- Telugu News Photo Gallery Cinema photos Kannada power star puneeth rajkumar's last rites today moring photos
Puneeth Raj Kumar: బరువెక్కిన గుండెలతో అభిమాన హీరోకు వీడ్కోలు.. పునీత్ నుదుటిపై ముద్దాడిన సీఎం..
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు కాసేపటి క్రితం ముగిశాయి.
Updated on: Oct 31, 2021 | 10:19 AM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు కాసేపటి క్రితం ముగిశాయి.. బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో వేలాది మంది అభిమానులు.. కుటుంబసభ్యులు.. సన్నిహితుల మధ్య ప్రభుత్వ లాంఛానాలతో పునీత్‌కు కడసారి వీడ్కోలు తెలిపారు.

రెండు రోజులుగా లక్షలాది మంది అభిమానుల సందర్శన అనంతరం ఇవాళ తెల్లవారు జామున అంతిమయాత్ర ప్రారంభమైంది.

పునీత్ అంత్యక్రియలకు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప, ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య హజరయ్యారు... అనుకున్న సమయం కన్నా ముందే అంత్యక్రియలు నిర్వహించారు..

అభిమానుల తాకిడి దృష్టిలో ఉంచుకొని తెల్లవారుజామున కంఠీరవ స్టూడియో కు పునీత్ రాజ్ కుమార్ పార్ధివదేహాన్ని తీసుకొచ్చారు.

పునీత్‌కు వీడ్కోలు తెలుపుతూ కర్ణాటక సీఎం అప్పు నుదుడిపై ముద్దు పెట్టారు.

కేవలం కుటుంబ సభ్యులు కొంతమంది ప్రముఖుల మధ్య అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రత్యేకించి పునీత్ సాంప్రదాయం ప్రకారం కొంతమంది స్వామీజీలు ప్రత్యేక పూజలు నిర్వహించి అత్యంత శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే అంతిమ సంస్కారం నిర్వహించారు.

చివరిసారిగా తమ అభిమాన హీరో పునీత్‌ను చూసేందుకు కంఠీరవ స్టూడియో చుట్టూ వేలాదిగా అభిమానులు నిల్చోన్నారు.

బరువెక్కిన గుండెలతో పునీత్ రాజ్ కుమార్‌కు తుది వీడ్కోలు పలికారు కుటుంబసభ్యులు.. అభిమానులు.





























