాగే రోహిత్ టాప్ స్కోరు 80 పరుగులు.

ఇండియా గాయాలు/అందుబాటులో లేని ప్లేయర్లు: పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భుజం గాయం తరువాత హార్దిక్ పాండ్యా కోలుకున్నాడు. ఈమేరకు కోహ్లీ ఆల్ రౌండర్ ఫిట్‌గానే ఉన్నాడని ధృవీకరించాడు. అలాగే సన్నాహక సమయంలో ఆల్ రౌండర్ బౌలింగ్‌ కూడా చేయడంతో ఆరో బౌలర్‌గా బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది.

వ్యూహాలు: జస్ప్రీత్ బుమ్రాపై అతిగా ఆధారపడే భావనలను కోహ్లీ పక్కన పెట్టాడు. అయితే ఈ వ్యతిరేకత విషయానికి వస్తే ప్రీమియర్ బౌలర్ భారతదేశం తరపున ఉత్తమ ఛాయస్‌గా ఉన్నాడు. కివీస్‌పై బుమ్రా 9 ఇన్నింగ్స్‌ల్లో 10 వికెట్లు సాధించాడు. గతంలో జరిగిన మ్యాచుల్లో ప్రమాదకరమైన మార్టిన్ గప్టిల్‌ను పెవిలియన్ చేర్చిన ఘనత బుమ్రాదే. బుమ్రా విసిరిన 27 బంతుల్లో కేవలం 28 పరుగులు మాత్రమే న్యూజిలాండ్ ఓపెనర్‌ సాధించాడు. అయితే రెండుసార్లు అవుటయ్యాడు.

టీమిండియా ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్ గాయాలు/ అందుబాటులో లేని ప్లేయర్లు: పాకిస్తాన్‌ బౌలర్‌ హారిస్ రవూఫ్ వేసిన పేసీ యార్కర్‌కు మార్టిన్ గప్టిల్ కాలి బొటనవేలు దెబ్బతింది. అయితే ఈ గాయం పెద్దది కాకపోవడంతో ప్రమాదం తప్పింది. భారత్‌తో జరిగే మ్యాచులో అందుబాటులో ఉంటాడని కివీస్ మేనేజ్‌మెంట్ తెలిపింది.

వ్యూహాలు: ఈ ఫార్మాట్‌లో భారత్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సోథీ.. మరోసారి కీలకం కానున్నాడు. పవర్ ప్లేలో తన సత్తా చూపే అవకాశం ఉంది. సోథీ విసిరిన 39 బంతుల్లో కోహ్లి కేవలం 31 బంతుల్లోనే రెండుసార్లు ఔటయ్యాడు. రాహుల్ 34 బంతుల్లో 37 పరుగులు చేసి రెండుసార్లు ఔట్ అయ్యాడు.

భారత్ టాప్ ఆర్డర్‌లో మొత్తం రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్స్‌ ఉన్నారు. వీరి కోసం లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ (ట్రెంట్ బౌల్ట్), లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ (మిచెల్ సాన్ట్‌నర్)ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), జేమ్స్ నీషమ్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్ (కీపర్), మిచెల్ సాంట్నర్, ఇష్ సోథీ, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్

Also Read: AFG vs NAM T20 World Cup 2021 Match Prediction: ఇరుజట్ల మధ్య తొలిపోరు.. గెలిచేదెవరో.. ఆఫ్గనిస్తాన్, నమీబియా బలాలు ఎలా ఉన్నాయంటే?

T20 World Cup 2021: ఏకపక్షంగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌.. అలవోకగా లక్ష్యాన్ని చేధించిన మోర్గాన్ సేన..