Viral Video: రిక్షావోడి పాన్‌కార్డుతో రూ.43 కోట్ల అక్రమ వ్యాపారం.. వీడియో
ఓ నిరుపేద రిక్షావాడికి ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. అది కూడా ఏకంగా 3.47 కోట్ల పన్ను కట్టాలని..! దీంతో కంగుతిన్న ఆ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించాడు.
ఓ నిరుపేద రిక్షావాడికి ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. అది కూడా ఏకంగా 3.47 కోట్ల పన్ను కట్టాలని..! దీంతో కంగుతిన్న ఆ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించాడు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మథురలోని బకల్‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రతాప్ సింగ్‌ది పేద కుటుంబం. రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వచ్చే ఆదాయంలో ఖర్చులు పోగా కొంతమొత్తాన్ని బ్యాంకులో పొదుపు చేసుకుంటున్నాడు. అయితే, తన ఖాతాకు పాన్ కార్డ్ అనుసంధానం చేయాలని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఈ ఏడాది మార్చి 15న పాన్‌కార్డ్ కోసం స్థానిక జన్ సువిధ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు సంజయ్ సింగ్ అనే ఓ వ్యక్తి ప్రతాప్‌కు పాన్‌కార్డ్ కలర్డ్ జిరాక్స్ కాపీ ఇచ్చాడు. అయితే నిరక్షరాస్యుడైన ప్రతాప్ ఆ నకిలీ కార్డును గుర్తించలేకపోయాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
పసుపుతో కాన్సర్‌కు చెక్.. కానీ..! కొనసాగుతున్న పరిశోధనలు.. వీడియో