T20 World Cup 2021: ఏకపక్షంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్.. అలవోకగా లక్ష్యాన్ని చేధించిన మోర్గాన్ సేన..
T20 World Cup 2021: సూపర్ 12 దశల్లో తమ తొలి మ్యాచులను అద్భుతమైన ఆరంభంతో మొదలుపెట్టిన రెండు జట్ల మధ్య జరిగిన పోరులో ఇంగ్లండ్ టీం ఘన విజయం సాధించింది. గ్రూప్ 1లో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలను..
T20 World Cup 2021: సూపర్ 12 దశల్లో తమ తొలి మ్యాచులను అద్భుతమైన ఆరంభంతో మొదలుపెట్టిన రెండు జట్ల మధ్య జరిగిన పోరులో ఇంగ్లండ్ టీం ఘన విజయం సాధించింది. గ్రూప్ 1లో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలను ఆక్రమించిన ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరుగుతుందని అందరూ ఆశించినా.. ఏకపక్షంగా సాగడం గమనార్హం. ఆస్ట్రేలియా ఇచ్చిన టార్గెట్‌ను ఇంగ్లండ్ టీం కేవలం 11.4 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 126 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లండ్ టీం ఓపెనర్లు జాసన్ రాయ్, జోస్ బట్లర్ (71 పరుగులు, 32 బంతులు, 5 ఫోర్లు, 5 సిక్సులు ధాటిగా ఆడి విజయాన్ని ఎంతో సులువు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్సులతో మొత్తం 76 పరుగులు కేవలం బౌండరీలతోనే రావడం విశేషం.
ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే, జాసన్ రాయ్ 22(20 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) పరుగుల వద్ద జంపా బౌలింగ్‌లో తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. వికెట్ పడినా జోస్ బట్లర్ మాత్రం ఆసీస్ బౌలర్లపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. డేవిడ్ మలాన్ 8 పరుగులకే ఔటయినా.. జానీ బెయిర్‌స్టో(16 పరుగులు, 11 బంతులు, 2 సిక్సులు) తో కలిసి జోస్ బట్లర్ ఇంగ్లండ్ టీంను విజయతీరాలకు చేర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా, అగర్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు ఇంగ్లండ్ టాస్ గెలవడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్ ఆది నుంచి చివరి వరకు పరుగులు చేసేందుకు అష్టకష్టాలు పడింది. నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందులో ఆరోన్ ఫించ్ 44(49 బంతులు, 4 ఫోర్లు) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వాడె 18, అగర్ 20, పాట్ కమిన్స్12, మిచెల్ 13 మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. వార్నర్ 1, స్మిత్ 1, మ్యాక్స్‌వెల్ 6, స్టోయినీస్ 0, జంపా 1 సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హజల్ వుడ్ 0 నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 1, క్రిస్ వోక్స్ 2, క్రిస్ జోర్డాన్ 3, లియాయ్ లివింగ్ స్టోన్ 1, టైమల్ మిల్స్ 2 వికట్లు పడగొట్టారు.
Also Read: Kameng River: కమెంగ్ నదిలో విషం చిమ్మిన చైనా.. వేల సంఖ్యలో చేపల మృత్యువాత
Puneeth Rajkumar: ‘మనుష్యులందు నీ కథ… మహర్షిలాగ సాగదా’.. కంఠీరవ కిక్కిరిసింది ఇందుకే
Rahul Gandhi: మోటర్ సైకిల్ టాక్సీపై రాహుల్.. గోవా ఎన్నికల ప్రచార పర్వానికి ముందు ఇలా..