Kameng River: కమెంగ్ నదిలో విషం చిమ్మిన చైనా.. వేల సంఖ్యలో చేపల మృత్యువాత

ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది ఒక్కసారిగా నలుపెక్కింది.. అందులో హాయిగా జీవిస్తున్న చేపలు, పీతలు ఇలా జలచరాలు ఒక్కసారిగా ఊరిరాడక ఒడ్డుకు చేరాయి. కుప్పలు కుప్పలుగా..

Kameng River: కమెంగ్ నదిలో విషం చిమ్మిన చైనా.. వేల సంఖ్యలో చేపల మృత్యువాత
Fish Die
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 30, 2021 | 8:28 PM

ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది ఒక్కసారిగా నలుపెక్కింది.. అందులో హాయిగా జీవిస్తున్న చేపలు, పీతలు ఇలా జలచరాలు ఒక్కసారిగా ఊరిరాడక ఒడ్డుకు చేరాయి. కుప్పలు కుప్పలుగా చనిపోయాయి. ఆ నది కాస్తా ఇప్పుడు చనిపోయిన చేపలతో నిండిపోయింది. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన చిత్రం వెలుగు చూసింది. అక్కడ కమెంగ్ నది నీరు అకస్మాత్తుగా నల్లగా మారింది. ఈ మేరకు అధికారులు శనివారం వివరాలు వెల్లడించారు. మొత్తం కర్బన ఉద్గారాలతో (టీడీఎస్) నది నీరు నల్లగా మారిందని జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు.

జిల్లా కేంద్రమైన సెప్పాలో శుక్రవారం నదిలో వేల సంఖ్యలో చేపలు చనిపోయాయని జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి (డీఎఫ్‌డీవో) హాలి తాజో తెలిపారు. చేపల మరణానికి సంబంధించి ప్రాథమిక పరిశోధనలను అధికారులు విడుదల చేశారు. నది నీటిలో TDS అధిక మోతాదులో ఉన్నాయని..  ఈ నీటిని తాగడం కాని.. చనిపోయిన చేపలను ఎవరూ తినవద్దని పేర్కొన్నారు. నది నీటిలో అధిక TDS కనిపించినందున చేపలు ఆక్సిజన్ తీసుకోలేకపోయాయని వెల్లడించారు.

నదిలో టీడీఎస్ లీటరుకు 6,800 మిల్లీగ్రాములుగా ఉందని ఇది లీటరుకు సాధారణ శ్రేణి 300-1,200 మిల్లీగ్రాముల కంటే చాలా ఎక్కువగా ఉందని ఒక నివేదికను ఉటంకించారు. చేపల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటిని తినవద్దని తాజో ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తూర్పు కమెంగ్ జిల్లా యంత్రాంగం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కామెంగ్ నదికి సమీపంలో చేపలు పట్టడం కోసం వెళ్లడం మానుకోవాలని.. చనిపోయిన చేపలను తినడం, అమ్మడం మానుకోవాలని ప్రజలకు సూచించారు.

చైనా కారణంగా..

నదిలో టీడీఎస్ పెరగడానికి చైనా కారణమని సెప్పా వాసులు ఆరోపించారు. పొరుగు దేశం చేస్తున్న నిర్మాణ పనుల వల్ల నీటి రంగు నల్లగా మారిందని ఆరోపించారు. కమెంగ్ నది నీటి రంగు అకస్మాత్తుగా మారడం.. పెద్ద సంఖ్యలో చేపలు చనిపోవడానికి గల కారణాలను అన్వేషించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సెప్పా తూర్పు ఎమ్మెల్యే తపుక్ టాకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కమెంగ్ నదిలో ఈ ఘటన ఎప్పుడూ జరగలేదని టాకు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..

Surat Sarees: చీరల వ్యాపారులకు షాకింగ్ న్యూస్.. సూరత్‌లో పెరుగనున్న ధరలు.. ఎంత పెరుగొచ్చంటే..

PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!