AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పార్టీలో కోహ్లీ, అనుష్క శర్మ కూతురు వామిక.. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫొటోలు..

అనుష్క శర్మ.. విరాట్ కోహ్లి, కూతురు వామిక, ఇతర క్రికెటర్ల పిల్లలతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ పార్టీలో వామికను దేవకన్యలా తయారు చేసిన తీసుకొచ్చారు...

Viral: పార్టీలో కోహ్లీ, అనుష్క శర్మ కూతురు వామిక.. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫొటోలు..
Virat
Srinivas Chekkilla
|

Updated on: Oct 31, 2021 | 11:35 AM

Share

అనుష్క శర్మ.. విరాట్ కోహ్లి, కూతురు వామిక, ఇతర క్రికెటర్ల పిల్లలతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ పార్టీలో వామికను దేవకన్యలా తయారు చేసిన తీసుకొచ్చారు. ఫొటోతో పాటు వీడియో కూడా ఆమె ఇన్‎స్టాగ్రామ్‎లో పోస్ట్ చేశారు. క్రికెటర్ ఇషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిచ్ కుమారుడు అగస్త్యను పట్టుకుని కనిపించాడు. వామిక సీతకోకచిలుక ఫ్రిల్లీ ఫ్రాక్ ధరించి ఎంజల్‎లా నేలపై కూర్చుంది. వీడియోలో విరాట్ కోహ్లీ తన చేతుల్లో వామికతో క్యాండీలను సేకరిస్తున్నట్లు కనిపించాడు. రిషబ్ పంత్ చిన్నారులకు చాక్లెట్లు ఇచ్చారు. శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ డ్యాన్స్ చేశారు.

Virat1

Virat1

కొన్ని రోజుల క్రితం, విరాట్ కోహ్లీ తన భార్య, కూతురు కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో విరాట్, అనుష్క అల్పాహారం కోసం టెబుల్ వద్ద కూర్చున్నప్పుడు వామిక కూడా కుర్చీలో కూర్చుంది. అనుష్క, విరాట్ డిసెంబర్ 2017లో వివాహం చేసుకున్నారు. వారికి జనవరి 2021లో వామికను జన్మించింది. వారు ఇటీవలే వామిక ఆరు నెలల పుట్టినరోజును జరుపుకున్నారు. సోషల్ మీడియా ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

కాగా టీ 20 వరల్డ్ కప్‎లో ఈరోజు భారత జట్టు న్యూజిలాండ్‎తో తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే గత రికార్డులు ఇండియాను భయపెడుతున్నాయి. 2007 టీ20 ప్రపంచకప్‌, 2016 టీ20 వరల్డ్‌కప్‌, 2019 వన్డే ప్రపంచకప్‌, ఇటీవలి, మొట్టమొదటి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లలో కివీస్‌ చేతిలో భారత్ ఓడిపోయింది. పాకిస్తాన్ ‎కు కూడా టీ20, వన్డే వరల్డ్ కప్పుల్లో టీం ఇండియాపై పూర్ రికార్డు అయినా వారు భారత్‎ను ఓడించారు.

Read Also..Ind Vs Pak: బాబర్ మ్యాచ్ ఆడుతుంటే.. అతడి తల్లి వెంటిలేటర్‎పై ఉంది.. అసలు ఏం జరిగిందంటే..

Puneeth Raj Kumar: బరువెక్కిన గుండెలతో అభిమాన హీరోకు వీడ్కోలు.. పునీత్ నుదుటిపై ముద్దాడిన సీఎం..