- Telugu News Photo Gallery Success story of ias officer dikshita Joshi gives tips to cracked upsc exam in telugu
Success Story: కోచింగ్ లేకుండానే సివిల్స్ ర్యాంక్ సాధించిన దీక్షితా.. అభ్యర్థులకు ఆమె చెబుతున్న చిట్కాలు ఇవే
తాము నిర్దేశించుకున్న లక్షాన్ని సాధించాలనే కృషి పట్టుదల ఉంటే చాలు.. సాధించలేదని ఏదీ ఉండదు అని అనేక మంది నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ఫార్మసిస్ట్ కూతురు IAS అయ్యింది. అది కూడా ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన దీక్షిత జోషి UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022లో 58వ ర్యాంక్ సాధించి.. ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు.
Updated on: Aug 03, 2023 | 1:17 PM

వాస్తవానికి UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పోటీ పరీక్ష కోసం అనేక మంది ఎంతో కష్టపడతారు. సివిల్స్ రాయాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షలో విజయం సాధించడానికి సంవత్సరాలు పడుతుంది. సరైన ప్రిపరేషన్‌తో పాటు, ఈ పరీక్షలో విజయం సాధించడానికి IAS-IPS అందించే చిట్కాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఏడాది ఐఏఎస్ కాబోతున్న దీక్షితా జోషి కూడా పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలో కొన్ని చిట్కాలు ఇచ్చారు.

2022లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన దీక్షితా జోషి IAS అధికారిగా ఎంపికయ్యారు. యూపీఎస్సీ పరీక్షలో 58వ ర్యాంకు సాధించారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. దీక్షితా సివిల్స్ ప్రిపేర్ అయ్యేందుకు ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. స్వయంగా సిద్దమైనట్లు తెలుస్తోంది.

దీక్షితా జోషి ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ నివాసి. ఆర్యమాన్ విక్రమ్ బిర్లా స్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించారు. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తరువాత జిబి పంత్ విశ్వవిద్యాలయం పంత్‌నగర్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకున్నారు దీక్షితా. ఐఐటీ మండి నుంచి మాస్టర్స్ చేశారు.

మాస్టర్స్ చేస్తున్న సమయంలో దీక్షిత UPSC పరీక్షలను రాయాలని నిర్ణయించుకున్నారు. ఐతే సివిల్స్ లో ఉత్తీర్ణత కోసం ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. అయినప్పటికీ UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణుత సాధించారు. దీక్షిత తండ్రి ఫార్మసిస్ట్ , ఆమె తల్లి ఇంటర్ కాలేజీలో హిందీ లెక్చరర్.

యుపిఎస్‌సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి దీక్షితా చిట్కాలు ఇచ్చారు. ఓటమికి ఎప్పుడూ భయపడకూడదని అన్నారు. UPSCని ఛేదించడానికి ఏకాగ్రతను మిస్ కావద్దు. ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాల నుండి నోట్స్ సిద్ధం చేసుకోండి.





























