Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs nz: జట్టులో మార్పు ఉంటుందా.. ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే..?

టీ20 ప్రపంచ కప్‎‎లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. సూపర్ 12లో భాగంగా టీం ఇండియా ఈ రోజు న్యూజిలాండ్‎తో తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది...

Ind Vs nz: జట్టులో మార్పు ఉంటుందా.. ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే..?
Ind
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 31, 2021 | 8:11 AM

టీ20 ప్రపంచ కప్‎‎లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. సూపర్ 12లో భాగంగా టీం ఇండియా ఈ రోజు న్యూజిలాండ్‎తో తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. గత ఆదివారంలో పాకిస్తాన్‎తో జరిగిన మ్యాచ్‎లో ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మంగళవారం పాకిస్తాన్ చేతిలో కివీస్ కూడా ఓటమిని చవిచూసింది. అయితే పాక్ చేతిలో భారత్ ఘోర పరాభవం ఎదురు కాగా న్యూజిలాండ్ మాత్రం పోరాడి ఓడింది. ఈ పోరులో గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉంటాయి. దీంతో ఇవాళ్టి మ్యాచ్‎ను ఇరు జట్లు సీరియస్‎గా తీసుకున్నాయి. అయితే గత రికార్డులు ఇండియాను భయపెడుతున్నాయి. 2007 టీ20 ప్రపంచకప్‌, 2016 టీ20 వరల్డ్‌కప్‌, 2019 వన్డే ప్రపంచకప్‌, ఇటీవలి, మొట్టమొదటి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లలో కివీస్‌ చేతిలో భారత్ ఓడిపోయింది. పాకిస్తాన్ ‎కు కూడా టీ20, వన్డే వరల్డ్ కప్పుల్లో టీం ఇండియాపై పూర్ రికార్డు అయినా వారు భారత్‎ను ఓడించారు.

అయితే ఇప్పటి నుంచి ఇండియాకు ప్రతీ మ్యాచ్‌ కీలకం కానుంది. భారత్ ఈ మ్యాచ్‌తోపాటు అఫ్ఘాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌పై గెలిస్తే సెమీస్‎కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రారంభ మ్యాచ్‌లో భారత్‌ ఆడిన తీరు అభిమానులు నిరాశపరిచింది. పాక్‎తో మ్యాచ్‎లో బౌలర్లు ఒక్క వికెట్ తీయకపోవడం ఆందోళన కలిస్తున్న విషయం. ఇదే పిచ్‎పై పాకిస్తాన్ బౌలర్ల అలవోకగా వికెట్లు తీశారు. ఇప్పుడు న్యూజిలాండ్‎పై తమ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చకుంటే ఇండియాకు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి.

కివిస్‎తో జరిగే మ్యాచ్‎లో భారత పాక్‎తో ఆడిన జట్టునే బరిలో దింపాలని చూస్తోంది. గత మ్యాచ్‎లో నిరుత్సాహపరిచిన ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‎లో రాణిస్తే భారత్‎కు విజయవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్‎పై కూడా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కోహ్లీ పాక్‎తో మ్యాచ్‎లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, షమీతో కూడిన బౌలింగ్ దళం టీమ్‌ఇండియాకూ ఉంది. అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విఫలమవ్వడం జట్టును కలవరపెడుతోంది. కివీస్‌పై రాణించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అలానే రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి తమ స్పిన్‌ మాయను ప్రదర్శించాలని కోరుకుంటున్నారు. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో వీరిద్దరూ పెద్దగా ప్రభావం చూపలేదు. న్యూజిలాండ్ విషయానికొస్తే కేన్‌ విలియమ్సన్‌, గుప్తిల్‌, మిచెల్, నీషమ్, టిమ్‌ సౌథీ, బౌల్ట్ బలంగా ఉంది. పాక్‎తో మ్యాచ్‎లో కివీస్ బాగానే రాణించింది కానీ ఓటమిని తప్పించుకోలేకపోయింది. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్‎లో టాస్ కీలకంగా మారే అవకాశం ఉంది. జట్లు (అంచనా) భారత్‌: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్‌, రాహుల్‌, సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌, జడేజా, భువనేశ్వర్‌, షమి, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా. న్యూజిలాండ్‌: కేన్ విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్‌, మిచెల్‌, కాన్వే, ఫిలిప్స్‌, నీషమ్‌, సైఫర్ట్‌, శాంట్న ర్‌, సౌథీ, సోధీ, బౌల్ట్‌.

Read Also.. T20 World Cup 2021: ఏకపక్షంగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌.. అలవోకగా లక్ష్యాన్ని చేధించిన మోర్గాన్ సేన..