T20 World Cup 2021: AUS vs ENG మ్యాచ్ తరువాత పాయింట్ల పట్టికలో మార్పులు.. గ్రూపు2లో సత్తా చాటిన పాక్.. బోణీ కొట్టని భారత్

ఇయాన్ మోర్గాన్ సేన టీ 20 ప్రపంచ కప్ సూపర్ 12 దశలో ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించి గ్రూప్ 1 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు తొలి ఓటమితో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.

T20 World Cup 2021: AUS vs ENG మ్యాచ్ తరువాత పాయింట్ల పట్టికలో మార్పులు..  గ్రూపు2లో సత్తా చాటిన పాక్.. బోణీ కొట్టని భారత్
T20 World Cup 2021, Eng Vs Aus
Follow us
Venkata Chari

|

Updated on: Oct 31, 2021 | 9:57 AM

T20 World Cup 2021: ఇయాన్ మోర్గాన్ సేన టీ 20 ప్రపంచ కప్ సూపర్ 12 దశలో ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించి గ్రూప్ 1 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు తొలి ఓటమితో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. గ్రూప్ 1లో శనివారం జరిగిన రెండు మ్యాచ్‌లు పాయింట్ల పట్టికలో కొన్ని స్థానాలను మార్చాయి. డబుల్ హెడర్స్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్, కగిసో రబాడల దెబ్బకు దక్షిణాఫ్రికా రెండు కీలక పాయింట్లను సాధించడంలో సహాయపడ్డారు. వీరి బౌండరీల దెబ్బకు వనిందు హసరంగా తొలి టీ20ఐ హ్యాట్రిక్ ఫలించలేదు.

ICC Mens T20 World Cup 2021 – Points Table- Super 12 Group 1 రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడు విభాగాల్లో తమ చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇంగ్లిష్ బౌలర్లు ఆసీస్‌ను కేవలం 125 పరుగులకే కట్టడి చేయడంతో ఆట మొత్తం ఆరోన్ ఫించ్ సేన నుంచి ఇయార్ మోర్గాన్ సేన లాగేసుకుంది. ఆపై జోస్ బట్లర్ తుఫాన్ బ్యాటింగ్‌తో కేవలం 11.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. ఆసీస్ నెట్ రన్‌ రేట్ నెగిటివ్‌లో ఉండడంతో దక్షిణాఫ్రికా గ్రూప్ 1లో రెండవ స్థానానికి చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియాకు తీవ్ర నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. ఇంకో రెండు మ్యాచులు ఆడాల్సి ఉన్నందున ఎలాంటి మార్పులు రానున్నాయో చూడాలి.

Group11

ఇంగ్లండ్ టీం 3 మ్యాచులు ఆడి 3 విజయాలు సాధించి అగ్రస్థాంలో నిలిచింది. 6 పాయింట్లతో నెట్ రన్ రేట్ +3.948 గా ఉంది. దక్షిణ ఆఫ్రికా టీం 3 మ్యాచులు ఆడి 2 విజయాలు, ఒక మ్యాచులో ఓడి 4 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. దక్షాణాఫ్రికా +0.210 నెట్ రన్ రేట్‌తో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా టీం 3మ్యాచులు ఆడి 2 విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లతో -0.627 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో నిలిచింది.

ICC Mens T20 World Cup 2021 – Points Table- Super 12 Group 2 సూపర్ 12 గ్రూపు 2 లో పాకిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఒక విజయం, 2 పాయింట్లతో ఆఫ్గనిస్తాన్, నమీబియా రెండు, మూడు స్థానాలను ఆక్రమించాయి. ఈ జట్లకు నెట్ రన్ రేట్ పాజిటివ్‌గా ఉండడం కూడా కలిసొచ్చింది. అయితే గ్రూపు 1తో పోల్చితే గ్రూపు 2లో మ్యాచులు తక్కువుగా జరిగాయి. గ్రూపు 1లో అన్ని జట్లు 3 మ్యాచులు పూర్తి చేసుకోగా, గ్రూపు2 లో మాత్రం ఇంకా కొన్ని జట్లు 1 మ్యాచ్‌ మాత్రమే ఆడాయి. అయితే నేడు గ్రూపు 2లో రెండు మ్యాచులు జరగనున్నాయి. ఈ మ్యాచులు పూర్తయితే గానీ, ఓ క్లారిటీ వచ్చేలా లేదు. ఎందుకంటే భారత్, న్యూజిలాండ్ టీంలు తలో ఓటమితో ఇంతవరకు గ్రూపు2లో పాయింట్లు సాధించలేదు.

Group2

పాకిస్తాన్ టీం 3 మ్యాచులు ఆడి 3 విజయాలు సాధించి అగ్రస్థాంలో నిలిచింది. 6 పాయింట్లతో నెట్ రన్ రేట్ +0.638 గా ఉంది. ఆఫ్గనిస్తాన్ టీం 2 మ్యాచులు ఆడి ఒక విజయం, ఒక పరాజయంతో 2 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆఫ్గనిస్తాన్ టీం +3.092 నెట్ రన్ రేట్‌తో కొనసాగుతోంది. ఇక నమీబియా టీం 1మ్యాచ్ ఆడి ఒక విజయంతో 2 పాయింట్లు సాధించి +0.550 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో నిలిచింది. భారత్, న్యూజిలాండ్ టీంలు చెరో మ్యాచ్ ఆడి, ఓటమిపాలయ్యాయి.

Also Read: Ind Vs Pak: బాబర్ మ్యాచ్ ఆడుతుంటే.. అతడి తల్లి వెంటిలేటర్‎పై ఉంది.. అసలు ఏం జరిగిందంటే..

IND vs NZ T20 World Cup 2021 Match Prediction: చావో రేవో తేల్చుకోనున్న భారత్, కివీస్.. రికార్డులెలా ఉన్నాయంటే?