Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woman Coach: క్రికెట్‌ చరిత్రలో మరో సంచలనం.. పురుషుల జట్టుకు మహిళా కోచ్..

Woman Coach: మెన్స్ ఫ్రాంఛైజ్‌ క్రికెట్‌లో మొట్టమొదటి ఫీమేల్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించింది సారా టేలర్‌. తొలిసారిగా ఓ పురుషుల జట్టుకు మహిళా క్రికెటర్​ను కోచ్​గా నియమిస్తున్నట్లు

Woman Coach: క్రికెట్‌ చరిత్రలో మరో సంచలనం.. పురుషుల జట్టుకు మహిళా కోచ్..
Sarah Taylor
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 31, 2021 | 9:13 AM

Woman Coach: మెన్స్ ఫ్రాంఛైజ్‌ క్రికెట్‌లో మొట్టమొదటి ఫీమేల్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించింది సారా టేలర్‌. తొలిసారిగా ఓ పురుషుల జట్టుకు మహిళా క్రికెటర్​ను కోచ్​గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ఫ్రాంచైజ్‌ తెలిపింది. దీంతో క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి టీమ్ అబుదాబి శ్రీకారం చుట్టినట్లయింది. అబుదాబీ టీ10 లీగ్‌లో మాజీ ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్‌ను అసిస్టెంట్​ కోచ్​గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ట్విటర్‌లో వెల్లడించింది.

కాగా ఇంతకుముందు ఇంగ్లండ్ మెన్స్ కౌంటీ టీమ్‌ ససెక్స్‌ జట్టుకి స్పెషలిస్ట్ కోచ్‌(వికెట్ కీపింగ్ కోచ్‌)గానూ సారా టేలర్ బాధ్యతలు నిర్వహించింది. ఇక ఇంగ్లండ్‌ సాధించిన రెండు వన్డే వరల్డ్‌ కప్‌లు, ఒక టీ20 వరల్డ్‌ కప్‌ జట్లలో ఆమె సభ్యురాలిగా ఉంది. కాగా నవంబర్ 19 నుంచి అబుదాబి టీ10 లీగ్‌ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో సారా టేలర్ కోచ్‌గా ఉన్న టీమ్ టైటిల్ కోట్టినట్లయితే.. ఆమె పేరు ప్రఖ్యాతలు మరింత పెరుగాయడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, సారా టేలర్‌కు సీనియర్ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.

Als0 read:

Jammu and Kashmir: ఎల్ఓసీ వెంట పేలిన మందుపాతర.. ఇద్దరు జవాన్ల వీరమరణం..

లోయర్ బెర్త్ టికెట్ కన్ఫమ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేయండి.. వీడియో

Viral Video: రిక్షావోడి పాన్‌కార్డుతో రూ.43 కోట్ల అక్రమ వ్యాపారం.. వీడియో