Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: విదేశంలో ఉద్యోగం వదిలేసి వ్యవసాయం మొదలు పెట్టిన యువకుడు.. యూట్యూబ్‌లో చూసి డ్రాగన్ సాగు.. లక్షల్లో సంపాదన

వాస్తవానికి మణిందర్ సింగ్ కు వ్యవసాయంలో ఎటువంటి అనుభవం లేదు. అందులోనూ విదేశీ పంట డ్రాగన్ ఫ్రూట్ సాగు విషయంలో అవగాహనా లేదు. దీంతో యూట్యూబ్ ను ఆశ్రయించాడు. దీంతో మణిందర్ సింగ్ డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాడు. గత మూడేళ్లుగా తండ్రి తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో డ్రాగన్‌ఫ్రూట్‌ సాగు చేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నాడు.

Success Story: విదేశంలో ఉద్యోగం వదిలేసి వ్యవసాయం మొదలు పెట్టిన యువకుడు.. యూట్యూబ్‌లో చూసి డ్రాగన్ సాగు.. లక్షల్లో సంపాదన
Success Story
Follow us
Surya Kala

|

Updated on: Sep 15, 2023 | 12:09 PM

నేటి తరంలో భిన్నమైన ఆలోచనలు కలిగిన ఉంటున్నారు. కొందరు తమ భవిష్యత్ బాగుండాలంటే మంచి చదువు, మంచి ఉద్యోగం అందుకు తగిన జీతం ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం ఎక్కువ మంది విదేశాలకు వెళ్లాలని భావిస్తారు. అక్కడే చదువు పూర్తి చేసి ఉద్యోగం అవకాశాల కోసం కష్టపడి తమ శ్రమకు తగిన ఉద్యోగాన్ని ఎంచుకుని అక్కడే స్థిరపడాలని కోరుకుంటారు. అదే సమయంలో ఉన్నత చదువులు చదువుకున్న యువత ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఒకరి కింద ఉద్యోగం చేయడం కంటే స్వశక్తిని నమ్ముకోవాలని భావిస్తున్నారు. తమ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి.. వ్యాపార, వ్యవసాయ రంగాల్లోకి అడుగు పెడుతున్నారు. తాము అడుగు పెట్టిన రంగంలో ఆధునికతను జోడించి సక్సెస్ ను అందుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు విదేశాల్లో చేస్తున్న ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి.. సొంత ఊరుకు వచ్చి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. తాను నమ్ముకున్న పండు సిరులు కురిపిస్తుందని చెబుతున్న యువ రైతు గురించి తెలుసుకుందాం..

పంజాబ్ లోని హోషియార్‌పూర్ కి చెందిన మణిందర్ సింగ్ సందర్.. చదువు పూర్తి అయ్యాక న్యూజిలాండ్ లో ఉద్యోగం చేసేవాడు. అయితే ఎప్పుడూ సొంత ఊరుమీదే ఆలోచనలు ఉండేవి. దీంతో భారత దేశానికి తిరిగి వచ్చాడు. ఇక్కడ ఉద్యోగం వద్దనుకుని సొంత ఊరులో వ్యవసాయం చేయడం ప్రారంబించాడు. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ సక్సెస్ అందుకున్నాడు. వాస్తవానికి పంజాబ్ భూముల్లో డ్రాగన్ సాగు బహు అరుదు. దీంతో  డ్రాగన్ సాగు చేయడం మొదలు పెట్టిన మొదట్లో..అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయినా నిరాశ చెందక కృషి, పట్టుదలతో తన సాగు లాభాలను అందించే వరకూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

యూట్యూబ్ సహాయంతో డ్రాగన్ సాగు 

ఇవి కూడా చదవండి

వాస్తవానికి మణిందర్ సింగ్ కు వ్యవసాయంలో ఎటువంటి అనుభవం లేదు. అందులోనూ విదేశీ పంట డ్రాగన్ ఫ్రూట్ సాగు విషయంలో అవగాహనా లేదు. దీంతో యూట్యూబ్ ను ఆశ్రయించాడు. దీంతో మణిందర్ సింగ్ డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాడు. గత మూడేళ్లుగా తండ్రి తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో డ్రాగన్‌ఫ్రూట్‌ సాగు చేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నాడు.

తాను భారత్ కు తిరిగి రాక ముందు న్యూజిలాండ్‌లో ఉద్యోగం చేసేవాడినని.. జీతం కూడా బాగుందని మణిందర్ సింగ్ చెప్పాడు. అయితే తనకు ఏదైనా భిన్నంగా చేయాలనుకుంటున్న సమయంలో సోషల్ మీడియాలో డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయానికి సంబదించిన సమాచారం చూసినట్లు పేర్కొన్నాడు. అప్పుడు తన దృష్టి దీనిసాగు పై పడింది. దీంతో డ్రాగన్ ఫ్రూట్ సాగు.. తమ సొంత భూముల్లో అంటే పంజాబ్ రాష్ట్రంలోని భూముల్లో దీనిని సాగు చేయవచ్ఛా అనే విషయంపై విషయాలను సేకరించాడు. పంజాబ్ భూములు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనుకూలమని నిపుణులు చెప్పారు. దీంతో మణిదందర్ తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి.. భారత దేశానికి పయనం అయ్యాడు. సొంత ఊరులో వ్యవసాయం ప్రారంభించాడు.

పెట్టుబడి ఎంత పెట్టాలంటే..

ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనుకూల సమయం ఫిబ్రవరి నుంచి మార్చి వరకూ అని.. ఈ నెలల్లో విత్తుకోవాలని మణిందర్ సింగ్ చెప్పారు. విత్తిన ఒక ఏడాది తర్వాత పంట మొదలఅవుతుంది. అయితే డ్రాగన్ ఫ్రూట్ రెండేళ్లకు చేతికి వస్తుందని పేర్కొన్నారు. ఒక ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగులో సుమారు రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలని.. పంట చేతికి వచ్చిన తర్వాత రెట్టింపు లాభం వస్తుందని చెప్పారు. తాను ఈ డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుతో జీతం కంటే ఎక్కువగా డబ్బులను సంపాదిస్తున్నట్లు మణిందర్‌ సింగ్‌ తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్ డెంగ్యూ బాధితులకు మేలు చేస్తుందన్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..